Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

29 May 2018 
Shared with Friends
కాలకీలలకరిగిపోయెడిది
కంటియెదుటి భ్రమాభూతం
మొలత్రాటిని రోటగట్టినప్పుడొ
నెలతమంటిని నోటజూపమన్నంతనొ
విరూపయయ్యె భ్రమ విభ్రమ మతికి
పెరిగెడితరి శరీరకుహర వ్యాప్తము
పరిపరివిధముల అంగికమౌ మది
యదిగొనదు బుధ్ఢిప్రచోదితచేతన
కనుకొనల కనుగొను మనశ్శరాఘాత
తనుమోహశీలత విభ్రాంతమె
అంతకాల సంచిత స్ఫురాస్ఫురణమున
శిశుచేతన పశుపాలనబడి
విసువొందక విషయమునెంచి
పునరపియని తనువును కోరును
ఘన మనమా యాలింపుము
బుధ్ధి చక్షువుల సకృత్తుగ
జన్మ జరామృత సౌచమును
ధన్యత వొందుదువీవు కడుమాన్యత

No comments:

Post a Comment