Friday, March 13, 2026

 ana Charyulu Maringanti

6 July 2018 
Shared with Friends
తాపత్మ్యహమహం వర్షం నిగృహ్ణటుసృజామి చ !
అమృతం చైవ మృత్యు శ్చ్య అహమర్జునా !!
నేనన్న అహమనుకొందుమా,
ప్రశ్నకి బదులు యాత్మనుకొందుమా
అవునన్న చిక్కు విడునా
కాక తిరిగి ప్రశ్నేమొదలగునా
నేనెప్పటిది, మాట గురుతుకు
శైశవమప్పటి వూహ వూసనుకుందుమా
కృష్ణ కరచరణముల
రోలగట్టిన జగతిని ఏమార్చె
నాలువు దిక్కులు 'తాదిరిగి
తినెననిన మంటిని జూపునెపమున
తిరిగెడు చక్రవాకమును
తిరగని సూన్యమును
పెరిగి తరిగెడు జీవుల నెల్ల
అల్ల కల్లోలమగు కడలిని
దానికావలి కోటిసూర్యుల
పెంజీకటుల చినుకులై
వెలుగొందెడు నక్షత్రశిఖల
తన నోటి చిరు నగవుల మూటన
జూపి తనె తన యాత్మయని
నిజ మరయగ జేసె యది కధ కాదు
ఘృతయుక్త కంధరము కడు తీపి
కను గొనడె జీవి వ్రేలు చీకెడి
'తను 'శయనించిన; చిదాత్మయని
'తన్ను 'తను మరవగనేరదని గీతయె
గద గురుతున గురువుగ చెప్పినది
గురువన సద సద్వస్తువట,
అగ్ని యనగ్ని'యునట,దగ్ధ
దాహక దహన కర్తయట
యగ్నియనగ్నిదగ్ధమట
అతీత ప్రతీతాల్పఘన ఘనతర మట

No comments:

Post a Comment