మనం మన్ని తలచుకోవడము అద్దంలో అంతరాత్మను వీక్షించడం ఏమాత్రం కాదు. దృశ్యం బహుశః మనసుల మధ్య దోగాడే వ్యక్త భావ జాలము . దానివెనుక దాగునివుండే రాగద్వేషాలు, ఊహా అపోహలు ప్రొవయ్యే వ్యక్తిత్వ వికాసపుచీకటి వెలుగులు మాత్రమే. అమ్మ కొంగు వెనకాల దాగుకునే పెరిగే మనసుకు సింగారం. ఎంత అందమైన చిన్నతనము. ! చంటి దాని పైన అమ్మ చూపించే వాత్సల్యము అన్నదమ్ములకు అపురూaప ప్రపంచపు ఆనందహేల. తరువాత కొన్నేళ్ళకి పాపకి ప్రాపంచిక విషయము ఊరేగుతూండగానే కలిమి లేముల చీకటి వెలుగులని తెలిసిపోతుంది. గుమ్మానికి వే5లాడే పూలదండ కదిలే కాలపు ఆటుపోటులకు దాష్టీకానికి తెగి పడిన తరుణంలో అన్నా అక్కా వేరే వంటకి కుంపటి వేరే ఇంటికి
Friday, July 10, 2026
మంచంమీద పడుకున్నాను. మగత నిద్ర అనుకుంటా, కాని తెలివీ స్పృహా బరువయ్యే ఊపిరి లో కొట్టుమిట్టాడుతున్నాయి.
శాంతి ఆశ్రమంలో రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది. చదువుకునే పిల్లలకు యూనిఫాం ఉండేది. పసుపుపచ్చ షర్ట్ పైజామా, గాంధీ టోపీ. ఇదిగో ఈ టోపీ నాకు చాలా నచ్చింది. నాన్నగారిని టోపీ కుట్టించమని అడిగాను. శాంతి ఆశ్రమం ఎంట్రన్స్ ఆర్చి గేట్ ముందు బస్ స్టాండ్ కొన్ని కొట్లు ఒక హోటలు ఉండేవి. దర్జీ కొట్టు కూడా అక్కడే. రెండు తెల్ల టోపీలు కట్టించారు. మా సైనిక్ స్కూల్ ప్రయాణంలో ఈ టోపీ చాలా ఉపయోగపడింది. నన్ను నా టోపీని చూసి బెండపూడి సాధువు ముచ్చట పడ్డాడు. ఆయన ఆశ్రమము మామూలు పెంకుటిల్లే. కాకపోతే మండువా అరుగుల ఇల్లు. , తూర్పు కేసి ప్రహరీ గోడ తలుపులు తెరుచుకుని ఉత్తరంకేసి సందు దారి , దాటి ముందుకెళితే ఓ యాభై అడుగుల తరువాత దక్షిణం కేసి పెరడు కనిపిస్తుంది చాలా విశాలం గా ఉంటుంది. పెద్ద ఈతాకు చాపలూ రెండో మూడో బెంచీలు నులక మంచము చూసినట్టున్నాను. ఇంటి పడమటి ద్వారం పెద్ద ఎత్తైన అరుగు పైకి తెరుచుకుని ఉన్నది.ఏడెనిమిది అడుగుల అరుగు క్రిందికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఒకాయన బుంగ మీసాలు, బవిరిగడ్డంతో ప్రక్షచ్య మయ్యాడు. అరవై ఏళ్ళుండవచ్చు. నోట్లో పెద్ద చుట్ట. తాపీగా పొగతాగుతున్నాడు. కొంతమంది చాపలమీద కూచున్నారు. బెంచీలు ఖాళీ గా ఉన్నాయి. మేము ఎండలో నడిచివచాముకదా నాయనగారి తెల్లటి మొహం ఎర్రగా కందిపోయింది. మేము కోటలోకి ప్రవేశించేముందే ద్వారం దగ్గర రాతి తొట్టేలున్నాయి. వాటి పక్కన రెండు ఇత్తడి చెంబులున్నాయి. అక్కడ కాళ్ళు కడుక్కున్నాము నాన్నగారు కండువాతో నామొహం తుదించారు. లోపలకి ప్రవేశించాము. నా టోపీ తడవకుండా నాన్న గారికి ఇచ్చానుకదా అది మళ్ళీ జాగర్తగా నెత్తిమీద సద్దుకున్నాను. నన్నూ నాన్నగారినీ బెంచీమీద కూర్చోమని లావు కర్ర పట్టుకున్న ఒకడు చెప్పాడు. నాన్న గారు సాధు గారూ ఎడ్వో విషయాలు మాట్లాడుకున్నారు. నాన్నగారు బెండపూడి సాధువులు చాలా పెద్ద దండం పెట్టారు. ఆయన మా వెనకాల కొంతమంది వచ్చారు. వాళ్లకి ఆయన చుట్ట లను చేత్తో విసిరి ఇచ్చారు. ఆయన మాట్లాడుతూనే గుమ్మలోకి తొంగిచూసి చెయ్యి ఊపారు. ఒక గంప, అరటి ఆకులతో కప్పి ఉన్నది బయటకొచ్చింది. ఆయన అందులోంచి లావు గారెలు తీసి నాయన గారికీ నాకు సమర్పించారు. బుంగ మీసాల వెనక చిరునవ్వు ఆయన చామన ఛాయ మొహం కళ్ళలో కదలాడుతోంది. నాన్న గారు రెండుమూడు పద్యాలు చదివిన గుర్తు. అవే శాంతిఅశ్రమములో చదువుతూ ఉండేవారు. మేము తిన్నవి బెల్లపు పాకలో నానిన నేతి గారెలు. ఇప్పటికీ మళ్ళీ అలాంటి గారెలు తినలేదు.
శేరో శేరున్నరో పాలు తెచ్చేవాడిని. ఒక గంట న్న ర పట్టేది. పోలాల మధ్యన మట్టి రోడ్డు . పొద్దున్నే బంగాళదుంపలవాసన వచ్చేది. కర్రపెండలం సాగుచేసే వారు. అమ్మా వాళ్ళు ఏదో కబుర్లు కట్టడి ఇంట్లో కనిపించేది. మోహన్ మరీ చిన్నవాడు. మూడునాలుగేళ్ల పసివాడు. ఓంకార స్వామీజీ ధ్యాన పూజా మందిరంలో ఒక ఎత్తైన దిమ్మ మీద కూచుని మౌనంగా ఉండే వాడు. .చివర మూడు సార్లు చాలా దీర్ఘంగా ఓంకారం ఉచ్చరించి విచారింపచేసేవాడు. సరిగ్గా అలాగే మోహన ఉన్న తలగడాలన్నీ దిమ్మచేసుకుని చాలాసేపు కళ్ళు మూసుకు మౌనంలోకెళ్ళిపోయాడు. నిజంగానే ఆకుదురు ఆశ్చర్యంకలిగించేది.ఎందుకంటే అది నాకేమాత్రమూ లేదు.అమ్మ నాచెయ్యి చూసి భౌతికపరమైన వాంఛా గరిష్టతని నా జీవిత ప్రవాహికలో గుర్తించింది. భార్యాలోలుడినీ అవుతానని అంటూంటేది. సరే నాటమ్ముళ్ళ విషయము నాకు గర్వకారణం కాదూ..
రాజుగారు ఆశ్రమానికి వచ్చే విజిటర్స్ పెద్దపిల్లల బడికి బ్యాచ్ విజిటర్స్ ను ఓ కంట కనిపెడుతూ ఉండేవారు. నాన్నగారు ఎక్కడికెళ్లాలన్నా నడిచే వెళ్ళడము ఇవన్నీ గమనించేవారు. ఆరోజుల్లో ఇండియా కి కెనడా నుంచి ఉస్ నుంచి మిల్క్ పౌడర్ వీట్ పామ్ ఆయిల్ వగైరా ఎయిడ్ వచ్చేది. ఆశ్రమానికి కూడా అది అందుబాటులో ఉండేది. మన ప్రజలు వాటిని బ్లాకులో అమ్ముకుంటున్నారని గవర్నమెంట్ మిల్క్ పొడి ను వీ�
10/07, 6:56 pm] satyalakshmistp: డియర్ మోహన్ in no case this history to be shared with other family members untill we deside up on together. Sorry I am deleting it fearing safe upkeep of these series ...
04/07, 10:11 am] satyalakshmistp: అది తిరుసెంగళం తాతగారి ఇల్లు. ఆయన తిరునామాలతో వెలిగిపోతూ నాన్నగారిని నన్ను చాలా ఆప్యాయంగ రిసీవ్ చేసుకున్నారు. వారి ఇల్లు G. T రోడ్డుకి భోగిలింగేశ్వర ఆయుర్వేద నిలయం రోడ్డుకి మధ్య విస్తరించి ఉంటుంది. మంగ అత్త గారి ఇంటి ప్రతి పడమటి వైపు గోడ అవతల భోగిలింగేశ్వర ఆయుర్వేద నిలయం వారిది. మేము మగత గారి ఇంటికి వెళ్ళాము. నన్ను నా టోపిని చూసి మంగత్త సంతానం అమ్మలు వదిన సంతానం చాలా ఆట పట్టించారు. నన్ను పాట పాద మన్నారు. నేను బోలెడు పాటలు పాడాను.అప్పుడు కూడా నవ్వారు.అప్పుడు నాకు సిగ్గనిపించి తల దించుకున్నాను. మంగత్త గారు పిల్లలని కసిరి నన్ను ఒళ్ళో కూచోబెట్టుకు టోపీ తీసి ' ఎంత అందంగా ఉందో వీడి జుట్టు తలకట్టు ఎంత బాగుందో అని తలకి కొంచెము నూనె పట్టించి దువ్వారు. ఈలోగా రాఘవుడు మామయ్య గారు వచ్చి నాపేరు తెలుసుకుని సత్యం అని పిలిచారు. వదినెలు చిన్న వాళ్ళు అప్పుడు నన్ను సత్యం బావ అని గౌరవించారు. మంగత్త గారి సంతానంలో ఒకాయన అప్పుడే వరండా లోకొచ్చాడు. నన్ను, ఆటపట్టిస్తున్న అందరిని గమనిస్తున్నాడు.ఆయనకి ఒక కాలు లేదు . చంకలో కర్రలున్నాయి. జుట్టు పొడుగ్గా పాలచగాభుజాలకింది జారిఉంది. పొడుగు గడ్డం గుండెల్దాకావుంది. చూడబోతే చందమామలో మునీశ్వరుడి బొమ్మలావున్నాడు. ఆయన ఎవ్వరినీ పట్టించుకోవడంలేదు.
:11 am] satyalakshmistp: అది తిరుసెంగళం తాతగారి ఇల్లు. ఆయన తిరునామాలతో వెలిగిపోతూ నాన్నగారిని నన్ను చాలా ఆప్యాయంగ రిసీవ్ చేసుకున్నారు. వారి ఇల్లు G. T రోడ్డుకి భోగిలింగేశ్వర ఆయుర్వేద నిలయం రోడ్డుకి మధ్య విస్తరించి ఉంటుంది. మంగ అత్త గారి ఇంటి ప్రతి పడమటి వైపు గోడ అవతల భోగిలింగేశ్వర ఆయుర్వేద నిలయం వారిది. మేము మగత గారి ఇంటికి వెళ్ళాము. నన్ను నా టోపిని చూసి మంగత్త సంతానం అమ్మలు వదిన సంతానం చాలా ఆట పట్టించారు. నన్ను పాట పాద మన్నారు. నేను బోలెడు పాటలు పాడాను.అప్పుడు కూడా నవ్వారు.అప్పుడు నాకు సిగ్గనిపించి తల దించుకున్నాను. మంగత్త గారు పిల్లలని కసిరి నన్ను ఒళ్ళో కూచోబెట్టుకు టోపీ తీసి ' ఎంత అందంగా ఉందో వీడి జుట్టు తలకట్టు ఎంత బాగుందో అని తలకి కొంచెము నూనె పట్టించి దువ్వారు. ఈలోగా రాఘవుడు మామయ్య గారు వచ్చి నాపేరు తెలుసుకుని సత్యం అని పిలిచారు. వదినెలు చిన్న వాళ్ళు అప్పుడు నన్ను సత్యం బావ అని గౌరవించారు. మంగత్త గారి సంతానంలో ఒకాయన అప్పుడే వరండా లోకొచ్చాడు. నన్ను, ఆటపట్టిస్తున్న అందరిని గమనిస్తున్నాడు.ఆయనకి ఒక కాలు లేదు . చంకలో కర్రలున్నాయి. జుట్టు పొడుగ్గా పాలచగాభుజాలకింది జారిఉంది. పొడుగు గడ్డం గుండెల్దాకావుంది. చూడబోతే చందమామలో మునీశ్వరుడి బొమ్మలావున్నాడు. ఆయన ఎవ్వరినీ పట్టించుకోవడంలేదు.