Friday, March 13, 2026

 30 December 2019

 
Shared with Friends
రాజధాని ధాన్యకటకమట
రామ స్మరణ పుణ్య సంపదయట
బౌధ్ధము ధమ్మము శాంత సంద్రమట
జైనము సహన ఘనవైరాగ్య విరాజితమట
అది అమరావతి
యచ్చోటనే ప్రసవమైనవి
నిరుపమాన ఙ్ఞాన శీల వినయ పిటక ప్రస్తాన త్రయములు
జనహృదయఘోష సాంద్ర నీహారఫేన మగు తరి
ఆంధ్ర మహావిష్ణువేల నిస్తేజమాయె
వెలమలార కమ్మలార కాపులార బాలచంద్ర
మాంచాలాసేవిత మాలలార జాంబవతులారా
మనమన్నదమ్ములమె తొల్లిట
చాలకాలము నాగమ్మ పగకుపూర్వము
రెడ్డియో రేచర్ల రాజులో గురుతుగ
వెనుతిరిగి మనమనముల కించవడక
అమరావతిని పూజింపరె భక్తిన
మన రాజ్యరమయామె తిరిగి కొలువాయె.
కొంగున ఇంగువ మూటకట్టుకు
వుసిరి తలనుంచుకు కృష్ణన
తృష్ణ దీర్చగ అమ్మను జగదంబ
కనకదుర్గను మనసునెంచి
తాన మాడి ప్రతిన జేయరె
మరావతి పునర్నవయఙ్ఞమున
సమిధ లై నిలుతుమని
తులువల శిలువల నిలవరించి
విరించికి సింహాసనమెత్తగ
మొక్కరె శీకాకుళాంధ్రవిభుని
జయమహో మీకు రైతులార రెడ్డి రాజులార
కమ్మ వెలమ దళ గణ పతులార జయము!
8 years ago

No comments:

Post a Comment