Friday, March 13, 2026

 BB w                    T D 7 January 2017

 
Shared with Friends
ఏరోచిస్స్పరివర్తనమొ పరిణామక్రమము
ఏ మేధో మధన జన్యమో జగత్‌ప్రకటనము
ఏ కలిత చలిత ఫలితమో జీవావిర్భావము
అవును మంచి గురించేగా మానవ మేధోమధనం
నేనూ నీవూ మంచేగానీ హద్దుందిగా మంచితనానికి
త్రెంచుకోవాలనుకున్నా ఓ మనిషీ ఎంగిలిపడ్డా
పడకున్నా నిద్రించినా మెలకువయైనా తొంగి చూసే
నీ మనసూరుకోదుగా మంచికీ చెడుకీ తులపట్టక
తలపట్టుకు జరిగినదానికి కడు వగచే బదులు
సర్వం ఋణానుబంధమే అనిసరిపెట్టుకుంటావా
లేక తర్కించి వాళ్ళు వీళ్ళు అందరూ మంచికో
మరి చెడుకో ఏకం మమేకం అద్వితీయం అనీ
దంత వేదాంతమో లేక ప్రసూతి వైరాగ్యమో
ప్రతి కూలానుకూల చర్యల్లో ప్రతిబింబిస్తావా?
నీ మతం నీ అభిమతం ప్రతిప్రశ్నలో
ఒకవేళ ఒలక బోస్తావా,మరి కన్నీళ్ళకి
వాళ్ళే కారణమని ఆరోపిస్తావా కొంచం
సంభాళించుకో ఆనక అవగతమౌతుంది
వాటారిపోయే సంధ్యాసమయంలోక్రోధమూ ,
భావగర్భిత మౌనమూ జవాబులుకావు
అసలు ప్రశ్నయేమిటీ ఎందుకూ ఎలాగా
గుర్తుందా దాని కారణానేగా నువ్వు పుట్టి వుట్టిగట్టుకున్నది
బ్రతికి సాధించాల్సింది వురివేసుకు తీర్చలేవుసుమా
కోరికలు గతంలోని మరకల చారికలు కారాదుగదూ,
తల్లినీ చెల్లినీ తండ్రినీ తమ్మునీ పలకరించు
అల్ల నేరేడు పండు అల్లుడూ ఇల్ల దీపపు వత్తి కోడలూ
నీ కంటి పాపలేసుమా,కానైతే నీ బ్రతుకెంత,
వాంచితాలూ వాస్తవాలూ తెలుసుకునే వున్నావా
అన్నీ అప్పుడేమర్చి ఇప్పుడు విప్పర్చుకున్న
కన్నులతో కొల్చుకుంటున్నావా అయ్యో నీడ గడపదాటేను
సరికాదీతరి కన్నీళ్ళకీ కార్పణ్యాలకీ,ఔనా

No comments:

Post a Comment