Friday, March 13, 2026

 15 September 2017

 
Shared with Only me
ఓ దేవతలారా హంపీ కన్యలనెరుగుదురా
మీ కృపకై కళాపరిమళాలు విరజిమ్మారుగదా
ఏమో మీరంటూ అసలున్నారో లేదో
ఆ అప్సరసలకై నా తెలుసో తెలీదో
మీ ఉనికి సుమండీ ఐతేనేమీ
మీ ప్రతిమా స్వరూపాలు అప్పటివేగా
ఆనాటి శిల్పుల శిలా విన్యాసాలేగా
హరప్పాలకు మీరు తెలీదు
మహేంజాదారోలో మీ దారి కాన రాదు
పురాణాలూ మా నగరాలూ మహా ఐయితే
కొండలూ గుట్టలూ మీ పేరవే
అలరారుతున్నాయనుకోండి
కానీ ఇదమిద్దంగా మీరున్నారా
ఋగ్యజుస్సామాలు నిప్పూనీరూవాసిగదా
మీ పేర్లూ ఊర్లు భూతద్దంపెట్టి వెతకాల్సిందే
పాపభీతీ పుణ్యగణ్యతా కొంచం గోచరం
ఇంతకీ మీరెప్పటివారు దేముళ్ళూ?
ఆరవశతాబ్దికిముందెక్కడ ఉండేవారూ?
ఆళ్వారుల నాయనారుల గళాల్లోనూ
భరతముని పాద తాడనంలోనూ
మీ ఉనికిని గమనిస్తామనుకోండీ!
ఇంకా హిమాలయాలూ, నైమిశారణ్యమూ,
దండకారణ్యమూ,గండకీనదీ, భాగీరధి,
గంగ యమునా, వింధ్యాది పర్వతాలూ
మీ ఉనికిపాట్ల'ని మా పెద్దలన్నారు,కానీ
అయోమయమైపోతోంది !!
అంతకుముందెక్కడ 'మీ' ఉనికి
ఈ విశ్వాoతరాళంలో ???

No comments:

Post a Comment