Satyanarayana Charyulu Maringanti updated his status.
ఆలాపనలో మనసా,లోపాలను గణిస్తున్నావు కదూ,
పాలుపంచుకున్నవన్నీ,నీపాలనే నమ్మావ్ కదూ,
కానీ నువ్వు నీళ్ళలా మారి కాళ్ళుకడిగావు చూశావూ,
అవన్నీ పుణ్యాన్నిస్తాయని భ్రమపడ్డావూ,అదే పొరపాటంటాను
ఏమంటావ్, ఈమాటెవరైనా అంటే వులిక్కిపడకేం
ఎందుకంటే కళ్ళుమూసుకు చేసినా నేరాలూరుకోవు
నీమెడకే చుట్టుకుంటూ తలకెక్కి వెక్కిరిస్తాయి,
గొప్పనుకున్నావా మరి గొప్పవి కాలేదెందుకని
ఆలోచించావా నీ వెర్రికి నువ్వె పాలు పొశావనీ,
ఇంకా మొద్దునిద్దరెందుకూ,నీ చెంగుతొ మొహం తుడుచుకో
చెమటా మకిలీ చెరిగి అసలు మొహం వెలుగులోకొస్తుంది,
అప్పుడు ఎంతందంగావున్నావో దోసిట్లోదోగాడే నీడలో వెతుక్కో
కాదంటే,కోవెల్లోకొట్టిన కొబ్బరి చిప్పల లెక్కేసుకో,
అప్పుడు తప్పుడుపనుల తక్కెడలో పుణ్యంకొల్చుకోవచ్చు
కానీ,నీకు,ఏదేముడిపైనానమ్మకముంటేనేసుమా,
లేదంటే,ఏవంటరిమూలోకూర్చుని కడివెడు కన్నీళ్ళు కార్చు
మనసుబండకి పట్టిన నాచు కరిగిపోతుందేమో
అయినా కాకపోయినా ఒక్కటినిజం
ఇప్పటికీ మించిపోయిందిలేదు
వీలుచూసుకు అలవికాని త్రాళ్ళని తెంచుకో
దశబాగుంటే లోపాలలో లోకము తేలి పాలు మిగలచ్చు
No comments:
Post a Comment