Satyanarayana Charyulu Maringanti
తీతువా ఏమి గోచరమైనది,
తెగే తీగలని మీటుతున్నావా?
తెగి పడుతున్న చుక్కల్ని లెక్కిన్స్తున్నావా!
నాకళ్ళు కనలేని దైన్యాన్నేమైనా చూస్తున్నావా!!
తరుముకొచ్చే మృత్యు పాశాలు,
ఏజిహ్వా గహ్వరాల్ని తాకుతుందో చూస్తున్నావా!
తరతరాలుగా చావు రేవు దగ్గర,
తలారి కరవాలంలా నీపాట పదునెక్కుతోనేవుంది.
శ్రవణ మృదంగమే సుమీ నీ పాట గమకము!
మరణ గీతి ఇహ వినలేము సుమా!
కోయిలనో చిలుకనో అనుకరించు.
కోవెల చిరుగంటల ధ్వనినీ,
తీవల పూవుల కోమల ఆర్ద్రతని వరించు.
ఇహ నీపాట చావు కూత కారాదు సుమా!!
No comments:
Post a Comment