Friday, March 13, 2026

14 March 2017 
Shared with Friends
తవ్విపోసేన్దుకు తలపులకుతోడు గతము
గతములోన్చి బయట పడితే పగలు తోడవుతుంది
పగలు తలుపులు తెరిస్తే వెలుగు తొంగి చూస్తుంది
వెలుగు ప్రకృతి,మేలుకొలుపు మనసును
మేలుకున్న మనసు కు రాత్రి మితృలు
నక్షత్ర గ్రహ తారలు మాయాతృప్త మరీచికలు
పగలు ఆకలిదప్పులకవల అరిషడ్వర్గుల వల
ఎంచి చూసేమనసుకి మిణు గురులు
మనోకంపనకి రగిలి యెగిరే నక్షత్ర పుంజాలు
గతంకన్నా ప్రస్తుతం నిరంతర సంగతం
పుంఖానుపుంఖాలుగా క్రొత్తసవాళ్ళూ
పుట్టుకొస్తాయి సుమా మనసా సాథన కడ్దంగా
భవిష్యత్తు నీలోపూచి వెలు గొందేదే కావలెసుమా!

13 March 2016 
Shared with Friends
నవ్వుకీ ఏడ్పుకీ కన్నీళ్ళు తోడైతే,
మనసు ద్రవించిందని తెలుస్తుంది.
మనో మరీచికలని పట్టుకోడానికి
కవికుమారుడు అక్షరాలని పూసగ్రుచ్చితే,
చిత్రకారుడు రంగుల సంగతులు అవిష్కరిస్తాడు
. మనసు పాడే మౌన గీతానికి సంగతులివే!
కన్నీటి కెరటాల వెన్నెలా, నిట్టూర్పు ఘాడ్పులో నెత్తావీ
పురుడుపోసుకు అజంతా చిత్రా లూ హంపీ కన్యలూ పుట్టుకొస్తాయి
! దామెర్ల బొమ్మలూ,విశ్వనాధ స్వగతమూ
క్రొత్త తరపు తరంగాలైతే, శుక్ర నీతీ,వ్యాసగీతీ తపహ్ ఫలాలు
యాగ్న్య వల్క్య,ఆపస్తంభ, పరాశర సూత్రాలు
మానవ జీవన విధానానికి అపురూప ప్రమేయాలు!
-మనిషి మనసుని కడిగి ఆత్మదర్శనమే
ఆద్యంతమూ నాగరీకత లక్ష్యమని చెబుతాయి-
అంటే ఒకింత విచారమూ,బుద్ధికుశలతానూ
అట్టి కుశలత సాధకసిద్ధమనే గాధలేన్నో
వెతుక్కుంటేనే దొరుకుతాయి!,
మనస్సు శాంతమై శరీరము ప్రకాశిస్తుంది
ఆత్మావిష్కరణలో ధుఖమూ ,సంతోషమూ
రెండుకళ్ళనిండా కన్నీళ్ళు పెట్టిస్తాయి

No comments:

Post a Comment