Friday, March 13, 2026

 yanarayana Charyulu Maringanti

1 April 2016 
Shared with Friends
సంగతులన్నీ గతాన్ని స్మరించేవే
శరీరము మొరాయించినప్పుడు
గ్జ్నాపకాల గుట్టు విప్పుతుంది మనసు
కొన్ని తలచుకు పంచుకునేవైతే
మరి కొన్ని తల దించుకు దిగ్రుళ్ళేవి
మనసూ తెలుసుకుంటూనే ఉంటుంది
విషయాలన్నీ వడ్డించిన విస్తరి కావనీ
వలయము దాటి కొన్ని వినేవనీ
మరికొన్ని పరిధిలోవున్నా చూడొద్డ నీ
కానీ వద్దన్నదే తాను చూస్తున్నాననీ
తలకెక్కనిదే తను వింటున్నానని
అనుక్షణమూ క్షణికమేననీ
మనసూ తెలుసుకుంటూనే ఉంటుంది
క్రీ నీడ ల్లో ఆడుకునే మనసు
బుద్ధి ధారణ లో వికసిస్తుంది
ఆత్మ ప్రచోదనమై తే
మనసు బుద్ధి ని ధరిస్తుంది
వెలిగే దీపం గ్జ్ఞానము
తరిగే వయసు మరణము
వెలుగు వాటారే టప్పుడు
మనసు నీడ చూసుకుంటుంది
తరువు ఒరిగినప్పుడు
నిజానికి నీడ ఉండదు
మతి భ్రమణమౌతుంది
ఏ గతొ పొంచి ఉండచ్చు
. మరి సమయము మించక మున్నే
పొంచి ఉన్న గతినేంచు

No comments:

Post a Comment