Satyanarayana Charyulu Maringanti
జీవితము వలయ మైతే కేంద్రమేదీ
మేదినీభ్రమణంలో కాలంచేసే జీవీ
పుట్టూచావులమధ్య కాలంగీసేది
జీవన రేఖ ఆయువు పట్టు పొట్టిదే,
నీ అడుగులు తడబడినా పరుగులు తీసినా
ఆ విన్యాసాలు పొట్టి గీత చుట్టూ వలయాలే
మందు తిన్నఈగని చూడు గిరగిర
తిరిగి భ్రమణంలోనే మరణిస్తుంది.
దిగంతాల వర్తులంలో నాభ్యంతరానివే
విశ్వాంతరాళానికి మధ్య బిందుబింబానివే
కాని జగన్మిధ్యలో సకలజడాజడములూ
దిఙ్మనోగోచరములూ గమనంలో గతించేవే
అయినప్పుడు అనఘుడే మానవుడు !
ఘనములు ఆకృతిన, పుడమికి వడిగంటు
తరులతాగుల్మములు మేదినీ వల్కములు
శాంత గంభీర ములు బృహదాత్మలవి
ఇక వూపిరిలు,వాయువులు నిత్యవ్యాపనములు
జలములు ద్రవములు జీవ పోషకములయ్యు
అనాత్మలు సుఖ ధుఃఖములేకరీతిన కల్పించెడివి
రెండు బొడ్డులున్న భువి తాడిత గోళము
ఆపైన వాయుమండలము ఆశ్రితావరణము
మిక్కిలి వరణములు సాగినపరావలయములు
మనిషీ నీ మనమున పూచిన సుమములు
ప్రకృతి ఆకృతి సకృత్తుగ చదివెడికౌముది నీమది
అనంత పరావలయమున మేధోమధనము
నీఆద్యవతార నిత్యకర్మానుష్ఠాన ఆంతర్యము
విశ్వం తనరహస్యపు గుప్పిటి విప్పక తప్పదు
బ్రహ్మవిద్యా కృష్ణ తత్వం నీ వశమై తీరును!!
No comments:
Post a Comment