Friday, March 13, 2026

 21 డిసెంబర్ 2015 18:39

ఒరవి గల తెనుగు నాట పూచిన పూదోట,
సిరుల ఆట వెలదుల తేనె వూటల మాట,
అచ్ఛ తెనుగు, పచ్చి పసుపు, విచ్చు రూక,
మెచ్చి పునుగు కస్తూరి పరిమళ మలదె,
వాగ్దేవి! విభవ వీవు, కానీ అమ్మ, కైఫీయతులెత్తి
కఱకు కసాయి తురకలానాడు చీల్చిరి
నీ మేనును రెండుగ ధుఖ్హనీ దక్కనని,
చేరి తీరపు జనుల పల్లెల కలపి యాంధ్రమని!
శాతావాహనుల నాడు,ఇది లెస్స తెలుగు నాడు!
కాకతీయులు . కళల కస్తూరినద్దిరి నీ నుదుట!!
అమ్మా ధాక్షాయణీ ఈశాన్యపు నీ నగ నుత్తరిన్చిరి
నాతల్లి ఈశానుని కడ కేగితివా?
కలహములు, కరవులు,నైచ్యములు కద్దయినవి!
పుస్తెలు త్రెన్చు వారు,శిశువుల జంపు వారు,
మానముల ప్రాణముల చెలగి క్రీడించెడి వారు,
దండక పరివారము వికృత వ్యక్త మౌతరి,
దిక్కు తోచక ప్రభువులు యాగములు జేతురే !
నరసింహ, నీవు నడయాడిన నేల చీలినది !
యహో బిలము నుండి,అంతర్వేది దనుక
నీది కాదా రాజ్యము ?, కలపి కష్టము బాపగదె!!
20 డిసెంబర్

No comments:

Post a Comment