·
Shared with Friends
- ఎన్నో జన్మలనుంచీ వెతుకుతూనేవున్నాను,
- ,నాకున్న ఈతొడుగు ఇప్పటిదిమాత్రమే!
- పరదేవతాన్వేషణలో,అహమైన 'నే
- బహుశ:,ఎన్నో కుబుసాలు విడిచాను'
- ఇహనికి దగ్గరగా,అహానికిదూరంగా!
- కాని లయించిపోయే,కాలప్రహాంలో
- ఎప్పటికీ కొత్తే కుసుమపరాగము!
- చిద్రమైపోయే క్షణంలో ఒక అగ్నికీల,
- ఒకమట్టిపెళ్ళా,కూసింత గాలికూడతీసుకుంటా!
- నాకందని చిద్రూప ప్రహేళిక,
- 'నిబిడాంధకారంలో ప్రయాణము'.
- నిక్షిప్తనిధికై కాయచికిత్స నిరంతరమే!
- వికటిస్తూనే వుంటుంది,మళ్ళీవెదుకులాట,
- మళ్ళీ మట్టివాసన వాసనావశేషజన్మా!
- విశ్వాంతరాళంలో ఎన్నికాలాలున్నాయో!
- కాలాతీతమో,కాదోనా అవశేష ప్రయాణం
- ప్రతిజన్మా ఒక స్వర్గారోహణ పర్వమే,
- పరదేవత పృధ్యాప్తమే,కానీఅతీతమవ్వచ్చు
- జన్మజన్మల నీడలు శృంఖలవిన్యాసాలు
- అవధులెంచలేని ఆత్మకు తోడైకూడావస్తున్నాయి
- బొంది వదలిన తరువాత తరువూ,గిరీ,బంధువులే
- చీమా,పామూ,మనిషీ,మృగమూ
- యోని కూటపు తలుపులుతెరిచి పిలుస్తూనేవుంటాయి
- అవి నా'లా,ఇహంలో,'అహం'తోసహా తిరిగేవే,
- పాపమో పుణ్యమో,సంతతికంటించేవే
- తెలివైనమనిషి,గతీ సద్గతీ వరకెంచినా!,
- నా చిద్రూప జ్గ్నానానికి ఎంపికయ్యేనా,
- లేదు., తొందరచేసే కోరికల'కర్పూరం వెంటాడుతుంది.
- చితాగ్నులతో,ఆత్మ నాశనమవ్వదు!
- ఆవరణాబద్ధ ఆలోచనాస్మృతీ దగ్ధమవ్వదు!
- అందుకే,మళ్ళీ మళ్ళీ పరకాయప్రవేశమూ,
- పూర్ణాందమూ సచ్చిదానందస్పృహా!!
No comments:
Post a Comment