Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

18 June 2017 
Shared with Friends
తనువు సచేలమయ్యు కుచేలము
మనమె కనుగొనిన పెనిమిటి తన్వి
తను వెలుగును యాత్మ వశమున
తనువె తాననుకొనిపెనుభూతమగు
మనసె వురుల కూపిరి తీపరము
వయసోర్వదుమనసునిచ్చగించదు
పాలనువిడిచి వేలునుకుడిచెడి శిసువు
విసువొందక వెల్గెడు ఆత్మానందరూపము
తనదు మనసు పెరుగు తనయగ
తలరు మాయలేకమావియందు
తెలివిమాలు తేటకాని మాటల
తల్లిగర్భమున తనువెల్లనాత్మయె
పుటకన జగమెరిగి గుక్కగనేడ్చు
చిటికె పాటుమన ఉలికులికి పడు
కటికెమాటల చెవులొగ్గి వినుచు
నటలోకమున నడయాడ నేర్చు
ఆత్మ అలరారు తల్లి సచేతన క్రియన
అమ్మయె బొమ్మకు ప్రాణమిచ్చు బ్రహ్మ
ఆమె తినెడి వినెడి త్రావెడి సర్వము
అతులిత ప్రసన్నతాప్రసాదము బిడ్డకు
తుదకు తల్లి యిచ్చు మనము
తనది ముదమో మోహమో తన
తనువున పాదుకు మేలచిన పాదుకు
తనది, తన మనమున నెలకొన్నది

No comments:

Post a Comment