Friday, March 13, 2026

 ary 2017

 
Shared with Friends
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జ పై,
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం,
బొకచోఁ బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయఁడు కార్య సాధకుఁడు దుఖ్ఖంబున్ సుఖంబున్ మదిన్..
చాగంటి నిగమ ప్రవచన రుచీరామృత ధార చెవి సోకినంత,
యాగంటి పరమ శివుడర మూత నేత్రముల ఆదమరువడె!
క్రీగంటి చూపుల వన్నేకాడు వెన్న మరచి వినడె చాగంటి కధ!
ఏకాంత సేవలొద్దు చాగంటి కధ వలయు నని వెంకన్న కోపింపడే !
తల కడిగె గంగ హరునికి మొల కడిగె హరికి యశోద
హరిహరులకు నిలువెల్ల కడిగె అపర బ్రహ్మ చాగంటి
కోటి వీణల రాణి నాల్గు చేతుల నలుగెట్టి సాకేనో ఏమో
తెలుగు నాట ''కోటి" నీ మాట నలుగు ప్రతి నోట

No comments:

Post a Comment