Friday, March 13, 2026

 anarayana Charyulu Maringanti shared a memory.

10 April 2018 
Shared with Friends
కాలము నిత్యము కరగెడు కల్హార పరిమళము
సోధన నిత్య కృత్యసత్యమౌ ఘృత దీపము
పరువెట్ట కాలము వెంట పరువంపు ప్రాయము
నిజజీవిత తోరణమున దిన దిన యజ్గ్నము
సంగతాసంగతములు విషయములు
జనన మరణములు స్థితి వైవిధ్యములు
కాని సత్యకామము అను నిత్యము
ధర్మము చేకొన్న జయము తధ్యము
జయమన్న జగముల వెలిగించు సత్యము
సతతము కాలాతీతము ధృవతార దివ్యము
ఆది మధ్యాంత శోధనా వ్యాసంగము
సాంగోపాంగ స్వాధ్యయన యాజ్ఞీకము
వేదవ్యాస ప్రణీతము నిబిడ కృష్ణ శోషితము
నచికేత నహుష శుక సౌనక తాత్విక శోధితము
జయము మహాభారతము శాకుంతలము
భరత జడ భరత జరత్కారు అస్తీక జనమేజయము
కనము వినము ప్రపంచమున వేరొండు ధర్మ విస్తరణము
జయము జయము మహాభారతము అజరామరము

No comments:

Post a Comment