Friday, March 13, 2026

 2 July 2018

 
Shared with Friends
మనిషీ నీ లోనికి తొంగి చూశావా,
చీకటి పొరలు తొలగించుకు సుమా!
వాకిలి దాటి నిశ్శబ్దపు నీరవంలోకి
మెలకువముందటి లోగిలి చేరావా?
కళ్ళు తెరవాలనే గందరగోళంలో వళ్ళుమరచి
మళ్ళీ వెలగాలనే తొందరలో తెల్లారిపోయావా?
నిన్ననువ్వు వెలిగించకోవడమంటే కొంచం,
కొంచం నీలో చీకటి తొలగించుకోవడమే సుమా!
ఆమాత్రం ఓపిక చేసి వూపిరి గమనిస్తూ పూర్వాన్నీ
పరాన్నీ లెక్కిస్తె స్పందనలన్నీ మన్ననలై
మనసా నువ్వంటే నే'ననీ 'నే'నంటే ఆత్మాణువుననీ
నీకూనాకూ జన్మ రాహిత్యం అవినాభావమనీతెలిసేను!
కాకుంటేఅనిశమూ బాహ్యాన్నే ప్రాణమనుకుంటే చీకట్లో,
వాకిట్లో, పొంచి వున్న జంగమ వాయువులారూ
కామరూపంతో లోనికి వేంచేసి నరాలతో
నా స్ధావరాన్మి నిస్తేజంచేసి విడివిడిగానూ
కలివిడితోటీ పంచాంగాలకీ వలత్రాళ్ళయి
నవగ్రహాలనీ దాటించేస్తాయి. మళ్ళీ
ఎప్పుడో తిధి వార నక్షత్ర కూర్పులో
గతజల సేతువు కవల సంచితమైన
సంగత హేతు నిమిత్తం సంగమంలోనో
జంగమంగానో మళ్ళీ జన్మెత్తాల్సిందే!
శివాలాడేసంగతులన్నీ వావి వరుసల
సవాళ్ళు విసురుతూ బంధుసందోహంలో
కలుష పరుష జీవనయానంలో మళ్ళీ
మళ్ళీ పల్లవించి సుఖ ధుఃఖాలని ప్రసవించెవే!
తస్మాత్ జాగ్రత్తఅంటెమాత్రం మనసుమాట వినేనా!!

No comments:

Post a Comment