Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

6 January 2017 
Shared with Friends
చుట్టపు చూపుగా చూచి పోదామనే వచ్చా,కానీ
కట్టు తప్పిన కోరికలు అనంతాన్ని అంటగించాయి.
చూపుతో తప్పూ ఒప్పూఒడిసి పట్టే శా
వస పోసిన మూసలో కాగి యాస ప్రాస నేర్చా
ప్రతి స్పర్శ తోటీ రాగద్వే ష కలిత ఫలితమయ్యా
కనిపెంచిన సమాజములో కనిపించినవన్నీ తిన్నా
పెరుగుతూన్న నేను మరుగుల్లో తొంగిచూస్తూనే
మనొకామనా విలమ్బితనై ఆత్మయాన వినాశనయ్యా
స్వప్నాలని విప్రలంబితార్ధాలని కొట్టిపారేశా
ఒంటరినై పోయాగా ఇప్పుడు వళ్ళు తెలిసొచ్చింది
చూపులకి సంధి కాల దర్శనబాగ్యము కలిగె
కలలు యాదృఛ్ఛికము,వైకల్పికమూ కావు
నిరుటి జన్మ పురిటి గురుతు లే సుమా
భ్రమణాన్ని అన్తర్ముఖమ్ చేస్తే బిందువౌతావు
మనో నేత్రా నికిఆత్మావిష్కరణ గోచర మౌతుంది

No comments:

Post a Comment