మంగళాశాసనములు
వసుంధరాధరోధ్ధారక వారాహ వ్యోమద్యుతినిగంటి
త్రివిక్రమక్రమోర్భాట విస్ఫోటక నీలమణుల ప్రభలగంటి
సత్యాసత్యసమ్మిస్రితసత్యరూపు మత్యమూర్థియమూర్తతనెరిగితి
నరానరఘోరరూప విజ్రుంభితనారసిమ్హ కృపనూహించితి
మత్బ్రాతరపుత్రదివ్యసన్మంగళకళ్యానవిషేషమున
శేషప్రశ్నలులేక సమ్మానందకందలితుడనైతిని
శ్రీమత్తిరుమలపల్లెర్లమూడిదేవర వరప్రాసాద
అపరవాసుంధరీ సుందర కపోలకల్పిత
రంగమంగళావైభవ కోమలయయ్యె మాయింటి కల్పతరువు
ఇట్టికృపకు యా సింగమధీమతి నారసిమ్హునిప్రసన్నత కాదె
కారణాకారణశ్రేయమన నిదియెకద భాగవత నియత
దాసాంఘ్రి ద్వయములకు కేల్మోడ్చిమ్రొక్కవలదె
బందుగులార కంటిరె వివాహమన వ్యవహారహారతోరణము
కాదది కానె కారాదని ఎల్లరరెరుగరె విజయుని నిజపార్ధుని
విమలమనహ్పరిపాలకుని పుత్రవాత్సల్యమునికని మీరలెల్ల
భవితయమున కందుమొ లేదొ వివరముగ మనమున
నిల్పుడె ఈయట్టి ఘన దేవతాప్సరోసేవిత కల్యాణము కలకాలము
దీవనలీయరె అపరఋష్యశ్రుంగశాంతా దంపతులకు
ఐశ్వర్యభోగభాగ్యముల తులతూగ ఈ ఇంట యాఇంట సిరిసంపదలోలుక
శాంత గంభీర శ్రీవైష్ణవ శిష్టాచార ప్రచోదనమునకు
No comments:
Post a Comment