yanarayana Charyulu Maringanti
గణపతి అశ్వపతి,గజపతి,పశుపతి,శ్రీపతి,భూపతి,వాచస్పతి,బృహస్పతి,విస్పతి,స్తపతి,,పార్వతీ పతి,చలపతి,పరపతి,అంకపతి,కృతిపతి,రఘుపతి, ఇవన్నీ పూర్వపద విషేషణాలు కలిగిన సంభోధనార్ధకములు. ఈవాచకార్ధాలకి దైవ పరిగణన చేసి పెళ్ళిళ్ళు చేయడము పుట్టినరోజులు చేయడమూ, బాల్య చేష్టితాలే. శాస్త్రమనే మాటకూవిపరీతార్ధాలు మనము అన్వయిన్చుకుంటున్నామేమో.నిజానికి సాం
ఖ్యము,న్యాయము వైషేషికమూ,తర్కమూ, వేదమూ వేదాంగాలూ,ఉపనిషత్తులూ,సత్యభావన చేసిన ప్రకృతి విషేషాలు మాత్రమే. పదార్ధ స్పృహా స్పర్శాదిక
అపదార్ధ విషేషభాజాలమంతా,మనోసృజిత,విస్మయాత్మక జ్గ్నానము.ఈ జ్గ్నానము జీవన పరిధిలో లౌకిక శారీరిక పరిణామాదులకు దూరము. మరల వేద వాగ్మయములో ధనుర్,ఆయుర్, యొగ,ధ్యానావాహనాదులు మానవోపయోగ శాస్త్రాలే,కానీ కొన్ని వామాచార శాస్త్రాలూ,బలి హింసాత్మక ఘోరాత్మక వికృత శాస్త్ర రూపాలూ, పైశాచిక భూత విద్యలూ,ప్రాచుర్యములో వున్నాయి. వామాచార శాస్త్రాలు బలి హరణ, యాగ క్రతు ధారణ,కృత వికృత సమ్యోగ బల సంజాతోత్సుకతా కృత్యభూయిష్టాలై, వామాచార చిత్రకళారీతులై దేవాలయాల్లో బూతుబొమ్మలుగా మిగిలిపోయాయి. ఇట్టివే తురక శిశ్న భంగాలూ, పోతురాజుల విన్యాసాలు,నిప్పుల్లోనడకలూ, అశ్వమేధ,నరమేధ వైచిత్రికలూ. సంగమాదులే శక్తిపుత్రజననాలని ఎంచిన ఏలికలు, అతిబల జంతుసమాగమాది వామాచార ప్రక్రియలు బలిమితో అంతహ్:పురస్త్రీలకి శిక్షాయుతంగానో క్రతురూపకంగానో విధించి బలవన్మేహప్రావేసిక శుక్ల ఫుష్టి చేసేవారని రాతి బొమ్మలు పూర్వ గుహా కుడ్య చిత్రాలూ సాక్ష్యం చెప్తున్నాయి. గ్రుడ్డి శాస్త్ర వాదనలనుండి మనము స్వచ్చ జ్గ్నానాన్ని నిర్మల బుద్ధితో భావితరాలకివ్వాలి. ఇది ఈ స్వతంత్ర దినోత్స్వవ కామన.
No comments:
Post a Comment