Saturday, January 18, 2025

 మంచువాన జల్లించినపంచదారలా

అంచెలంచలుగా పరుచుకుంటోంది
నేల తల్లి తెల్ల ధావళాకప్పుకు సిధ్ధమైంది
తనూ వండి పెట్టాలి మరి మార్ఘజి సాదం
తిమిరంపు తెరతొలగి వడలుజలదరించె
పరువంపు ఋతుపల్లవింపున పుడమికి
పైయెత్తు యిన్ర పరమ నడిపాడి,వడలు
పరమ పారపశ్యమున పులకరింతలౌగ
తను పాలనేతుల చేతవెన్నముద్దలుజేసి
ఏరారందకణ్ణని కడుపారగ యారగింపిడ
కడగంటి చూడ్కుల కోరి,శోషిల్లును గద!
తినదె తల్లి తనుకృష్ణ పీడితయై త్రావదె
పాలుపెరుగు కృష్ణార్ణవవ్రతపీడితయై
కాటుకనియ్యకోనదె పుడమినతల్లియై
వ్రతభరితమది వేడ్కన తపఃమగ్నయై
అమ్మా ధరణి ఆవరణములన్నియునిండె
నల్లచీకటులకాటుకలనిండిన మాయగాని
వెదుకులాటన తిరిగి తిరిగి, గొదనడగవె
కళల పట్టి కనుల మాటున నుండనోపు
నంద గొపాలుడానంద సంగతుడె
భక్తిరస కందళిత గోదమ్మ కంటికి
వంటికి యంటుగాడైయుండనోపు