Friday, March 13, 2026

 2 June 2018

 
Shared with Friends
గిరికొట్టునవి తిరిగితిరిగి
తా దారి మారి గిరిికొట్టు
తరుశాఖల గిరినెరవుల
తిత్తుల గుత్తుల
చీకటి లత్తుకలు
పాపపుణ్యముల
రూప లావణ్యములు
చావు పుటకల గిరిగీతలు
గబ్బిల గమన విన్యాసములె
గత జల సేతువులె
లెక్కకుతేలని లెక్కన
చచ్చుచు పుట్టుచు తిరుగలి
తీరున తిరిగెడి చరితకు
ఉద్భుధ సత్యము
గబ్బిల జీవ విన్యాసమె

No comments:

Post a Comment