Thursday, March 12, 2026

మనసా మనసా మరి సామరసమే
ఆత్మా రామము అజరామరమే
ప్రతి రూపువే నీవు ప్రాపంచిక సంచిత ప్రతివే
అజరామర ఆత్మారామపు అతఃకరణ
నీ యునికి కబేధయైన యప్రపంచిక యవనికయే
నిలిచి నిలిచి నన్నునే గ్రహింతునా
పిలిచి పిలిచి తలపుల నిగ్రహింతునా
మదీ తమకము వీడను కమఠ బంధవైతివిగదా
విదియె కలపుల విడదీసి కలిపి కలాపమాడునా
త్వరితపడు మనునది మది కాజాలదు
ఆత్మానాత్మవివేచనా క్షుభిత పిపాస
నీవు బేధ రహిత చరితా జరత్కారి కవే
దాహమగుచున్నది దప్పిక తీర్పవె
కానరాకున్నది దారి చూపవె
నిస్పృహనైతిని స్పర్శా మాత్రవుకమ్ము
మరిజన్మ మరుల వెంట పరువెత్తజాల
గురుతౌ పరిపరి విధముల సంచితములు..

No comments:

Post a Comment