Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

11 March 2018 
Shared with Friends
కలవరించే మనసుకి కళ్ళు
కనరాని పగలుకు వెలుగు
గురుతులేని రాతిరి మూగమనసు
చెరిగిపోనీఅలాపననిదురలోజోలపాట
కరిగిన మంచు మంచితనపు అంచు
చల్లకొచ్చి ముంతదాచే పిచ్చి మనసు
కొల్లగొట్టే కళ్ళచాటు తీపి ప్రేమ
అంచులులేనికంచము హద్దులులేనిప్రేమ
సారస సుధామధురము అన్యోన్యతా జీవనము
ప్రేమకంటూ ప్రత్యేక నిర్వచనము
స్నేహబంధంలో వికసించి విరబూచేదే
తరిగే జీవనయానంలో పెరిగేదేప్రేమ
స్నేహమే దాని వలువా విలువా
సీర్ణమేఖల మాటున వెలిగే
సుందర నందన చందన గంధము
క్రిష్ణ ప్రేమలో తోలగిజారిన వలిపెము
రాధమనసులో ప్రజ్వలిత పరిమళజ్యోతి

No comments:

Post a Comment