Shared with Friends
Jvln Raju భక్తి కి ప్రతీక స్వయం వినమ్రత వికాసము అలౌకికవివశత్వం ఆనంద పరవశత్వం అఖండిత ఆత్మాలాపనము వంటిలక్షణాలు. బాబుగారు ప్రస్తుతము సార్వజనీన భావాలని గౌరవిస్తూ ప్రజాజీవనంలో మమేకమౌతున్నారు! ఏజనసామాన్య మనః ప్రచోదనాన్ని విస్మరించడంలేదు! ఆయా సమాగమాల్లో బంధుత్వాన్ని వెతుకుతున్నారు.నడుస్తు నలుగురిని చేరుకోవడమూ నలుగురున్నచోట కలయతిరగడమూ నలుగురినాకర్షించే లౌకిక ప్రభలు ప్రభావితాలూ ప్రకటన చేసుకుంటూపోవడమూ జన సంగ్రాహక పధ్ధతులు. జీయర్ స్వామిగోపురనిర్మాణకులు, బాబుగారు పుర నిర్మాణకులు. ఆయన భక్తి తినిపిస్తే ఈయన శక్తి భుక్తి ప్రసాదించే దక్షాపరులు. ఆయన దీక్షలో స్వ లేదు ఈయన దక్షతలో పరివారమున్నది! అదే పెధ్ధ ప్రమాదం. కాని కీర్తి భుజాలకివెనకజారే రాచరికపు అంగీ లాంటిది. అది జీరాడడమేకాక వెనక ధూళినీ కళంకాన్నీకుడాప్రోవుచేస్తుంది. అందుకనే కర్మ చెసి కృష్ణార్పణమనుకుంటే కీర్తీ అపకీర్తి వాదముమోదమూ అన్నీ కరగిపోయె సూర్యకరతప్త తుషారమౌతాయి. అన్వేషకుడు నాయకుడూ కల్మషలాకిఅతీతంగా ధన్య అవిష్కర్త అవుతాడు!! చంద్రబాబు అవిష్కర్తగా మారగల యోగ్యడుకావాలని వెన్నంటివుండిన మిగిలిన తెలుగు జాతి ద్వంద్వాతీతఆకాంక్ష. ఇది జాతి పురోగతికి కులమత కాలాతీత భక్తి యుక్త ప్రణుతి. ఇదే విద్యారణ్యస్వామి,చాణక్య ధీమహి పన్నా మాత,శివాజీమాత ఝాన్సీరాణిలాంటి జీవిత ఆశయాల్లోతొంగిచూసే భక్తి తపఃశ్శక్తి.
No comments:
Post a Comment