Shared with Friends
అవును నేననాగరీకుడినే ఎందుకంటే
కారులో పోతూ రోడ్డు మీదుమ్మేస్తా
నాకు తొందరైనప్పుడు ఏంచెయ్యనూ?
అవునూ మాటలకీ నాగరీకతకీ
వుంద ఏమైనా చుట్టరికము
నగుబాటు నిన్నెవరైనా చేస్తే
నీవేం చేస్తావు చూస్తూ వూరుకుంటావా
అసంకల్పిత వ్యవస్తలోఅన్నీ అనాగరీక అవస్తలే
0 నీవు బంగారు విత్తులు మొలకెత్తిస్తావ్
నే మామూలు విత్తనాన్ని, మొలకెత్తి నసిస్తాను
నవ్వుకో! కాని నాపాట్లు నే పడతా
నాకూ నీకు కుదరనప్పుడు ఇక నాటకమెందుకు
తప్పుకుంటా తప్పకుండా! నీ ఒప్పులకు నేతూగనుగా
అందుకే సరిసాటిని కానని అనిపిస్తోంది.
నువ్వేమనుకున్నా మనువు అంశనే నే
మనవిషయము ఇతరులమీద రుద్దడం
నాకిష్టమే అయితే నువ్వు నా తోకని ముట్టుకుంటే
త్రాచునై బుస కొట్టనూ,ఎమనుకున్నావో
నీ తత్కాల జన్యు సూత్రాలు సుతరామూ నచ్చవు సుమా
వుంటే వూళ్ళో వుంటా లేకుంటే శంకర గిరి పోతా
నాకు దబ్బుల నాగరీకతా
ఒప్పుల సుకుమారతా, అంటగట్టాలనుకుంటే
బురద ఎక్కడవుందో చూడు
అక్కడ పన్నీరు కుమ్మరించు
ఫలితానికి జీవితాన్ని బలి చెయ్యి
నీ ఇష్టం బలవంతమేమీ లేదు
నామాటలు వదిలేసినా నీ మాటలు
గింగురులు తిరుగుతూనే వుంటాయి నాచెవిలో
జీవితాంతము ఒక కొత్త అలాపన తోడై
భయంతో చస్తూనే దూరంగా జరుగుత
నీకు నమస్కారము నీ నాగరీకతకీ నమస్కార,
ఓ నాగరీకుడా వర్ధిల్లు కానీ
నన్ను మరచిపో నా వునికి నీజీవిక కాదు గదా
అందుకే నీ దారిలో నన్ను నాలాంటి వారినీ వుపేక్షించు
No comments:
Post a Comment