Satyanarayana Charyulu Maringanti
కవి వివశత కవిత
కల తలపు పలుకు
కవన వన నివేదన
కధ వ్యధ కానిది
సృక్ శృవ జనిత
ధీ మనో హోమ
తుల్య తులనాత్మక
జీవ భావ పుంజిక
అపుడుపుట్టినకవిత పేరు వేదం అవుతుంది
అమ్మయన్న కన్నతల్లి కల్పవల్లి
జనని అవని పరమ పావని
మన్నున మిన్నున యంబుజ మమ్మ
అమ్మ యన్న అగ్ని సుజల సునయన
వేరెన్నగనేల ధరిత్రి పవిత్ర చిత్రమె అమ్మ
కమ్మగ అమ్మని తలచితి నిక అమ్మలకమ్మ
అవనిని మూర్కోని ప్రణుతి చేసెద, తను
సుడితిరుగుచు వడిన సూర్యునిజుట్టున
చీకటి వెలుగగుచు ఋతువగుచు
నీటిని నిప్పును కడుపున నిడుకొని
తిర్యగ్జడముల ప్రసవించుచు, పెంచుచు
మరణించిన అక్కున జేర్చుకు రొక్కుచు
నాదు తల్లి పుడమీ, పాత్రత నీయక
పాదముల మట్టి చెట్టు చేమల త్రొక్కి
సకలముల వికలముజెందక తిని
నీదు గర్భమున నడయాడెడు మనుజుడ
నేడు తల్లినితలచు దినమట ఋజువుగ
నీవతల్లులకు తల్లివికావె వందనమమ్మ!!
No comments:
Post a Comment