Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

4 June 2018 
Shared with Friends
వెలిగెనొక సమయ కీలన
వెలుగు చీకటులకావలిజేజ
కొలువుగ నిన్నటి నాపిన్నతనమున
నలుగు రాలి నిలిచెనాకోవెలన
నవవగ్రహములాహాకారముల
నిశా దివసముల నేడది డస్సె
గోడలకందుము మసి రాతల
నీడల మసకన కూడనిజతల
కూడలి పలకల నూతికవతల
వేడని వేడ్కల వేలుపు కొలువు
దివాణము దిక్కు మాలెనొ
ఉబ్బులింగడు నిస్తబ్దుడయ్యె
గబ్బిలబిడాలావాసమయ్యె
శివాలయము నిశాలయమయ్యె
తునియన మేన మామలు
ధ్వని బేధ విద్యా వాచస్పతులు
తాతలు కౌండిన్య కౌసిక గోత్రులు
ఉభయ వేదాంత వేద్యులు
శ్రీమన్నల్లాంచక్రవర్తులెల్లరు
జన వందిత పరమ హంసలు
స్ఫురణన మెరయరె అయ్యొ
అయ్యు శ్రీవైష్ణవ శిఖామణులు
అయ్యలకయ్య హరునిమరచిరో
గడెలుచెడి గుడిగుయ్యారమయ్యె!!
కలగాదది కడు కలకలము రేపె
నెమ్మదిన కుడిచి సోలినమదిన
గ్రహశకల వికల శిరోస్ఫోటనమొ
కలి గళ విదళిత పరుషమొ
శంభునిజూడనేగిన మది
భయవిహ్వలయయ్యె
ఆకలాక లనెడి నవగ్రహ
రోదనా సంవేదన గని !
యపసవ్య ప్రదక్షణన నవి
యరచేతుల చిప్పల నిడుకు
చిందులు వేయుచు కడు
దైన్యతనాక్రందించు చున్నవి!
వడలు మరచి,నిల్చితి
రెప్పలార్పక నిస్చేష్టతన !
తనువున పూనిన కల
కలకాదు భయద స్ఫృహ!
వడల తెరుపుకు గీలించు!
కనులు తెరచిన చెరగదె!
నిజమె భ్రమగ తలతు,
నిన్నమొన్నగ నిలచి,
నేటికి నిలచి వడల కలచు!

No comments:

Post a Comment