Satyanarayana Charyulu Maringanti updated his status.
నిదురలో ఎదురయ్యే మనుషులు
కడుదూరపు బాటసారులు
రాసుకుంటూ తిరుగాడే బందుగులు
బహుశః బంధానికందని బేహారులు
జీవనము నిదురకీ నిజానికీ అన్వయమే
వ్యయమౌతూ తనువు తీరుతుంది
ఆలోచనల పర్యాంతాలు మనసు లోచనాలే
మస్తిష్కమా,ప్రభోధితవా?, ప్రబంధితవా,
తిరుగలివడిలో నలిగే విత్తువా,తిరిగే పిడివా?
సందేహము దేహానికి నీడ.,అవునా?.
నీడ నిజముకాదని సముదాయీంచుకుంటూ
జీవితాన్ని తిరిగి తిరిగి ఖర్చు చేస్తావు
అప్పుడు బందుగుల సందోహము
ఎందుకో వేరుగాతొస్తుంది!
అప్పుడప్పుడు నిదుర నిజమూ
మమేక మై పొతాయి.
చలమైనవీ,చరమైనవీ,
నిశ్చలమైనవీ నిశాచారమైనవీగోచరిస్తున్నా,
అగమ్యములోకే ప్రయాణిస్తావు.
పాకుడు రాళ్లూ పాడు పడ్డ ఇళ్ళూ
స్వర్గానికో నరకానికో మెట్లు!
ఎక్కి జారుతూ చెదిరి మెళుకువలో శ్వాసిస్తావు
లయతప్పితే పెన్‌జీకటి కావల తెల్లారుతావు
బంధం తెగిన బందుగులు ఘొల్లుమంటూంటే
అగమ్య వవుతావు,బహుశః తెగిన తీగలు
పుట్టకతో మళ్ళీ వెతుక్కుంటావేమో
చిన్నదొ, పెద్దదో అనంతం పరిధిలో
మళ్ళీ చావు పుట్టకల వూయల నెక్కుతావొ?
No comments:
Post a Comment