Shared with Friends
దయ్యాలకి తల్లి తండ్రి వూరూ వాడా కూడానూ
శిక్షని పంచాంల్సిందే తల్లికీ తండ్రికీ ఆసమాజానికీ!
ఏం, కని పెంచిన వాళ్ళూ కాల సర్పాలే,కాదామరి!
విషంపోసి పెంచిన, భరించిన సమాజాన్ని, శిక్షించద్దూ
మానవమృగాల్ని ఎందుకుపోషించాలీ?
కుళ్ళే గర్భాలకిDNA తియ్యాల్సిందే.
గుడ్డులోనే పాముని చంపాల్సిందే!
పోలీసులూ 'నిర్లక్ష్యానికీ లంచాలకీ తలవంచితే'
మీపని మాకోద్దు.,
మిలటరీ పోలీసులూ 'ఇంట్లో కిరాతకులుపడ్డారు', '
వీళ్ళని 'దయ్యాలని' బలైన 'మానవి ప్రియాంక' పిలిచింది.
'పట్టుకొండి' పట్టుకోండి' దయ్యపు పిశాచాలని '
తుడిచి పెట్టండి!మాకు టోలుగేట్లొద్దు
అవి యమ ద్వారాలని పాప చెప్పక చెప్పింది'!
అడ్డమొచ్చే చవట వ్యవస్థని తుడిచెయ్యండి!!
భయమౌతోంది, నిజంగామాకు,భయమౌతోంది!
మోడీగారూ సర్జికల్ నో మరోటో మీఇష్టం,
ఇక్కడ గాజుల మోజుల్లో పాలక రక్షకులు బిక్షమెత్తుకుంటుంన్నారు!
మీ వల్లకాదంటే మాకు మళ్ళీ స్వతంత్రంపోయిందనుకుని
సుబాస్ చంద్రబోస్ కోసం తపస్సుచేసుకుంటాం,
అల్లూరిని వెతుక్కుంటాం,ఆజిద్ గారిని వెతుక్కుంటాం
ఆఖరికి చైనావాడూ
మన దయ్యాలకన్నా పిశాచ సమాజం కన్నా నయమేనేమో?
ఇది మా ఆక్రోశం!,ఆలాపం!!
No comments:
Post a Comment