వలయమేకానీ తిరుగుతూనేవుంటుంది
తూలిపడిముందుకూ త్రుళ్ళిపడి వెనక్కూ
నడకో పరుగో స్థబ్దమై నిలవరించబడో
తిరుగుతోనేవుంటుంది,,మెరసిన నిన్నటి
కురులు వేకువపొద్దుకలలో నెరపులయ్యాయి.
మళ్ళీరాత్రి చిన్న తనంచిందుల బృందగానం
పరువంప్రకృతి గమనం ప్రకృతే.నిశ్శబ్దం కాదేమో!
నిరంతర చలనంలో కాలప్రవాహి అలలపై
ముందుకూ వెనక్కీ సాగుతూ ఆగిపోయే
సంగతుల చిత్తడిపాట అందమే, వివిధమే!
ప్రతిబతుకూ పూలదండలో దాగినదారమే!
పుటుక్కున తెగే దారంముక్కలెంత
వైవిధ్యములో అంత సారూపకములు.
నిడివి తప్పి కాలంచేసే సువాసనలే!
తవ్వి తరాలు వెతుక్కునే మనిషి
నీడ చూసి పొడుగనుకుంటాడు,
కీర్తికోసంగతజలసేతుబంధనమా!
అవును., ఉనికి అవ్యయ మవ్వాలంటే
వలయాన్నిఛేదించాలంటే
వ్యోమకూపంలో ధూమకేతువు' నే'
నవ్వాలని సకలేంద్రియ యింధనాలూ
నల్లేరుపైబండినడక చేసి సాగుతాడు.
కాని కాని అలెగ్జాండరూ అశోకుడూ
ఘజనీ పుటుక్కున దారంతెగి
కాలంఅంచులో కాలంచేశారు.
కాటుకచీకటి నిజంచెప్పేది
ఘూతక జనం కనగలిగేదా,
పాతక క్రియా చేతననాపేదా!
అన్ను వలయ బంధిత జీవాలే!
ఆలోచించి అనాలోచితనాలేమో!
చిన్నవికొన్ని దీర్ఘాలు మరికొన్ని!
తెలిసి తెలిసీ తెల్లార్చె చావుకి
ఖనన దహన హనన మరణాంతర
క్రియాబేధాలూ మృదంగ తురంగ
షడంగ అభంగ అభ్యంతర విన్యాసాలూ
ఏడ్పులూ నవ్వులూ మొత్తుకోళ్ళూ
మర్యాదమర్యాదలూ సర్వ సమానాలు!!
కాలానికి టోపీలేదు, నామాలూలేవు
పృఛ్ఛకుడి ప్రశ్న అవధాని జవాబూర్
రెండూ పిచ్చివే అవనిక యెత్తేసరికి
తూలిపడిముందుకూ త్రుళ్ళిపడి వెనక్కూ
నడకో పరుగో స్థబ్దమై నిలవరించబడో
తిరుగుతోనేవుంటుంది,,మెరసిన నిన్నటి
కురులు వేకువపొద్దుకలలో నెరపులయ్యాయి.
మళ్ళీరాత్రి చిన్న తనంచిందుల బృందగానం
పరువంప్రకృతి గమనం ప్రకృతే.నిశ్శబ్దం కాదేమో!
నిరంతర చలనంలో కాలప్రవాహి అలలపై
ముందుకూ వెనక్కీ సాగుతూ ఆగిపోయే
సంగతుల చిత్తడిపాట అందమే, వివిధమే!
ప్రతిబతుకూ పూలదండలో దాగినదారమే!
పుటుక్కున తెగే దారంముక్కలెంత
వైవిధ్యములో అంత సారూపకములు.
నిడివి తప్పి కాలంచేసే సువాసనలే!
తవ్వి తరాలు వెతుక్కునే మనిషి
నీడ చూసి పొడుగనుకుంటాడు,
కీర్తికోసంగతజలసేతుబంధనమా!
అవును., ఉనికి అవ్యయ మవ్వాలంటే
వలయాన్నిఛేదించాలంటే
వ్యోమకూపంలో ధూమకేతువు' నే'
నవ్వాలని సకలేంద్రియ యింధనాలూ
నల్లేరుపైబండినడక చేసి సాగుతాడు.
కాని కాని అలెగ్జాండరూ అశోకుడూ
ఘజనీ పుటుక్కున దారంతెగి
కాలంఅంచులో కాలంచేశారు.
కాటుకచీకటి నిజంచెప్పేది
ఘూతక జనం కనగలిగేదా,
పాతక క్రియా చేతననాపేదా!
అన్ను వలయ బంధిత జీవాలే!
ఆలోచించి అనాలోచితనాలేమో!
చిన్నవికొన్ని దీర్ఘాలు మరికొన్ని!
తెలిసి తెలిసీ తెల్లార్చె చావుకి
ఖనన దహన హనన మరణాంతర
క్రియాబేధాలూ మృదంగ తురంగ
షడంగ అభంగ అభ్యంతర విన్యాసాలూ
ఏడ్పులూ నవ్వులూ మొత్తుకోళ్ళూ
మర్యాదమర్యాదలూ సర్వ సమానాలు!!
కాలానికి టోపీలేదు, నామాలూలేవు
పృఛ్ఛకుడి ప్రశ్న అవధాని జవాబూర్
రెండూ పిచ్చివే అవనిక యెత్తేసరికి