See more
Tuesday, April 29, 2025
గతించిన వత్సరం సమవక్షరమైనది! అసంగత కాలంలో కట్టెలెన్నో కాలిపోయాయి! మంచి చెడూ కలసి తగలడ్డాయి! మంచనుకున్నవాళ్ళూ ఇంటివాళ్ళవీడుకోలూ ఆర్భాటాలూ లేకుండానే గడపలు దాటేశారు! వీరుడెవ్వరు? అమరుడైనవాడా? అంటే, కీర్తిశేషుడా!అయితే బతికున్నప్పుడు కీర్తికన్నా క్రీనీడలెక్కుడైనవాళ్ళూ, నీడకోసంతాపత్రయపడ్డవారూ,కీర్తివున్నవారూ కోట్ల పడగలవారూ ఒంటరిగానే మరీ వంటరిగా, సాగనంపుసైతంలేకుండా , అంటూమైలా గొలే లేకూండా, హిందూ ,తురకా, ముస్లింమ్ క్రీస్తూ నిరావలంబి,బిక్షువూ కక్షా క్రోధు అందరూ నిశీధిలోకి మరీ వంటరిగా …
Monday, April 28, 2025
గాధ లెల్ల శోధనలె యశోద
రాధ పల్లె గోపిక లెల్లరు శోధకులె
మెల్లనిఅడుగుల జొచ్చి మేల మాడెడు
నల్లనయ్య అల్లరిఅంతరంగమున
అంగరంగ భోగములొందిన
యశోకాముక శోధకులే
దశరధుడన్న వివశుడే
స్పృహలయిదందమరిన
నీడలుభ్రమలునైదు వెరసి
పది విధముల పారాడెడివాడు
పరేంగితము తక్కుడగుటంజేసిమ
శ్రవణ శ్రావణ శరాఘాత మృతుడయ్యె
విషయ విషమ్ములారంతర్వాహినులు
మనోవాక్కాయములందు నిమిడి
ఒక్కొక్కవికారముతక్కినవానినిచేరు
వివిధాన్వేకములుగ వివేకభ్రష్టతన
భ్రమలు...
All reactions:
3Sreedevi Aravalli, Maddali Manjula Vijayasri and 1 otherShare
ఊసులాడేవాబాలా ఊసులాడేవ
మోసులెత్తిన మోవి తేనియలు
మురళి మోహన రవళి నలది
గోప కన్నియల రాస లీలల
ఊసులాడేవాబాల ఊసులాడేవ
మురిపాల ముజ్జగముల జేజలకుజేజ
హరి పాల బుగ్గలు కంది కెందామరలైన
వైనము ఊసులాడేవ బాల బోసినగవుల
నల్ల కలువల మేని ఎల్ల లోకముల మాయ
విల్లు శంఖము చక్రము చేరి చామరము
అల్ల అరికాలి ముద్రలు కల్ల కాళీయ తలనద్ది
చల్లలమ్మెడి వారిని ఎల్లవేళల కాచినచల్లనయ్య
ఊసులాడేవాబాల వూసులాడేవ
నిదురపో తల్లి నిదురపో
బాల రాముని లాలి పాడేను
గోపబాలుని జోల వేసేను
నిదురలోన అన్నయ్య కన్నయ్య
ఎదురు వచ్చీ దోబూచులాడెను
బలరాముడేమొ బంగారు బంతి నిచ్చెను
ఆటలాడి అలసినమీకు
యశోద ఆవుపాలిచ్చేను
గోపయ్య నెమలికనులిచ్చేను
నిదుర పోతల్లి నిదురపో
All reactions:
4Adi Sesha Mani, Maddali Manjula Vijayasri and 2 others3 comments
Share
Wednesday, April 23, 2025
యెత్తుకుతిరగాల్సినవేళ
తలవంపులైపోయింది అమ్మ
తనుతనువైన ఓర్పు
కనుచూపున కనరాని దరికై
ఆకొన్నపసిగుడ్డునెదకొత్తుకు
గ్రీష్మమో తాపమోఆకటో
ఎర్రయెండన బిర్రు జాగిలపు
క్రౌర్యదృక్కుల విదలింపుల
వలలదప్పుకు ముందుకు
మును ముందుకు సాగిల
వడి పంచమాంగదళముల
పాల్పడి ముందుకుపోలేక
వెనుకకు తిరగరాకృ
రిత్తవడి చావలేక బ్రతుకు
భారమై రాజమార్గమున
పెదలై చితికిన వారు
దీనులు, దిక్కులేనివారు
ఓ భారత రాజ్యలక్ష్మీ
ౌకనికరించుము. అయ్యో,
రాజమ్మన్యులిట్లయ్యిరేమి?
జనసామాన్యమ్ములేల
సామ్య మెంచక మౌనులైరి!
క్రమముకాని శిక్షణ
నైసర్గికముకాని తత్పురుషము
ఒక్కయుప్పెన యోక్కసంకటము
మననేకము చేయలేదే!
వివేకమా, విపరీతమున
స్వరమూ కరమూ
దయాంచితముకావలె!
'విపరీతకాటకమొప్పినప్పుడు
విశ్వామిత్రశ్వాన పాక
పితృపారణ వితరణ,
మనకు పాత్రతయనియెరుగమె!
యోచన కల్పన చొరవా రక్షణా
వేరు,వేరు! ఆక్రందలన్నీ
కారుణ్య క్రియలుకావు!
గొవులహననమున
యఙ్ఞహవిస్సులు
కంటగింపగు పాలక
వర్గ నికృష్ఠతన,
బాల బాలికా మేధమున
బాలింతలుక్ష్షుబితులైనతరి
ధర్మవినాశము ఘటకమౌ
నట్టితరి శంబల గ్రామమున
యుదయించునతడు
కల్కి,వేచియుందము
All reactions:
2Manga Seshu and Maddali Manjula VijayasriLike
Comment
Share
Subscribe to:
Posts (Atom)