Shared with Friends
పాతపాటే కానీ విడివడ్డ నుడికట్టు
మొట్టమొదలో చిట్టచివరో ఏమో
చేతి వాటు చేతఘాటు చే'చెలరేగే
దొరల దొరకని పరివార ఖరవీరులూ
దొరకబుచ్చుకు నేలా,ముక్కూ పిండే
శూర్ఫ కర్ణులూ పౌండ్రక వాసుదేవులూ
అటు ఆవైపు శిలువల కొయ్యలబడి
ఇటుఈవైపు నామాల నడమంత్రాంగం
వంటెద్దులెక్కి మేకుల కుందేలుకొమ్ముతో
నిశాసమయాల్లో దిశా నిర్దేశకులయ్యారుగా!
అందుకే ఇసుకతో వళ్ళురుద్దుకునే ప్రజలూ
బండి వదలి నేలన పొర్లే సబ్బండ కర్మిష్టులూ
ఇష్టబంతుల్లో స్వయానా కష్టబడు తున్నారు!
No comments:
Post a Comment