దుష్టసమ్హారమంటే అవతారపురుషులు కల్పించే పరిహారమే!
అంటే కల్కి పుట్టేదాకా దౌష్ట్యం కొనసాగాల్సివస్తుందన్నమాట
పండగపరమార్ధం ఏమారిపోయింది
ఉన్నవాళ్ళుతిని త్రాగి చిందులేయడమన్నట్టు
భూమ్ముద అందరికీ చీకటిపోయిన రోజు
చరిత్ర పుస్తకాల్లో చిరిగిన పుట!
మరచిన మేలులోతెర చాటు మనిషి
క్రియాశీలక కర్మబద్ధుడే,కానైతే
సమాజసంపద సమం చేసేదే!
అనాదిలో మరీ కులాలూ మతాలూ మన కెరికలేనప్పుడు, ఐకమత్యంగానేవునడేవాళ్ళంటకదూ
త్రేతాగ్నులూ ప్రేతభూములూ అందరికీ శాంతవిశ్రాంత భూమికలుట
వున్నది తిని మిగిలినది తట్టతగలెట్టి కలివిడిగా వుండేవారముట
ఏరాక్షసుడో భూతమో వస్తే బెంబేలెత్తినా పదుగురి కలివిడి కాపాడేదిట
ఒకరితెలివైతే ఆయన అప్పుడు యుగపురుషుడే.
కష్టముదాటిన తరువాత నిష్క్రమణ నిర్దుష్టంగావుండేది
అయితే సంక్షేమానికి,గృహ్యసూత్రాలూ,వీరవిద్యలూ
పన్నాలా వేదాలు,పురుషార్ధలూ ప్రసవించబడ్డాయి
వెలుగులోబ్రతకే మనిషి చీకటిలో జంతువేకదా,
కలుగులోదూరిన కలి పులి పంజా విప్పదూ
దౌష్ట్యధూమాలు మళ్ళీమానవత్వాన్ని మంటకలపవూ
ఇంకా పండగాడతాము,మానవత్వపు ఘోష మాకెందుకంటే
మన పూజలు,అమానుష బీజాలకు వూపిరి పొయ్యవూ?
కలసి చెడుగును పారత్రోలిన మనిషీ మళ్ళీ నడుంకట్టు
గోముఖవ్యాఘ్రాలూ, మత కవచ ఖేచరులూ పొంచియున్నారు
ప్రాణనష్టమూ,భ్రూణనష్టం కలిగించడమే వారి ఆకలికి అన్నము
పణ్డగలదొమ్మీల్లో నువ్వున్నప్పుడు వాళ్ళు నీ ఆదమరపులో బలోన్మత్తులౌతారు
అలాగేకదా ంలేచ్చులూ,యవనులూ చొరబడిందీ,మరచావా
హోలీశరే,ఏపండగైనా,అందరూ క్షేమముగ్స వున్నపుడే కదా.
ఏమంటావ్,కొంచమాలోచిస్తావా,పాత పురుషుల వీరగీతాలతో
పెను సవాళ్ళధిగమిస్తాను,హంస గీతితో కంస వధ చేస్తా అంటావా
No comments:
Post a Comment