నేనని చెప్పుకొన్న,'అహా మందురు,కాని
నే' నాత్మను నిక్కముగ యహమనునది
ఇహమున నా వునికికి వూపిరి,యదిలేక
జీవఛవము పగిది నైచ్యమునొందెద
ఇహపరములనేనాత్మయయ్యు,ఇహమున
జీవాత్మగ తనువుదాల్చి పరికర్మన
పరమాత్మను జేరనెంచెద,పరిభావన
గుణ పరిగణణ మనము చేకొన్న
పరిమళించదె ఆత్మ ప్రయాస
నా దేహము పంచభూత సమ్హిత
బద్ధ జీవిగ,బుద్ధి జీవిగ వసింతు
తెరపు మరపున,దేహపాశనై,.
బద్దత దేహ ప్రవృత్తి, బుద్ధి
వికసించిన వివేకమండ్రు
యది యాత్మాశ్రయము
ఆత్మధారణమున దేహము
గుణత్రయతేజోమయమగు
తేజస్సు ప్రాణమై వ్యక్తిత్వమేర్పడును ......
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన
తనంత తానో అనంత అవ్యయమో
అనాది నుండి అపరిష్కృతము
కాలమనంతంగాసాగెడిదోకాదో
చిన్నబతుకు మనిషికి చింతయె
ఎన్నగలిగిన తుదిమొదలు కన్న
చిన్న వెలుగైన కనలేనిమనిషి
కఠోర తపస్సున తన చేతనచే
మరలజన్మమెత్తైనను,అ అvaధిదాటి
జనన,ప్రజననమునరయకోరు
లీలగమెదులు,శీలపరివర్తనన
దేహయావన సందేహభావన
నిక్కము నశించిన దేహధారణ
చిత్తము వసించిన తొల్లిటి మనము
ఎన్నగ కానరాదు,ఆత్మ అనుసరిణిగ
నన్నను మనసునభయవిహ్వలలీల
నిలచియుండు ఆత్మకు బొందియై
ఎత్తుననిలచిన మరణాంతర సీమను
హృథ్చాలనలేక చేరగలేదు మనసు
ఆత్మాSraయమునకై పరితపించి చిత్తగు
చిద్రూపమునపునహ:గమించును
మరణాచ్చాదిత దేహయానమున
దొరకినగర్భావాసము,పుణ్యసంచితమే
దొరకినవెలుగున జీవనలక్ష్యమునెంచ
నిలచినస్పృహకు భూతస్నానమునిత్యము
ప్రతి నిముషము ఐహికములు అంకురములు
కలుపును కాంచి,చేతనచే,మనోవాక్కాయములచే
అంతిమలఖ్ష్యమరయ నేర్వగనెంచ లీలాభాసముగాక
నిల్చును పుణ్య పరికల్పన,తనవెంట చేరిన
జీవనయానమున,అలసియు,తెలియనేర్చిన
తొల్లిటి పరమ జ్ఞానము,భూతాత్మ నెరుగుటయె
స్పృహకలిగి వినమృలగుట విమోచనమునకు
ఆత్మ స్వీకృతి నవ విధముల ఆరుధారణల naదలించి
పాంచభౌతిక దేహమును,వలిపమువleనెంచి
తేజస్సు నాత్మోన్ముఖము జేసి
నారాయణ పదమునరయవలె
No comments:
Post a Comment