Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

20 March 2017 
Shared with Friends
నిన్నతిరుగాడిన హంసలు నేడు కనరారు
నిన్నటి నిరుపమాన సత్యము నేడు మిధ్య
వారి మస్తిష్కాన్ని స్పృశించిన చిరు గాలి
ఇంకా కొండకోనల్లో వేణువూదుతూనేవుంది
వ్యోమకూపములో హోమ గుండాలింకావేడిగానే వున్నాయి,
నదులన్నీసముద్రుడి ఒడిలో తర్పణాలొదుల్తున్నాయి
ఎర్రజీరల పొద్దుని చూసి అలలు వెక్కిళ్ళ పోటెత్తుతున్నాయి
ఒక్కొక్క మహాత్మే కదలివెళ్ళిపోతుంటే
నగ్న హృదయ నాతల్లి పుడమి శీర్ణమేఖలమైనది
అవనీ,నీపుత్రులు కీర్తి వెదజల్లిరి
నక్షత్ర ప్రకాశములు క్రొత్తగాలేవూ,
రాత్రులు శారదా నీరదమైనవి
విభూతుల ఓషదుల పరిమళాలు
వినయ పిటకాలూ,అమరావతిలో
కొత్త వూహలు ప్రసవిస్తున్నాయిృృ
అమ్మా నీ ధుఖములు శమించు గాక

No comments:

Post a Comment