Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

16 August 2018 
Shared with Friends
రాజకీయ మది కాదది వాజపేయము
భక్తి పరిప్లుతప్రాగ్దిశాంజలీబధ్ధతోయము
శాంత స్వాంత వినయ జ్గ్నానధీమహి
ఇద్ధరణిన అరణి దిప్పి ఏమౌని వ్రేల్చెనో
ఎట్టిపుణ్యముల్జేసెనో యాతల్లి మనభాగ్యమున
మనదిశానిర్దేశకజగతీస్వరుడుదయించె
మరి మహాత్ముని యాశీర్నమస్క్రియాఫలమొ
త్యాగ ధనుల మనోవాంచాఫలమొ
యొక ధృవ సుధృఢ మనోరధుడు
మరియొక యుపమన్య,సుమనస్పతి
మన ధరణిన మనోయంతహ్:కరణముల
తనువు మనువై మాత ఋణముదీర్చె!
జీవనమొకయగ్జమే ఎన్నిన, కాని
సఫలమనోరధుడీ జనమేజయుడు
అపర నాగయోగి యస్తీకుడె యితడు
గంగాసూనుడె శుక్లయజుస్సామగాయకుడు
నవనందుల, సింధుల, అంభీయుల,
వారివారి, వారసుల వలల జిక్కి
వెతనొందిన భవ్య భారతి
కాటుక కంటినీరద్దిన యపరపోతన!
ఎన్నని ఎంచుదు, అన్నియు సహజములె!
కాని, కవులందురవి యుత్ప్రేక్షలని
యాతని స్మరింతుమె పుణ్య ధన్య ప్రాపకుని!!

No comments:

Post a Comment