Monday, December 29, 2025

EXTH: Page 1

[10/28, 5:50 PM] Maringanti Srilakshmi: పాలకొల్లు ప్రయాణము.  విజయవాడలో దిగినతరువాత పెద్ద పొట్లంతో అమ్మ మేన బావ ఇడ్లీలు తెచ్చినట్లు గుర్తు. నాన్నగారు ఇంజను దగ్గర వెన్నీళ్లు పట్టి తెచ్చారు. మేము రైలు మారాము. నన్ను  పగటి ప్రయాణం. రైలు ఖాళీగానే ఉంది. కాసేపు కిటికీ దగ్గర కూచున్నా.
[10/28, 5:52 PM] Maringanti Srilakshmi: కంట్లో బొగ్గునలక పడింది. అమ్మ  కళ్ళు పెద్దవి చేసి కొంచం తనచీరకొంగు కొసతో నలక తీసింది. కొంగు ఉందా చేసి కాపడం పెట్టింది. తర్వాత అమ్మ అక్క ' వీడిని ఓ కంట కనిపెట్టాలని అనుకున్నారు.ఒక పెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది. నాన్న గారు మంచి నీళ్లకోసం ప్లాట్ఫారం మీదికి దిగారనుకుంటాను నాకు కూడాబడడము అలవాటు కదా. కానీ పెద్దక్క కనిపెడుతూనే ఉంది. చెయ్యి పట్టుకు ప్లాట్ఫారం మీద బొమ్మల  బండీ,  బన్నులబండీ జనాలవైపు నా ద్యాస మరల్చింది. నాన్నగారిప్పుడు వచ్చారో ఎంతెచ్చారో గాని పెద్దక్క అమ్మ సత్యాల దృష్టి నామీంచి మళ్ళింది. అమ్మ చిన్ని, శిరీష్ లతో బిజీ అయ్యుంటుంది. వూరిపేరు నాకు తెలీదు కానీ గబుక్కున రైలు దిగేసాను.   దిగే వాళ్ల తోబాటు ప్లాట్ఫారము   మీదికి దిగజారాను.ముందుకు నాలుగడుగులేసాను. రైలెళ్లి పోతోంది. తరవాత నేను ఎత్తు బల్ల మీద కూచున్నాను.  కానీ బఠాణీలు తింటున్నాను.ఈలోపు ఒకాయనొచ్చాడు. ఉంగరాలజుట్టు కళ్ళజోడు నల్లగా ఉన్నారు , ఆయన వెనకాల నాన్నగారు. గుర్రం బండి మీద నేను నాన్నగారు, చిన్నన్న గారు సైకిల్ మీద. (చిన్నన్న గారిది ర్యాలీ సైకిలు. దీని గురించి మళ్లీ చెబుతాను. ) పాలకొల్లు చేరాను. నా మొదటి వంటరి రైలు ప్రయాణం ఆరేళ్లప్పుడు మొదలయ్యింది.ఎంత గమ్మత్తు, వెనకాల చిన్ని శిరీషు లు చిన్నవాళ్ళు.పెద్దక్క సత్యము పెద్ద వాళ్ళు. అమ్మ నాన్న జేజలు . ఇంతమందిని వదిలి వంటరి ప్రయాణము అప్పుడే మొదలయ్యింది. ( ఇప్పుడెంత విచారించేమి లాభం, అమ్మ లేదు, నాయనగారు లేరు, పెద్దక్క లేదు. సత్యమున్నా మల్లెతీవ లల్లుకొన్న కదంబ వృక్షమై వూర్ధోన్ముఖయై వర్ధిల్లుతోంది. చిన్ని తన జీవన సౌరభాన్ని బావగారి ఇలవేలుపుల పరిచర్యలో అంకితం చేసింది.తన ప్రాపుకోసమెళ్లినా తన వసంత కుంజ మంజన క్రియలో అనవరతయై శోభిల్లతూ  కుశలమడుగుతుందేమో. శిరీష
[10/28, 5:52 PM] Maringanti Srilakshmi: శిరీష కుసుమ పేశల మీమె  సుకుమారము. పుట్టిన క్షణమున ఎగ్మోర్ ఆసుపత్రి నర్సమ్మలీమెను అరచేతుల నెత్తుకున్న ఒత్తుకునునేమో యని గుసగుస లాడి రట. ఈమాట ఈనోట ఆనోట విన్నది కాదు, పెద్దత్త, అంగల్లు గారు, అనపర్తిలో, సింహాద్రి బావ గారింట, ముచ్చట్ల మధ్య యన్నమాట.చిన్ని గురించి అచ్చమ్మాళ్ వదిన 'కళ గల పిల్ల రాముడు మామ మూడో కూతురు, అని బంధువర్గం లో ఉటంకించేది .) సరే , ఇక నా కథలోకొస్తే, పైన ఇరువురు, క్రింద నిరువురు. తరువాత నేనే పెద్ద నయ్యాను. పాలకొల్లు లో ముందు పాక ఇన్టి లోనున్నాము.
[10/29, 1:59 AM] Maringanti Srilakshmi: కలితము సంకలితం కావచ్చు.కానీ  చరిత్ర కాని గతం సంగతులు పూసగుచ్చితే చెందిన భాగ్యరేఖ ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకఘట్టం,దాని చివర ఒక చీలిక ., అటో ఇటో ఎంచుకోలేని సందిగ్ధత, ఔను ఆటే అనిపించే వత్తిడి, లేదా పోరు , ఊహల ఊసులకి ఒద్దిక లేని బుద్ధి తోడ్పాటు, బహుశా బ్రూటస్ నీ కూడా ప్రభావితం చేసి కాని వుండచ్చు. నాకు అమ్మా దేవతే, వీధిలో గోడ మీద  అంజలి బొమ్మ దేవతే కానీ చీకటన్నా చిమ్మెట అన్నా   భయం.  దశావతారాల్లో కల్కిచెడ్డ వాళ్ళని శిక్షించడానికి వస్తాడని నాయన గారి భాగవత కథాగోస్తి లో విన్నాను. వెస్ట్  మాంబళంలో ఉన్నప్పుడు భారతంలో ఆదిపర్వ పారాయణం జరుగుతోండేది . Ok
[10/29, 2:32 AM] Maringanti Srilakshmi: ఒకఘట్టం,దాని చివర ఒక చీలిక ., అటో ఇటో ఎంచుకోలేని సందిగ్ధత, ఔను ఆటే అనిపించే వత్తిడి, లేదా పోరు , ఊహల ఊసులకి ఒద్దిక లేని బుద్ధి తోడ్పాటు, బహుశా బ్రూటస్ నీ కూడా ప్రభావితం చేసి కాని వుండచ్చు. నాకు అమ్మా దేవతే, వీల. నాయనగారు నక్షత్ర దర్శనానంతరం కధా గోష్టి మొదలెట్టేవారు.నేను ఆకాశం  కేసి మళ్ళీ మళ్ళీ చూసి వచ్చేశాయని ఓసాయంత్రం మంచమెక్కి అటకమీద భారతగ్రంథాన్ని దింపే ప్రయత్నంలో మంచమీంచి కింద పడ్డా. చెవ్వి పైన మచ్చ యిప్పటికీ అలానే ఉంది. వైద్య వివరం గుర్తులేదు. పంచదార వేసి వుండచ్చు. ,(పాలకొల్లులో కామేశ్వరమ్మ గారి  బుర్ర మీద పత్రం పెట్టి ఆవిడ మనుమరాలు  మోది నప్పుడు నాన్నగారు సవాసేరు పంచదార ఆవిడ. బుర్రమీద పోశారు.
[10/29, 2:44 AM] Maringanti Srilakshmi: ఇక్కడ రెండు విషయాలు. కామేశ్వరమ్మ గారు తల బోడి, మనుమరాలికి పిచ్చనుకునేవారు .ఈ సంఘటన మేము పాకలోంచి కామేశ్వరమ్మగారి పెంకుటి ఇంటికి మారిన కొన్నాళ్ళకు జరిగింది
[10/29, 2:47 AM] Maringanti Srilakshmi: పాక ఇంటి గురించి., ఒక పెద్ద హాలు గది, ఉత్తరదక్షిణాలుగా గుమ్మాలు. ఉత్తరం పంచ     అవతల వీధి.దక్షిణం గుమ్మాన్నముకుని                 పడమరకేసి వంటిల్లు. అమ్మ  పొయ్యిమీద వంట చేసేది. పెద్ద కుంపటి, చిన్నకుంపటి ఉండేవి. నేను కుంపటి అంటించినపాటు బాగా విసిరేవాడిని. ఎర్రటి రవ్వలు ఎగురుతుంటే చాలా థ్రిల్ కలిగేది. చూస్తుండగానే  పప్పు ఉడికేసేది. బొగ్గులేలోపు చతికిలబడితే ఆ మరికాసిని వేసి సరిచేసేది.
[10/29, 2:57 AM] Maringanti Srilakshmi: చిన్నాన్నగార్ని శేషు చిన్నాన్న గారని పిలిచేవారు. పిన్ని రాజేశ్వరి . తాతగారికి పేరు నచ్చేది కాదు. రాజేశ్వరనేపేరు వైష్ణవులు పెట్టుకోవడం ఆక్షేపణ. అంటే అమ్మా వాళ్ళుఆర్లదుకొంటేంటే మాకేవిషయాలు తెలిసాయి. బాలా మాటలు తెలిసి తెలీలో విని అసందర్భంగా మాట్లాడటం ఆనక చివాట్లు నాకలవాటు
 మా అయినది రెండో సంబంధముట. అంటే మొదటి పిన్ని కాలంచేసింది. ఆవిడ కిద్దరు అమ్మాయిలు. పెద్దది  పాప, రెండోది చెల్లెమ్మ ( ఇప్పుడు కొత్తగూడెంలో ఉంది) తరువాత పాపాయి పుట్టడము ఆవిడ కాలం చేయడం జరిగాయి. వాళ్ళిల్లు పాకింటికి ఎదురే . వాళ్ళింట్లో రేడియో ఉండేది. పాటలు వ్యవహారం మాకు కొత్త. నేను వాళ్ళతో  కలిసిపోయినా నాకు  తెలుగు సరిగ్గా రాక వెక్కిరింటలపాలయ్యేవాడిని. నన్ను బాను బదులు బర్రూ అని పిలిచేవారు. అక్క సత్యం కొంచం దూరంగా ఉండేవారు. అక్క ఇక్కడ 9 1o పదో చదివేది. సత్యం వాడి కొచ్చేది కానీ క్లాస్  సంగతి  తెలీదు.
[10/30, 12:39 AM] Maringanti Srilakshmi: పొడుగాటి జీవితంలో మంచి రోజులంటే విచారమెరుగనివి. రేపంటే  కలల ఊయలో సోలి  చప్పున తెల్లారే మరో రోజు.పాలకొల్లు బాల్యచేతనకి పూల పల్లె.. అవును పూలపల్లి దగ్గరే ఉండే వాళ్ళం. ఆపేట పేరు శంభుని అగ్రహారం. ఒక పాడుబడ్డ గుడి చుట్టూ విశాలమైన ఆవరణా  చేతికి అందే పొట్టి కొబ్బరి చెట్లు. ఇల్లు దాటి ఎడమ చేతివైపు వంద గజాలు నడిస్తే కుడివైపుకు రోడ్డు మళ్ళుతుంది . తిన్నగా సన్నటి కాలి బాట కొంచంవంకరటింకరగా తిరిగి పిల్లకాలవ పైన కొబ్బరి మాను వంతెనకు దారి తీస్తుంది. దాటితే వారి పొలాలు. కుడివైపు తిరిగిన తరువాత ఎడమ   పక్క శంభునిగుడి, నాలుగడుగులవతల నేను ఒకటో క్లాస్ చదివిన బొండం పంతులమ్మ గారి బడి. దాటుకు కొంచం ముందర తారు రోడ్డు. తారు రోడ్డు దాటితే లజపతిరాయ్ పేట . నాలుగు వరుస రోడ్లతో పెద్ద నివాస సముదాయము. అక్కడ నానగారి చిన్నాన్న గరుండేవారు. పక్కనే పోస్టాఫీసు. .నన్ను బళ్ళో మదరాసు నుంచి వచి కొద్దిరోజుల్లోనే వేసేశారు. నాకు పంతులమ్మ గారంటే. చాలా భక్తి ఉండేది. ఆవిడ పేరు లీలా వతి.కానీ చెల్లెమ్మ పాప అందరూ బోండాం టీచరనీ అంటే నేను చాలా ఊదుకునే వాడిని.   సత్యం 4 గో క్లాసనుకుంటా .
[10/30, 8:29 AM] Maringanti Srilakshmi: Hello yesterday I had been to a  fascinating  world of  Siberian part of Russia. The scenes were altogether different to rest of land scopes. The versal lake with a narrow gauge line the url mountain hot springs, the piller like long columned stones of steel mountains the line some forests of sparsely sprout ferns, the wider canyons  by of  the sledges and the fewer tribes struggling for warmth and survival.
[10/30, 8:31 AM] Maringanti Srilakshmi: You have to see how they make the ground for raising a tent. They are not igloos but so like to keep them warm.
[10/30, 9:16 AM] Maringanti Srilakshmi: I don't know where in Russia you were and whence it was, but the  Siebirria is altogether a different world. The coal explorations made a venture into tundra land and incidentally their first bargain with nature was salt from bursal lake, a beautiful sledge like narrow gauge line was the spectre.
[10/30, 9:19 AM] Maringanti Srilakshmi: And a long long stone bone road speaks volumes of cruel endeavour
[10/31, 12:11 AM] Maringanti Srilakshmi: పాప చెల్లెమ్మ పెద్దక్క హై స్కూళ్కి వెళ్ళేవారు. చిన్నాన్న గారింట్లో ధాన్యం బస్తలుండేవి. కాసిని బియ్యం ఇచ్చేవారు. ఆ ఇవ్వడము వరస అమ్మకి నచ్చేది కాదు. బుడుగు భాషలో నాన్న గారికి రోజు ఏదో విషయమై ప్రైవేట్ తప్పేది కాదు. నాకు నిద్ర కాబట్టి ప్రత్య క్షము గా తెలీదు.అక్కకి సత్యానికి తెలీదు. నానగారి వీపు పైన బరుకులుండేవి. బూచి రక్కిందనే వారు.నాకు దయ్యాలంటే చాలా భయం. ఇంటి వెనకాల జీబు చెట్ల వెనకాల బోదె కాలవలో చాలా కప్పలుండేవి. రాత్రయితే వాటికి తెల్లవారేదేమో. బెక బెక సంగీతం, దానికి తోడు కీచు రాళ్ళ రొద. రాత్రయితే చాలు భయం సేవుల్లోంచి మనసులోకెళ్ళిపోయేది. అమ్మ ఆంజనేయ మంత్రం చెప్పింది. పూర్తిగా రాకపోవడం మూలాన నా భయం పూర్తిగా పోయేది కాదు.దుప్పటి కప్పుకున్నా భయం తగ్గేదికాదు . నిద్రకి ముందు నాన్నగారి పక్కన అనేదేమీ ఉండేదికాదు. బోంతో చాపో అంతే...ఐతే నాకు కల్యావతారం కధ కలలోకి వచ్చేది. పెద్ద గుర్రం మీద కల్కి కత్తితో వీధుల వెంట తిరుగు తున్నట్టు ఉండేది.
[10/31, 12:16 AM] papai 2nd Number: పాపం అమ్మ, మద్రాసులో ఇండిపెండెన్సు నించీ, పాలకొల్లులో డిపెండెన్సుకి వచ్చేశారు!
[10/31, 12:27 AM] papai 2nd Number: నాన్నగారికి, అమ్మకీ  మద్రాసులో దర్జాగా ఉండడం అలవాటు - పొలాలకోసం వచ్చి చాలా పాటు పడిపోయారు
[10/31, 12:37 AM] papai 2nd Number: చిన్నతనంలో మనం జీవించే జీవితం పరీక్షలాగా, గొప్పవారి జీవితాలు పఠించదగ్గ పుస్తకాల్లాగా, పక్కవారి జీవితాలు సరదాగా చూసే ప్రయాణాల్లాగా కనబడతాయ్ - ఒక వయసు వచ్చాక, ఇదంతా అలుక్కుపోతుంది - ఏది పుస్తకంలోచి నేర్చుకోవాలో, ఎందుకు పరీక్ష రాయాలో తెలీదు, అయినా ముందుకు పోతూనే ఉంటాం.
[10/31, 1:05 AM] Maringanti Srilakshmi: చిన్న పాము : వర్షాకాలమొచ్చింది . పాక చోరువెంట నీళ్ళు కారడం కళ్ళార్పకుండా చూసే వాళ్ళము. పాలకొల్లొచేసరికి చిన్ని శిరీషుల పరిచయం గాఢమైంది. ఐతే తుని ప్రయాణము మద్రాస్ నుంచి లేక పాలకొల్లు వచ్చాకనో  గుర్తు లేదు. తునిలో తాత గారు చాలా నచ్చారు నాకు. అమ్మమ్మ చిన్ని నీ శిరీషునే చాలా గారం చేసేది. నన్ను  కొంచం పొగిడేది.  గోపాలం మామ  నాకు చాలా విషయాలు చెప్పాడు.కొన్ని నేర్పించాడు. అందులో ఒకటి గోచీ పెట్టుకోవడం. అమ్మమ్మ చీర ముక్కలు మాగోచీలకి ఉపయోగించేవి. తను అప్పుడే RSS శాఖ కి వళ్ళే వాడు . నేను కూడా పడే వాడిని. అమ్మ నన్ను ఒకంత కనిపెట్టేది. కానీ ఒకరోజు అమ్మా గదిలోంచి బయటకి రాలేదు. అమ్మమ్మ తాతగారు హడావిడి గా ఉన్నారు. దొడ్డం మామ నారాయణం మామ మమ్మల్ని కనిపెట్టారు. పెద్దత్త చాలా దయగా ఉండేది. తాయారు సీత   దొడ్డం మామ కూతుళ్లు. అమ్మమ్మ అస్తమాటు నాకు పెళ్ళి వరస కలిపేది సీతతో. అది కొంచం పెద్ద. అయినా ఫర్వాలేదని v laakolam చేసే వారు. నాకు చాలా సిగ్గుని పంచేది. అమ్మమ్మ చడ్డెన్నము దానికంచంలోడి నాకు మరి వడ్డించేది. నాకంచములోది తనకు .బావేగా ఫర్వాలేదని పిచ్చి మాట. అమ్మకి ఈ వ్యవహారం అస్సలు నచ్చేది కాదు. నారాయణం మామ సత్యానికి చదువు చెప్పేవాడు. ఏదో ఒక వంకన సత్యం పారిపోయేది. ఆరోజు పాప్లి పుట్టాడు. మేము అంటే నేను చిన్నీ అమ్మని ముట్టుకోకూడదు అని తెలుసుకున్నాము. అమ్మ మాకేసి చాలాఆధారంగా చూసి పాప్లీ  తమ్ముడిని పరిచయం చేసింది. అమ్మా అమ్మమ్మ తమ్ముడి స్నానం చేయించే విషయంలో కొంచం గట్టిగా మాట్లాడుకున్నారు. అయినా అమ్మకి ఎంతో అనుభవం కదా అమ్మ ఊరుకోవచ్చు కానీ కష్టపెట్టుకుంది .
అమ్మా సత్యం చిన్ని శిరీషు ఇంతమందీని తాతగారు అమ్మమ్మా ప్రేమగా భరించారు.
[10/31, 1:37 AM] Maringanti Srilakshmi: పాప్లి అని వాడికి నాన్న గారు ముద్దుపేరు తగిలించారు. Chwrwdu కళ్ళతో పుట్టాడు.వీడు పార్థ సారధి అని అమ్మ వాడికి పేరు పెట్టింది. ట్రిప్లికేన్ లో పార్థసారథి స్వామికి అమ్మ దండవెట్టుకుందిట ఆయనపేరు పెట్టుకుంటాననీ.
[10/31, 1:45 AM] Maringanti Srilakshmi: అమ్మకి పిన్నికి ఎక్కువ మాటలుండేవి కావు. ఆవిడకి సంతానం లేదు ఆవిడవ కన్న అమ్మ పెద్ద. బీరకాయపీచు వరసన ఆవిడకి అమ్మ కోడలి  వరస. అమ్మని  సీత అని.పిలిస్తే నచ్చేది కాదు .
[10/31, 1:50 AM] Maringanti Srilakshmi: అప్పుడే పాప్లీ పుట్టి సంవత్సరమయ్యింది . నాన్న గారు వాడి పుట్టిన రోజు చాలాగ్రాన్డ్ గాజరిపించారు. మైక్ వాదించాడు. పొద్దున్నే అందరికీ తలంట్లు కంట్లో పులుసు పడ్డా పడకపోయినా చింతపండు ఉప్పు  ఫలహారం. మీకు వాడు కృష్ణా ముకుందా మురారీ t పాటతో కచేరీ మొదలెట్టాడు.

 

H. Page 8


ఈరోజు ఉదయం పెద్దక్క కలలో కనిపించింది. చాలా తెజ్జోరూపంతో కొంచం అమ్మలా,కొంచం అమ్మమ్మ లాగా కనిపించింది. మాధవి ఆరోగ్యం బాగాలేదని దాని దగ్గరకొచ్చింది,ధైర్యం చెబుతూ వంట్లో బాగోపోతే చెప్పాలికదే ఆన్ అన్నట్లు గుర్తు.


వారవారానికి ఒక       బజారొచ్చేది. శనివారమనుకుంటా దానిపేరు సంత. కూరలు చింతపండు,పప్పు ఉప్పులు,బట్టలు,వేరేవీ,భయం కలిగించే మేకా తలకాయలు,అమ్మో చాలా హడావుడి. అప్పుడప్పుడు పాముల నాడించే  సాయబూ తాడుమీద నడిచే ఎరుకల అమ్మాయి కనిపించేవాళ్ళు.

అయ్యయ్యో,ఎన్ని చిక్కుల్లేదురైనాయాయో కదా, ఆహా విధీ ఎలా విడదీసిందో మనని,అనేక పర్యాయాలు. శరత్బాబు కథని మించిన మలుపులు,పథేర్ పాంచాలి చూపించిన దృశ్యాలు my goodness! .పెద్దక్క ఒక్కర్తి,వీరవాసరం వచ్చిందా,నాన్నగారిని, వీరవాసరం చూసిన గుర్తు లేదు.నువ్వు సారధి,నూజివీడు లో ఎలా ఉన్నారు. డబ్బు ఎలా సర్దుబాటయ్యింది,సారధి నువ్వు ఎలా వీరవాసరం ప్రయాణం చేశారు..గుర్తుకుక్తెచుకుని రాయ ప్రార్థన.

Mohan: వీరవాసరం అన్న ఊరిలో సారధి సత్యం కలసి వచ్చారా ఆ విషయం తెలుసుకుందాం .కొంచెం విచారించి I update you

Mohan: “పరివర్తిని సంసారే
మృతః కో వా న జాయతే ।
స జాతో యేన జాతేన
యాతి వంశః సమున్నతిమ్ ॥ 1.32 ॥

ఎవ్వరి ప్రయత్నము చేత వారి తలిదండ్రులు వంశము కీర్తించి ప పడతాయో వారే సరైన సంతానము.వారి జన్మ ధన్యము.
తండ్రిగారి స్మృతి దర్శనముగా నీరాజనరూపాన హృదయరంజకంగా
సాగిన ఈ గీతా యజ్ఞము
సత్యం తోడ పుట్టిన మాఅందరకూ భక్తిముక్తి రసాస్వాదనరూపమైన కవితా ఝరి ,
దివ్యకూడారై పాయసపు రీతి!

తిరుప్పావు చదువ కనులరమూతవడు వాడు బుడతడు, గీలించి పాలించు, కన్నడు కనుల కడ్డుపడువాడు, కమనీయరూపమున సర్వము తానైనవాడు, అక్షరమక్షరము క్షతమై నిక్షిప్త చిద్రమున స్పూరద్రూపమున గోచరించెడివాడు గొల్లపాపల యుల్లమున మురిపెమ్ములు జల్లువాడు, మరి మరి మాయ వాడు. నల్లనో తెల్లనో మరి మాయన మన్నును మిన్నును ఏకముజేసి, వెన్నెల కన్నుల యశోదను  శోధించిన వాడు. తిరుగలిగాటన తరునేల గుల్మ  క్షీరద నీరద బ్రహ్మాండముల నుండె దనని చెప్పించి తా కంబమున యొదిగి డింభక ప్రేరణమున విజృంభించి, దానవోద్రేకమునణ చినవాడు, వానిని తప్ప నితరము నెంచ నిచ్చగించదే మనసు. రంగని పేరెంచగ నాకన్నుల వీడగ యగపించు నేనేమి చేతు,  తిరు పావు నేర్వగలేను, విరహమునోర్వగలేను. మన్నింపుమే తల్లి నా చిట్టి గోదా

Mohan: This is original
This is total
Totally devotional 
Occasionally too emotional 
Yet it is beautiful 
Mostly transcendental

వాకిట వంటింట నడిమింట  ప్రాకుచు పసిడి నేలనలదుచు వూయలన, భజమ్ములపైన ఊరేగుచు సర్వశ్రేయములకు తానే నెలవగు  చిన్ని గోదకు శ్రీరామరక్ష  ఇంటికిల్లిపాదికి సీతమ్మ రక్ష . శ్రీరామునికి,సీతమ్మకు ఆంజనేయరక్ష.

Mohan: వాకిట 
వంటింట 
నడిమింట  
ప్రాకుచు పసిడి నేలనలదుచు 
వూయలన, భజమ్ములపైన 
ఊరేగుచు సర్వశ్రేయములకు 
తానే నెలవగు  
చిన్ని గోదకు 
శ్రీరామరక్ష  
ఇంటికిల్లిపాదికి 
సీతమ్మ రక్ష . శ్రీరామునికి,సీతమ్మకు ఆంజనేయరక్ష.



 

Raata palukula olikinta..chakkagaa amarinavi . Eepaata harini chitti koonaki.meeku matrame ..

Mohan: It is so blissful 
And full of blessings 
Essence of this 
Has universal appeal 
Worthy of dispersal 
Across friends 
foes and neutrals

H. Page 7

Mohan: చెప్పింది వింటాం

వింటూనే ఉంటూంటాం

నాడు మరిచాం
ఐకమత్యం గా ఉండడం

ఇప్పుడుగుర్తించాం
అమ్మ దిశానిర్దేశం


గందరగోళం పడ్డాం
గొడవలూపడ్డాం

కాలం తిరిగింది
రోగం కుదిరినట్టేఉంది

నేడు  కావలసింది 
మనం పట్టుకోవలసింది

ఉత్సాహం
పునశ్చరణం
ఔషధ సేవనం
ప్రశాంత జీవనం

 అదీ బదనిక. వదులైన బొందులేని లాగు. లాంగూల బంధిత        శంగోళము. మనసది కుదురెరుగని విపంచిక. దానిని గాటనుంచ చీకటి చెన్నుగాని ప్రియ చెలిమి చేత వలనౌను

 కృష్ణుడెలా వుంటాడు?

Mohan: కదా!

జరిగేది
జరిగినది

ఒకతీరైనది

జరగనున్నది
ఏతీరన్నది

ఎవ్వరెరుగనిది

కాలపుతీరది
నీకుతెలియనిదేమున్నది

మనచేతనేమున్నది
మనః చేతనా సరళి


ఏమాత్రము తెలియదది

సాక్షీబావన
స్ఫురించినమది
నిత్యానందఝరి

సరి సరి మరి
ఏ రీతి వికసించు నది?

కృష్ణుడేలాగుంటాడు.      ఇలాగున
  భుజమొక్కింత కించెజేసి  ... ..                 కుడి పిడికిలి మడచిదాని నొద్దికిన     చుబుకమునెత్తి   ఎడమచేతిని
ఘనమగు జఘనమున చేరిచి          సోగ కనులరమూచి  బుంగ బుగ్గల    నీలి జిలుగులు జాలువార  ఆనంద సముద్రమున చిరునగవుల          వెన్నెలొలికించు వన్నెకాడే వాడు నల్లనౌ గాక మెల్లనౌ గాక చల్లనివాడె జగతిన జేజలెల్లరకు ప్రీతిగూర్చేడి గీతకాడు

సత్యం చెప్పిన సూచనకి ఇచ్చిన విన్నపము


అలాగే , సత్యం
ఓ  చిన్న విషయం 
మనింట్లో అందరం
స్మృతుల నమాహారం
అక్షరబద్దం చేద్దాం,
ఇది ఒక మహా యజ్ఞం
మనం సాక్షీ భూతులం
మనందరం ప్రతి ఒక్కరం

యజ్ఞంయాజ్ఞికులం అనే భావన తో ఆరంభించాము కదా!


“అనుజులు బుత్విజులుగ,పని ఇటుసేయమను నీ వుపద్రష్టవుగా
విను ! అరి షడ్వర్గ  పశువిశ 
సనమున రణయాజ్ఞీ సత్యమ  సమ్మతి జేయున్



(తిక్కన సోమయాజి శ్రీమదాంధ్ర మహా భారతము vol -7 ఉద్యోగ పర్వము pp 528
-45 కొద్దిగా మార్చి సందర్భానికి అన్వయించి)

భావముః 
సత్యం !  విను.
తన తమ్ములు నలుగురు హోత ,ఉద్గాత,అధ్వర్యువు,బ్రహ్మ అను యజ్ఞంచేయుంచే యాజకులుకాగా ఈ పని ఇలాచేయండి. అని యజ్ఞకర్మలోని గుణదోషాలను కనిపెట్టి చెప్పే ఉపద్రష్టవునీవు కాగా అరిషడ్వర్గాలు అనబడే పశువులను విశసించి సంప్రీతితో చేసే కావ్య యజ్ఞము ఇదీ .

అని గుర్తించప్రార్దన!

Mohan: సత్యం జవాబు


జరిగిన విషయాలు గుర్తు వస్తే తల నొప్పి వస్తోందిరా మా నూ! ఏం తలుచుకోను. సుందరకాండ రాసుకుంటా! భాగవత కథలు టైపింగ్.. రామా! కృష్ణా! ఇంత ప్రసాదం వేడిగా పెడుతుంది. కంట్లో మందేస్తుంది! మనవరాళ్ళు కృతులు పాడతారు' వాళ్ళతో ఆట..పాట 'అంతే నిద్ర తన్నుకుని వచ్చేస్తుంది. రోజు పూర్తి

Mohan: బహుబాగుంది
అలాగేకానీ
మనకు ఏదిహితవో 
అదేహితవు
 సినీమా చూసే మనిషికి
ఆనందం కలగ వచ్చు 
ఉత్కంఠత కలగవచ్చు
ఉద్వేగమూతలుగ వచ్చు
ఐతే సినీమా చూసేది కేవలం వినోదార్థం 
కొన్నిసందర్భాలలో
విజ్ఞాన్ సముపార్జనార్దమూ
కావచ్చు
కానైతే చూసే ఓపిక ఆరోగ్యం
ఉండద్దూ 
రెండూ దూరమయ్యే భయం ఉంటే 
నచ్చిన చోట, నచ్చిన పని!
విశ్రాంతి  !!
కృష్ణారామా 
అయ్యోరామ! 
ఏదీ మనసుకు తీస్కోకు

: 1963....నూజివీడు నుంచి వీరవాసరం ప్రయాణానికి  బందరు బస్సెక్కించారో మేమే బస్సెక్కమో గుర్తు లేదు. గోనె సంచీలో వంట  పాత్రలు, బట్టల సంచీ ఒకటో రెండో మూటలు ఇవీ మోతకి, పట్టుకోవడానికి మోహన్ చిన్ని శిరీషు బట్టర్ బుద్ధిగా అమ్మ పక్కనే ఉండేవాడు. వీడి పేరు తలుచుకుంటే మనసు చల్లబడి కళ్ళు            చెమర్చుకుపోతాయి. ధీమతి తొందరగా రుణం తీరిపోయిన బంగారు తమ్ముడు. ఎంతటి గాయం, వాడి ప్రాణం కరిగిపోవడం.( పెద్దక్క చిన్న ప్రపంచంలో వాడికి పెద్ద ప్రేమ సింహాసన ముందేది. దొడ్డం మామ వాడికి అంతిమ సంస్కారం చెయ్యడము చెరగని విషాద కావ్యం).గుడివాడలో నర్సాపూర్ డీసెల్  కారు  ఎక్కాము.చిన్ని పెద్ద దిక్కే,మొహాన్ని పట్టుకుంది. అమ్మ చేతిలో చంటిది. దాని పేరు గురించి నాయనగారికి అమ్మకీ రాజీ కుదిరి మాధవీ అనే మాధవీ కుట్టి అని పిలుచుకునే వాళ్ళం

: సామానుతో రోడ్డు మీద బస్సు  దిగాము. స్టేషన్ దగ్గరో దూరమో తెలీలేదు.కానీ జాగ్రత్తగా అమ్మ వెంట దారి తీసాము.  గల రైల్వేస్టేషన్ చాలా పెద్దగా ఉంది. జంక్షన్ కదా. రైలు పట్టాలు దాటడం అవీ ఏమీలేదు .ఓవర్ బ్రిడ్జి ఎక్కిన గుర్తు లేదు.రైలెక్కడమూ,తలుపుకు  కొంచం దూరంగా కూచుని చీకట్లోకి చూస్తుండగానే  భీమవరమొచ్చేశాము. తెలిసిపోతోంది. వీరవాసరం అక్కడకి 7మైళ్ళు.అమ్మ వళ్ళో మాధవీ, ఆనుకొని మోహనూ,నిద్రలోనేవున్నారు. నేను అంతకృతము ఒంటరిగా ఒకసారి వీరవాసరం వెళ్ళి తాతారావు దగ్గరినుండి డబ్బులు తెచ్చాను. వీరవాసరం వచ్చేముందు ఊళ్ళు నాకు గుర్తే. భీమవరం చాలాసేపు ఆగింది. వీరవాసరం vachesariki తెలిసిపోయింది.రిక్షా కట్టించుకున్నామేమో,  తాతారావు ఇంటికైతే  వచ్చాము. తాతారావు నేనూ  కరణం ఆచంట సూర్యనారాయణ గారి ఇంటికొచ్చాము.అప్పటికి ఎండబాగా వచ్చింది. సూర్యనారాయణగారి ఇంటె దురుగుండా కొంచెం చోటు జారిన పెంకుటిల్లుంది. దానిని మనకడ్డెకిచారు.6 రూపాయల అద్దె. అమ్మ పిల్లలు తాతారావు కొడుకు సాయంతో సామాన్లు పెంకుటింట్లోకి వచ్చేశాయి. బియ్యము కూరలు కొన్ని తాతారావు పంపాడు. వాసానికి  చీర ఉయ్యాల వేసి మాధవిని పడుకో బెట్టింది అమ్మ. తాతారావు ఇంటిదగ్గర పెద్ద మంచినీళ్ళ చెరు ఉంది.నేనూ చిన్నీ రెండు బిందెలు తీసుకుని నీళ్ళు తెచ్చాము. ఆ ఇంటి వెనకాల చాలా పెద్ద పెరడు. పెరట్లో  పుల్లలు పోగుచేశాము. విస్తికాయల మొక్కలు, బొప్పాయి చెట్లు, ఒకటో రెండో కొబ్బరి చెట్లు దొడ్డంతా సవరించుకుని ఉన్నాయి. ఏమో వండిందమ్మ. స్నానాలు చేసాము. చెరువు నీళ్లే అన్నిటికీ వాడేవాళ్ళము. కరణం గారింటికి ఒక 100 గజాల దూరం చెరువు గట్టు. చిన్న సందు తిరిగితే  వచ్చేది .

H. Page 6


నా స్వగతం మళ్లీ గళ మెత్తుకుంటోంది. వినే     ఓపిక ఉందా?


Mohan: బ్రహ్మాండంగా ఉంది
దయ ఉంచి కొన సాగించగలవు

 ఎర్రటి ఎండలు మొదటి సారి నూజివీడు లో చూసాను. అది1959  ఏప్రిల్  మే నెల్లలనుకుంటా. జంగాల్ పేటలో కొంపలన్నీ తగలడిపోయాయి. ఆకాశాన్ని చుట్టేసిన పొగ మన పెరట్లో పడుతున్న తాటాకుల బూడిదా కళ్ళముందు కదలాడుతున్నాయి. నాన్నగారు హందాలోకి నీళ్ళు తోడి పెంకులపైన జల్లుతోంటే నేనూ చెంబుతో నీళ్ళు విసరడం  గుర్తుకొస్తోంది. సీతా ఫలాల కాలం నుంచి మామిడి పళ్ళ సీసాన్లోకొచ్చాము.ఉగాది పండగ తర్వాత ఎండల్లోవచ్చిన పండగ రామ నవమి.  పదిరోజుల ముందునుంచి బడిలో పిల్లలు కొంతమంది, అలగా పిల్లలు కొంత మంది కలసి ఒక దీపపు సెమ్మ పట్టుకు ఇంటింటికీ తిరిగి డబ్బులు పోగుచేసి రామనవమి పండగ చేసేవారు. నూజివీడులో మోహన్  కొత్తగా తమ్ముడయ్యాడు.వీడు పుట్టేదాకా తాతగారు మనిన్ట్లోనే ఉన్నారు.ఇత్తడి కప్పులున్న ఎత్తు  చిలకల మంచం, ముందు వసారలో ఉండేది. దాని క్రింద ఆయన కాకీ కాన్వాస్ షూస్ రెండు జతలుండేవి. కళ్ళజోడుని సులోచనాలనేవారు, దానికి దారముండేది. ప్రక్కన ఒద్దికగా పెట్టుకునేవారు.ఎంరాసేవారో, ఉత్తరాలు మరేదైనా నో తెలీదుకానీ busy gaa ఉండేవారు.

1960 నా చదువు.       భం. పు. రావు గారి దగ్గర into ఫస్ట్ ఫారం  కోచింగ్. 4 రోజులే. ఆరోజు, బండ వెధవా, అని తొడపాసం పెట్టారు. ఇంటికొచ్చాక పెద్దక్క చూసి ఇంట్లో తనే నేర్పించింది పరీక్ష పాస్ అయ్యాను. రంగన్న గూడెంలో  నాన్న గారి ఉద్యోగంతో నా హై స్కూల్ చదువు చెల్లిపోయింది.  పదినెల్ల తరువాత తిరిగి  నూజివీడు వచ్చేసాము. మళ్ళీ రోజులు తిరగడం బొజ్జల నిండడమూ కష్టమైపోయాయి. రాజ్యలక్ష్మీ ట్యుటోరియల్ మోనో స్టూడెంట్ డబుల్ నెంబర్ అటెండెన్స్ తో మిసరబుల్ ఫ్లాప్ అయ్యింది. జ్యోతిష్యపు అంకం మొదలయ్యింది. నోట్ మేకింగ్ ఒక ధ్యాస ఆశ . ఆరోజుల్లో డోలాస్ నగర్లో ఎవడో జ్యోతిష్కుడుండెవాడు. నాయనగారి ఇన్స్పిరేషన్. సరే నాయన గారు నేనూ గుంటూరు వెళ్ళాము. రంగయ్య బావ పరిచయమయ్యాడు. ఎంత వెతికమో  బావ ఇల్లు కనుక్కోడానికి. బావా నాన్నగారు o రెండ్రోజులు బయట తిరిగారు. ఏమైందో తెలీదు కానీ అక్కడ నుండి తిరిగిచేసాము. నాకు మొదటి సారి సైకిల్ పట్టుకోవడం , శంకర్ కేఫ్ దగ్గర ప్లై ఓవర్ మెట్లెక్కించడం తరువాత జిన్నా టవర్ దగ్గర గ్రౌండ్లో సైకిల్ నడిపించదముక్రంగయ బావ నేర్పాడు. బావ సీతక్క,పెద్ద సత్యాదేవి, చిన్న సత్యాదేవి  చాలా స్నేహితంగా ఉన్నారు. బావకి దొర టోపీ  ఉండేది. బావ ఇన్స్పెక్టర్ అందుకని దొర టోపీ వేసుకోవాలి అని నాకు అర్ధం అయ్యింది.

నూజివీడింట్లో పెద్ద దూలము కుడిపక్క గోడ పెద్దగా పెట్లిపోయింది. దూలం పడి పోతుందని చాలా భయపడ్డాము. కానీ ఖర్చు వ్యవ గారం కదా, ఐతే ఓ రోజు ఒక ఇన్స్యూర్డ్ కవర్ వచ్చింది. తాతగారు కొన్ని పెద్ద రూపాయలు, పంపారు. వీరవాసరం పొలాల గురించి అప్పుడు తెలిసింది. మనకి కూడా పొలాలు ఉన్నాయి. అక్కడికెళ్లి ఉండచు అనే సంగతి తాతగారు పార్టిషన్ చేయించిన తరువాత తెలిసింది. గోడకట్టడము నాన్నగారికి బాధకలిగించింది. తరువాత ఓరోజు  ఎలకలవాడి కొడుకు మేస్త్రీ నీ పిలిచి నాన్నగారు దూలం సపోర్ట్ గోడకి సిమెంట్ వేయించారు. ఒక పెద్ద సిమెంట్ మ్యాప్ గోదక లాగే ఉండిపోయింది.

ఆకలి తెలిసింది. నిద్ర తెలిసింది. కొత్త బంధువులు వారి ఉనికి తెలిసింది. చిన్నాన్న  పాలకొల్లు, అక్కడ  ఆటుపోటుల్లేని జీవితము ఉద్యోగం చేయడమూ లేకపోవడమూ తెలిసాయి.

సరిగ్గా గుర్తులేదు కానీ, రంగన్న గూడెం ఎపిసోడ్ తరువాత మనం వీరవాసరం వెళ్ళాము. అప్పటికి మాధవి పుట్టింది లేదో,,,సత్యాన్నడగాలి.

సత్యము జవాబు హాయిగా పిల్ల అల్లుడు.. మనవరాళ్ళతో సమయం సంతోషం గాగడుపు... అన్నీ తవ్వి తీసి మనసు.. ఆరోగ్యము పాడు చేసుకోకు.. లక్ష్మిని ప్రశాంతంగా ఉంచు.. ఎండవేళ వాకింగు చేసుకోండి ఇద్దరూ ఆరోగ్యం భద్రం, 1..శారీరికారోగ్యం
2. మానసిక ఆరోగ్యం
3. మందులు సమయానికి వేసుకో
4. ధ్యానం 1గం.. చెయ్యి
5. ప్రశాంతంగా కాలం గడుపు.

నా మనసు విప్పిన శృంఖల...బతుకు బండీ కాదు, చావు రేవూ కాదు నిజము నిప్పూ కాదు. చరిత చింతా కాదు నెమరు నొప్పి కాదు. నిద్ర దిగుడు మెట్ల వెంట వెనక్కి నడిపిస్తోంది .మెలకువ రేపటి ప్రయాణాన్ని గుర్తు చేస్తోంది. పోయినవాళ్ళు మరీ మరీ పలకరిస్తున్నారు. పెద్దక్క భట్టరు అమ్మా నాన్నగారు స్పర్శకి చేరువగా కళ్ళకెదురుగా ఇదే నిజమనిపించేట్లు రాత్రులు తెల్లారుతున్నాయి. పొగబండి , చీకట్లో ప్రయాణం . సామర్లకోటలో సామాన్ల దోపిడీ. మందులేసుకుంటే రాత్రులు పగలు గాను పగలు రాత్రిగానూ మారడంలేదు. తిరిగే కాలం ఆగి వెనక్కి తొంగిచూస్తోంది. పడక కుర్చీలో పండుకుని నాన్నగారు కానరావట్లే. హాయి ఎప్పుడూ పోయిందోయీ వెతుక్కో మళ్ళీ బాల్య మేమైనా తలుపు తడుతుందేమో చూడవోయంటోంది మనసు. సరే నువ్వు హాయిగా ఉండాలని సర్వేశ్వర ప్రార్థన చేస్తూ...

ఈ ప్రపంచంలోకి ఖాళీ సంచీ తో ప్రవేశించాము చాలా కలగలపు పోగు చేసుకున్నాము. వంటికంటుకున్నదీ మనసుకు ముసిరినదీ. ఉతికితే మిగిలున్నదీ  దండంతో దారి వదిలినదీ లెక్క చేస్తున్నా.. అంతే...

H. Page 5

 Mohan: ఒక్కడ బ్రాణు లందఱు నిజిత కర్మము లోలి ద్రిప్పగా……..

 Mohan: పైన శ్రీమన్మహాభాగవతాంతర్గత ప్రతిపాదన చూడు .నిజమనిపించదూ!

 భాగవత స్పృహ స్పర్శా స్మృతీ వూపిరియాటుపోటులన నిలువరించి, శారీరిక భ్రాంతిని మరీచికయేనని  గుర్తించిన తండ్రీ  నిన్ను పితృ దేవతలు దీవింతురుగాక!

 Mohan: Yesterday day a girl ,MBA graduate from Newyork ,basically citizen of Sweden met us
She is Telugu speaking only
We had a conversation 
Unplanned casual After review felt it was a bit strange 
Just look at that
[12/20, 12:04 PM] Mohan: Sir’’  , “are you 70 or 65 plus’’ ? 
What is your experience ? 
What is the reality of world”  ? 
‘Yes    am 67 , but never saw  world as it is  ! Don’t know a bit of it  “ !

“Sir just don’t goof!! Say  If dislike answer, thats ok”  !!

“No like or dislike ,that is what it is “ !

“What is it? “You are 67 “ ! 

“Yes ,Tried many books,heard many discourses,met few people” yet don’t know what it is !
‘How it is possible ,that too at 67 !.more over i was told you were a teacher” !
Is it what you taught” !? That’s why nation is going to dogs”! Sorry ,sorry for ….

‘’It’s ok ! my dear,still i maintain what i said’’!

‘’But how ..?

‘’ Was always masked by some thing or other and failed to see plainly around how it was ‘’

“Really !? What is that masked you? Then how could you survive as teacher’’?

‘’ Problem was with conflict ‘’

‘Conflict ! ‘’ with whom ? Why ? How always one can have it ! ?

 Look! As a child felt that ,elders had a lot of take away.
They ,i felt ,dominated with their advantage of age ! 
My eating ,playing,talking,walking  either disapproved or approved.
Spent all the  time then  for  their approval “

“O k “ ? 

But always  thought - thoughts that  i thought that they thought of disapproval.

“Come again “

“Simply there was conflict with elders and nature !”

“Ok then” ? 

 “At different stages  different issues ,hormones ,study demand,job hunt ,so called settlement,peer groups ,variety of temptations - boiled down to constancy of conflicts. “
“With whom” ?
“With  siblings,peer groups ,elders and  family members , with very nature! “

‘’ My God  ! then , “ ‘?

‘’As  conflict mask,colour  ,flavor  elevate,distort every scene and whole world  ,some how missed what really  was  world ’’ !

‘ oh ‘ ‘’That is true even for me’’ !!

‘’Then neither you nor i can perceive the world as it is’’!

‘’Then what to do’’?

‘’You think ‘’ !

‘’But what do you think’’ !

‘’Every one should think for one’s own sake’’

‘’But what do you think’’? 

‘’It is of no consequence to you’’!

‘’But out of just curiosity ,sir what do you think’’?


‘Just allow the drama to go on. Enjoy watching as you see ,be happy with your reality. 
Be happy with conflict,agony ,sorrow-care a hoot to absolute reality’

“ Conflict makes me unhappy” ?

“Don’t think it as conflict”

“But …

“Think that you are right and the other person or situation is wrong Curse it scold it have self pity and enjoy all the melodrama”

‘Can’t get you’

Then be happy bye !

Sir,…

Ok bye…let us not meet again with this agenda.

if you wish to take me other wise ,that’s ok .bye ‘’
 నిద్ర మళ్లీరాస్తా

 శబ్దము స్పర్శా రూపము,రసమూ(రుచి) గంధము చేరి ఐదు మాత్రలందురు.ప్రపంచ స్టూల రూపమున కివి  పంచ దారకములు. స్థూల మూలక్ములవి  మృత్తిక,జలము అగ్ని,వాయువు తేజస్సు కూడి  పటల ప్రపంచమైనది. ఒకపావ్రి నది, ఒకపరి నద నాగ శృతి. మనిషి శరీరమున్నూ రూప రస శబ్ద స్పర్శ ఆలోచనావలోచన క్రియలకనుకులమై

 తరువాత?

 ప్రపంచ రూపము అవిభాజ్య ఏకత,అన్వేక స్తితిస్తాపకత,బహు రూపక విస్తారత లతో ఒప్పే స్వీయ చలిత కాలకేసి. తిరిగి ,తిరిగి, ఒరిపిడికి మంద్రమూ, సాంద్రము, ఘనము,  ద్రవమూ, ధూమమూ అయి వెలుతురు వేడిమికి,చలి చీకటికీ అంటకాగి, వ్యోమగోళ శకల ఫాత విచ్చేదితా క్రమజనిత విద్యున్మూల ప్రాణాధారమై, ఆత్మ భవమైనది. ఇది బ్రహ్మ రహస్యము,పూర్వ రూప మిప్పటికి తెలువనేరనైనిది. "పర" మవగత మగుటకు మానవ జన్మ కొంచము వీలుగలిగినదైనది. ఆత్మానాత్మ విచార సాధనమున  మనో వికారములధిగమించి, పెంజీకటుల జీరి ముని తాపస యోగి గణములు జన్మ జన్మాంతర స్తితి గతులను, జన్మ సాఫల్యతా యోగమున వివిధ జీవ స్తాయీ క్రమమును, పాప, పుణ్య వివరమును,పునర్జన్మ రూపమును,జన్మాంతర జన్మ లాక్షణికతను, వ్యక్తిగత పాపపుణ్య క్రమమున వివరించిరి. సాధన నెరిగినది సత్యమో కాదో సాధకుని వరకు ప్రమాణము. కానీ పాప పుణ్యములు సకల జీవరాశులందు మానవునికి ప్రత్యేకమగుటంజేసి, మానవుడే ప్రేత్యక్ష సాక్షి యై యుండెనని మన విశ్వాసము. ఐదు ములకముల మూడు గుణముల నిలచి,       మానవుని యునికి నూరేండ్ల పరివృత్త బంధితము. విత్తునకు విస్పోటక సత్తు ననుసరించి ఆత్మ పదార్థము అల్పమో ఘనము సామాన్యమే అసామాన్యమో యగును.తేజోలోపమున చీకటి చేరువన ఉత్పుల్లతా సమయ స్పోటకమున జీవోద్భవము అల్పాతి యల్ప ధాతు ఆత్మైక్యతల నమర్చును. తొందరనొ అకాల పరిణితినో ముక్కోటి విధములగు ధాతు సంకలితా సంభావికత ధూమదృమ ఖేదక్లేద మోద మాదకతాద్వందయైన తరి బ్రహ్మ పిపీలిక పర్యంత ప్రచలిత ఆత్మ చొరబడి, చొరబడక జీవులఘనులై ఘనులై మనుట జరుగును. నేడు పుట్టి నేడే గిట్టు జీవులనుండి కాలాతీత జీవజములవరకు ఆత్మ విధృతిని కాంచగలము. ప్రపంచమున  నాభి క్రిమి న్యాయమున బట్టు క్రిమి మొదలు బృహద్రూప వృక్ష వివిధత వరకు, పరిమళ సుమ కుసుమముల మొదలు భీషణ విష భూయిష్ట కాటక వృక్ష జాతులవరకు ప్రాణ ప్రయాణమును కనుగొందుము. ఆత్మావేశితములై యవియెల్ల కాల చోదిత జీవన సాఫల్యతన వశించి నశించును. అట్లే క్రిమి మానవ సమూహములు సైతము పుట్టి గిట్టును. కానీ మానవునకు సంచిత పాప పుణ్యములు నీడా నిజములై  కడతేర్చును. మనకవల కైవల్యొమో కాటకమో నెరుగుటకై తొల్లిటీ మానవుని నుండి నేటి వేదాంత వేత్తలవరకు లక్ష్య సాధకత పరమార్థమైయున్నది.

 Yes Babuji
Tried to understand your   
way of looking at it.
Difficult to comprehend in total,but could appreciate the spirit .
The diction came in the way inspite  of sincere attempts to read re read and relate the entire content verbatim!
So the total reflection is indicating indispensability of time and  object of human struggle  in his limited life span to visualise ultimate truth!

అమ్మ కనిపించింది. చీకటిన విచ్చిన కలను చెప్పింది. నిజము నీడన ఉన్నదనీ, నీడ చాటుకు ఉందనీ, కూలినగోడల మాటున, దేముడొచ్చి పోయే శంభుని గుడి కలదనీ, దాపుకెళ్లి దండంపెట్టేలోపే తొమ్మిదిమంది ఆకలి యాకలిని  అల్లర్చుకుంటూ విరిగిన పానవట్టం చుట్టూ గిరగిర తిరుగుతున్నారనీ  చెప్పింది. మనవూరి శివాలయం పక్క రాత్రి తెరిచే చిన్న లైబ్రరీ ఉండేది. పాత చందమాలక్కడ దొరికేవి.  చిన్నవెంకటాద్రి భార్య  తలుపులు తెరిచేది. అక్కడ  ఇరవై ఏళ్ళ కుర్ర గుంపు రోజూ వచ్చేది,రావి చెట్టు తూము మీద కూచుని  సోడాలమ్మే వాడు, ఎర్ర కళ్ళ కాపుల కుర్రాడు  దెయ్యాల కబుర్లాడుకునే వాళ్ళు. ఎర్రకల్ల కుర్రాడు కళ్ళార్పకుండా ఎంతసేపైనా ఉండేవాడు. మనింటికి తూము పక్కన వున్న నాకు చీకటిలో ఇంటికెళ్ళేప్పుడు భయమేసేది

 Mohan: ఇది ఇలాగా కొన సాగితే చదివే వారికి సూపర్గా ఉంటుంది.వీలైతే ఈ విధంగా కొనసాగిస్తే బాగుంటుంది

 దెయ్యాల  గురించి అర్ధణా సోదాబండబ్బాయి తన అనుభవం చెబుతుంటే ఎర్ర కల్లబ్బాయి, పెద్ద వెంకటాద్రి కొడుకూ, నేనూ చాలా నిశ్శబ్దంగా విన్నాము.  లైబ్రరీ కట్టేసేదాకా చందమామలో విక్రమార్కుడి కధల్లో చెట్టుమీది భేతాళుడు భయపెట్టేవాడు.వాడి తర్వాత ఈ సోడా బండబ్బాయి. ఇంటికి చీకట్లో చాలా భయం భయంగా చేరే వాడిని.

 సోదాబండబ్బాయి శ్రోతలనీ  దారిలో కనబడినా తల తాటించి అప్యాయంగా  పలకరించేవాడు. ఈ ముచ్చట కొన్నాళ్ళే . తరువాత ఫస్ట్ ఫారం డిస్కాంటిన్యూ చేసి రంగాన్నగూడె మెళ్లి పోయాను .వంటరిగా నూజివీడింట్లో పడుకున్నప్పుడు  లైబ్రరీ నుండి ఇంటికొచెప్పుడు వినబడే కీచు రాళ్ళ శబ్దాలు, అమ్మ చెప్పే పెద్దపక్షి మూలుగు  గుర్తుకొచ్చి వాళ్ళు జలదరించేది. ఇంతటి భీతి గొలిపే సందర్భాలు మళ్లీ  రాజుపేటలో ఉన్నప్పుడు రాత్రి గవరయ్య కోనేటి నుంచి ఇంటికెళ్ళేప్పుడు ఉండేవి. ఒక్కొక్కరోజు కూడా ఎవరూ లేని వంటరి నడక ఉండేది. అరుదే అయినా అప్పుడప్పుడు  తటస్థపడేది.

H. Page 4

జీవనచిత్రాలు

నాటి విచిత్రాలు 
నీటిలో చేప పిల్లలు
మా కళ్ళకు ఆ స్మృతులు
రస స్ఫోరకాలు

అరెరే నీకధ ఇప్పటిదాకా చూడనే లేదు. Bale ఉంది గదూ. నేను ఈకథ చదుతూ ఇది సోవియట్ భూమిలో కథ అనుకున్నా. అచ్చంగా టాన్య కథ నో హతింతా య్ కదో  అనుకున్నా. కీప్ the stories go  నాన్నగారు  పాపాయి కి ఈగ కవిత నేర్పించే వారు.ఇదిగో ఇలాంటి చిట్టి చిట్టి కథా కవనమే అది. Go my brother ow original  and beautiful spree of dialogues.

నాన్నగారు చాలా ఫెయిర్ కాంప్లెక్షన్. పొడుగని తెలుస్తూనే ఉండేది. పంచె కట్టు. మద్రాసులో హిందీప్రచార్ సభ ఉద్యోగం చేసే అప్పటినుంచీ ఆయన వేషమదే. హిందీ ప్రావీణ్యత సంగతి కోనేరు పేట ఆయనకి ట్యూషన్ చెప్పేటప్పుడు తెలిసింది.  నూజివీడు రైల్వే స్టేషన్లో ఒక సాయబు గుర్రం బండి వాడుండేవాడు. ప్రయాణీకులు బాగా తక్కువ. ఫ్రీక్వెంట్ ప్యాసింజర్స్ పైగా సెకండ్ క్లాస్ ట్రావెలర్స్ గుర్తుండేవారేమో, తాతగారు ఫ్రీక్వెంట్ ట్రావెలర్. నాన్నగారు ఈ సాయబుతో తురకం  మాట్లాడేవారు. స్టేషన్లో ఆరవ అతని క్యాంటీన్ స్టాల్ ఉండేది. అతనితో తమిళం అనర్గళంగా రైలోచేదాకా మాట్లాడుతూనే ఉండేవారు. అమ్మ  మొహను భట్టరు  అనపర్తి వెళ్లిన  రెండు మూడురోజులకు పెద్దక్కా, సత్యం చిన్నీ శిరీషు పాప్లీ  నేను నాన్నగారితో తుని వెళ్ళాము.రైలు రద్దీగానే ఉంది.  చాలాసేపటి సాయంత్రమవుతోందనుకుంటా , అనపర్తి చేరుకున్నాము.  రంగడు మామ ఇంటికెళ్ళము. చాలా కోలాహలం గా ఉంది. అమ్మకి పిల్లా మేకా తో అల్లా రావడము నచ్చలేదు. బహుశా వద్దని ముందు చెప్పిందేమో! నాకు రాత్రి కొంచం తేడా హడావుడి కి మెలకువ వచ్చింది తెల్లారిపోతొందప్పటికీ. కుర్చీలో ఒక యువకుడు కళ్ళజోడుతో కనిపించాడు. మర్యాద అంటేనే అలాంటిది చేస్తున్నారు. నిశ్శబ్దంగా ఆడవాళ్ళు చిరునవ్వుతోటి, పిల్లలు నోరుమూసుకుని ఆయన కేసి కళ్ళప్పగించి చూస్తున్నారు. చాలా అందగాడే. మద్రాసులో నేను  N T రామారావు, జెమినీ గణేషన్ సావిత్రిల పోస్టర్లు చూసి వాళ్ళందరూ దేవతలనుకొనేవాడిని. ఇతగాడు  అలానే కనిపించాడు. పైగా అందరి మర్యాద ఆదరణ . ఇతను మంగట్ట గారి కొడుకు కిష్టి అని తెలిసింది. ఇతనప్పటికే MBBS పాసై కాకినాడలో ట్రైనింగ్ అవుతున్నాడట.  రంగడు మామ I L T D కంపెనీ లో పనిచేసేవాడు.

కిష్టి చూడడానికి స్ఫురద్రూపి పైగా డాక్టరీ 
ఈ వాళకూడా డాక్టరీ చెయ్యడం కష్టసాధ్యమేకదా.పైగా మన శ్రీవైష్ణవ కుటుంబాల్లో మెదటి వైద్యుడేమో and then most eligible bachelor గాబోలు.
ఎవరి ఆలోచనలువారివి కనుక మర్యాదగా మన్ననలకు ఏ మాత్రం లోటు ఉండే అవకాశం లేదు!

అతిశయమున్న చదువరైన చురుకు కుర్రాడప్పుడు. మంగత్త గారి సంతానము ద్విదళ రూప కళ గా విభక్త మయినది. తెల్లని ఆర్య దీప్తి గలవారు నల్లని కృష్ణ  ఛాయా ప్రదీప్రి గల వారూనూ. మనింటి అంటే maringanti సంతులోనూ అలాగే కానీ చామన ఛాయ పోట మరింపెక్కువ. తెలివీ వైదుష్యమూ కూడా విచిత్రం గా ప్రాలిఫరేట్ అయ్యాయి. అత్యంత ప్రతిభావంతులు కొద్ది మంది మాత్రమే వుంటారు. పరిస్తు తులని చేధించుకు పరిమళించిన ప్రసన్న కలితార్థత బహు కొద్దిమందికి మాత్రమే కలుగుతుంది. మన బట్టర్ అలాంటి వాడు. పెద్దక్క,  భట్టరు విధి కూడిరాని భావ విపంచికలు. కడగొట్టు పాపాయిని మనం విధి వంచితుడనీ లేదా తెలివైన వాడనీ ఎంచలేము. సహజ బుద్భుదిత వికాసమున్నప్పటికీ నాలా ఆది భౌతికత హెచ్చు .తొణికిసలాడిన నీ జ్నాన మంజూషతృప్తమై వాడి మేధస్సు  పరిమళించింది.  మంగత్త గారి భర్త r రాఘవా చార్యులు మామ గారు , పెద నాయన గారు, తేలికిచర్ల గోపాలాచార్య స్వామి తుని నారాయణాచార్యులుగారు,,నాకు విద్య బిక్ష పెట్టినవారు, మనకెరికైన సంపత్కోవిదులు .

అరుదైన అందం 
అరుదైన అధికారం
అరుదైన సౌభాగ్యం
అరుదైన విజ్ఞానం

ఏదైనా  సరే  పలువురికీ 
ఆశ్చర్యకరం
అభినందనీయం

అలాటిది
ఎవరికైనా 
ఏదైనా
ఉండ భయం

అదెలాగోఓలా మనపరం
ఐపోడమే పరమానందం

 మాకు లేదేం ఖర్మం ?
అన్న అనుమానం

కొండకొచో అసహనం
ఈర్ష్యా అసూయలవేగడం

ఫలితంగా గొడవ పడడం
జీవనయానం లో అనవరతం
ప్రతిక్షణం చర్వితచర్వణం
 సమస్త జీవుల జీవన పర్యంతం
బహుశః ఇది సర్వసామాన్యం

ఈ విషవలయం నుంచీ బయట పడి

అహంకారం
మమకారం
రాగం ద్వేషం
పూర్తిగా వదలిన వారికి
తాను కేవలం సాక్షీభూతం
అన్న సత్యం దృగ్గోచరం
ఐపోయిన నీ వంటి వారికి 
గతం తాలూకు కధనం
భవ బంధ
విమోచనకారణం
జీవన గమనాన్ని
సాక్షీభావంతో 
పునఃశ్చరణచేయగలడం
కర్మలేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం!!

ఇవేమొ నాకు పూర్తిగా తెలీవు కానీ నిక్కచ్చి గా గతం తలచుకోవడం మూలంగా ఒనగూడేదేమి వుంటుంది. బంకించంద్ర చట్టోపాధ్యయుడానాడు నిర్మల  పాత్ర ద్వారా సాంఘిక వ్యవస్థ లోని విదారక దృశ్యాన్నవిష్కరించడం వల్ల ఏమి ఒరిగింది. తనని తాను ఆ పాత్రలో ప్రతిఫలింపజేసుకు అమ్మ  తన వాస్తవికతా దృష్టిని హ్రస్వ  పరుచుకుంది. మదరాసులో మన నివాసం స్వప్నం లాంటి నిజం. అది కరిగిపోయింది.  బ్లూ అని పిలువ బడిన అందమైన పెద్దక్క భవితవ్యం బ్లాక్ గా బ్లీక్ గా మారిపోవడానికి అంకుశమూ, నిరంకుశమూ కారణాలు. అవి ఘటక ఘటిత పీడలైనాయి మనకి. మనమంటే అప్పటికి సగం పైగా సంసార జీమోతాన్నమ్మ అల్లుకోలా, వూలు స్వెట్టర్లల్లుకునే కళా, హిందీ టైప్ రైటింగ్ నేర్పు ప్రయత్నాల్లో పిల్లల. ఆలనా పాలనాలో పెద్దల సేవా ప్రస్థానంలో తలములకలుగా ఉండేది. మా అమ్మ మంచిదే కానీ విపరీత విధి ఎదురీతకి గురి చేసింది. నాయనగారు సైతం ప్రచార సభాపర్వం, ఆదిపర్వం, సంజీవరెడ్డి గారి ఇంట్లో చూపు లేని వారి పాపకి చదువు చెప్పడం, అప్పుడప్పుడు పట్టమ్మాల్  గారి కచేరీలు ఆనక పార్థసారథి స్వామి గుడి ప్రదక్షిణాలు బిజీగా ఉండేవారు...

H. Page 3

కొన్నాళ్ల తరువాత తెలిసింది జమీందారి భార్య సెకండ్ క్లాసులోనూ కూతురు థర్డ్ క్లాసులోనూ ఆంధ్ర మెట్రిక్యులేషన్ పాలయ్యారని.
 మళ్ళీ ఒకరోజు నేను నాన్నగారితో దొడ్డిపట్ల వెళ్ళాను. జమీందారు గారి కూతురు పెళ్ళి. ఎన్నెన్నో గ్యాస్ లైట్స్. బాజాలు.టపాకాయలు తారాజువ్వలు బాంబులు చెప్పలేనంత హడావుడి., నా బుర్ర బద్దలైనట్లని పిన్చింది.గట్టిగా చెవులూసుకుని నాన్న గారి పక్కన నిద్రపోయాను.  ఆనక ఇంటికొచ్చాము
 తాతగారిని మమ్మల్నీ చూడడానికి చిన్న బావ వొచ్చాడు. ఆయన చాలా పొడుగు.ca

 ఆయన హైదరాబాద్ ఆండాళ్ అత్తగారి పెద్ద కొడుకు. ఈయన చెల్లెలు పిల్లమ్మ  మదరాసులో మన ఇంట్లో కొన్నాళ్ళు వుందట. నాకు గుర్తు లేదు. అమ్మకి చాలా సాయం చేసేదట.  చిన్న బావ పాప చెల్లెమ్మ లకు బాగా తెలుసు. బావ గారూ చిల్లు చెంబులో నీళ్ళున్నాయి కాళ్ళు కడుక్కొండని వేళాకోళం పాట పాడేవారు. ఆయన  చిరు నవ్వు మొహం  మళ్ళీ దాదాపు 20 ఏళ్ల తరువాత హైదరాబాదులో చూసాను.


అమలాపురం నుంచి   సుభద్రత్త గారి  కొడుకులు అంటే  పెద్ద అయ్యగారు బావో లేక రామంజమో ఒకసారి వచ్చినట్లు గుర్తు. ఈలోగా వాన కాలమొచ్చింది. ఆ ముసురుగా ఉంది. నాన్నగారు చిన్నాన్న గారు హడావుడిగా మా బడి వైపు వెళ్ళారు. నేను వాళ్ళకి తెలీకుండా కూడా బడ్డాను.   మాబడిపక్క మనవాళ్ళే వైష్ణవులు , పెద్ద రోడ్డు  వైపునున్న  ఇంట్లో ఉండే వారు. వాళ్ళింట్లో ఎవరో పరమ పదించారు.  ఆరోజు వాళ్ళని ముట్టుకోకూడదట. అంటే మది లాగే. అమ్మమ్మ తునిలో వంటచేసే డప్పుడు, పూజ చేసుకునే దప్పుడూ మడిగట్టుకునేది. ముట్టుకుంటే  మళ్ళీ స్నానం చేసి  ఆవిడ ఉంగరాల  చిత్ర  జుట్టంట నీళ్ళు కారుకుంటూ . వంటిలో కొచ్చేది. ముట్టుకోద్ద అప్పచ్చు లిస్తానని బతిమిలాడేది. సరే అని నెమల్లారి చేసే వాడిని కాదు.

మరిఆరోజు నాన్నగారు మైల అన్న మాట. చావు విషయమై పాపాయి నేను మాట్లాడుకున్నాము. అదే మొదటి సారి వినడము.ఇంట్లో అపశబ్ధాలెవ్వరినీ మాట్లాడ నిచ్చేవారు కాదు తాతగారు. ఆఖరికి పెద్దక్క కథ చెప్పేటప్పుడు కూడా. అన్నట్లు పెద్దక్క చాలా సినిమాలు చూసేది. మాకు కళ్లక్కట్టినట్టు సినిమా కథ చెప్పేది. ఇతర కథలు కూడా. నేను పెద్దయినట్లు నాకు బాగా తెలిసిన సంఘటన. పక్కతదపడం మానేశాను అమ్మకి సాయం సత్యం తో పాటు అక్కతో బాటు చేసేవాడిని. ఒక్కొక్కసారి నా అంతట నేనే. C

పాలకొల్లుపిన్ని పాప చెల్లెమ్మలు అప్పుడప్పుడు పక్కలు తడిపినప్పుడు అమ్మతో చెప్పి చీకాకు పడేది. వాళ్ళు తెల్లారే లేచి వాళ్ళ బొంత వాళ్ళే ఊరుక్క ఆరేసుకునే వారు. అయినా పిన్ని ,అయ్, అనేది.

పిన్నికి నరసాపురంలో మంగమ్మ గారనే అక్క,ఉండేది రామానుజం శ్రీనివాసు ఇద్దరు కొడుకులు. వాళ్ళు చెల్లెమ్మ వాల తో బాటు నన్ను బాబు బర్రూ అని వెక్కిరించేవారు. వాళ్ళ  నాన్న  కందాళ వాసుదేవాచార్లు గారు. ఆయన ప్లీడరు. కోనేరు ముందు ఇల్లు. వాళ్ళింటికి ఒకసారి నన్ను సింహాద్రి బావా వాళ్ళ అమ్మగారు అంగల్లు గారు , చంకనే సు కుని తీసుకెళ్లారు

 అక్క10 వ తరగతి పరీక్ష పాసవలేదనుకుంటా. తరువాత 2nd లిస్టులో neeperudanna ఆవిడ దుఃఖము తీరలేదు. తాతగారో  నాన్నగారో గుర్తు లేదు కానీ నన్ను అక్కని నూజివీడు తీసుకు వచ్చారు. నూజివీడులో మన ఇల్లు చాలా పెద్దది. ముందొక ఇల్లు వెనకొక ఇల్లు. ముందు ఇల్లు వేంకటేశ్వర స్వామి కోవెల కి పాటుగా ఉండేది. వెనక ఇల్లు సిబ్బందీల ఇళ్ల వీధిలో ఉండేది. సాయబుల రావి చెట్టు  మన ఇంటి వీధి వైపు కిటికీ లోంచి చూస్తే కనిపించేది.. మన ఇంటిలో నా ఎత్తు గడ్డి. మేమొచ్చామని తాతగారు తిరుపతి( ఎరుకల వాడు) పిలిచి  గడ్డికోయించారు.  నాన్నగారు కనీ పించలేదు అంటే తాతగారే మమ్మల్ని నూజివీడు తీసుకొచ్చారన్నమాట. అక్క కుంపటివెలిగించి అన్నానికి ఎసరు పెట్టడానికి నీళ్ళు గిన్నెలోకి వంచింది. ఆ నీళ్ళు ఎర్రగా ఉన్నాయి అంతేకాదు , నీళ్ళల్లోంచి రెండో మూడో చేపలొచ్చాయి గిన్నెలోకి. అక్క నేనూ ఆశ్చర్యపడి తాతగారికి చెబితే ఆయన కాషాయపు ఖండువా తో నీళ్ళని వడ గట్టి ,నీళ్ళల్లో ఇందుప గింజరగదీసి వేశారు. తర్వాత అన్నం వండిందక్క. 

H. Page 2

  కానీ నిన్నమొన్నటి కలలో అమ్మ నాయనగారిని సంపాదన విషయంలో కించ చేసి మాట్లాడడం నిద్రకాదునిజమని అనుకొని చొక్కతో కళ్ళు తుడుచుకున్నాను. మెలకువ నిద్ర స్పృహ  నిస్పృహ అన్నట్లున్నది .

 దీప కన్నడి చెల్లి ...   అన్న కి వెలుగు వెన్నెల  తనువెల్ల వెలుగైన 'తను పున్నేముల ప్రోవు..పాప  కలి కల్మషముల బాపు తీవ, జగతి  పాపగతిన కృంగిన తరి వెన్నుడవత రించెనట. నరకాసుర, కంస హింసన కారు చీకటుల చీల్చిన తరి గొల్ల పాపలల్లిరట దీప తోరణములు .. అలకలల్లాడగ వేడుకన వెన్నుడు పిల్లన గ్రొవునూదగ పల్లవించెనట పండగై దీపవల్లికలై., పల్లె పల్లెన గిరిరాజతనయ పార్వతి దీవించినట ' పండుగ జేరు గాక  నేటి రాతిరి చీకటుల చెదరగ'. .. ఓ తెలుగుల వెలుగులార వేగము వ్రేల్చరె బాణ సంచయముల వేవేల వెలుగులు విర జిమ్మగ క్రాంతిదొలగి శాంతి విలసిల్లంగ ప్రతి వాడల వూరుల పూల పేరుల అమ్మ జగతిని పూజింపరే.. కళ్ళ కాటుకల మాటు వెలుగు జిజ్ఞాసల వెలిగింపరె పిల్లపాపలకు...
ఉయ్యాలంటే అమ్మ చీరతో వంటికి హత్తుకునే వెచ్చనిమడతల పడక.అది ఊగుతుంది. జోలపాట ఉంటే సరి అది నిద్రకి కొసరు. ఎన్నాళ్లు నిద్రపోయానో.తడుపుకున్నప్పుడూ వెచ్చగానెఉండేది.కానీ అమ్మ తుడిచి పక్కమార్చేది. నాకు తెలుస్తూనే ఉండేది. వెలుగు. చీకటి నిద్రా మెలకువ. ఏడ్పు ఆకలి తెలీదు అమ్మకి నా ధ్యాసే గదా. నానడక గుర్తు లేదు.బహుశా రాత్రనుకుంటా, వంటిల్లు తడి చారికలతో మెరుస్తూ ఉండేది. గడపవతల కూచుని తడి గచ్చు  మీద దీపపు ప్రతి బింబాన్ని చూడడం గుర్తు. గదిలో మంచం పైన నాయనగారు. పెద్ద అరచేతులతో ఆయన స్పర్శ బహుశా అందరూ పంచుకునే ఉంటారు.పెద్దక్క చాలా పెద్దది. ఇంకో అక్క తెల్లగా ఉండేది. ఆవిడ స్నేహితులూ పెద్దవాళ్లే.నాకు జుట్టు పెద్దది ఉండేది. అక్కడికి అమ్మ జదలేసేది. నాకు తాత గారు వూలో పురికొసో జుట్టుకి ముడిసేవారు.హైమావతి తెలుసు.కొంచం పెద్దవాళ్ళ భాషలో ముద్దు చేసేది.   వాళ్ళందరివల్లా  పలుకూ ఉలుకూ 
నేర్చుకున్నాను 
.వినడం చూడడమూ నక్షత్ర దర్శనము  నాయనగారి కదా ప్రవచన పుణ్యమే. 
 అది తాటాకుల పాక ఇల్లు. అప్పుడు నాకు మూడేళ్లుంటాయేమో. సత్యాన్నదగాలి. ఇంటి వెలుపల ఒక నుయ్యి ఉండేది వరల నుయ్యే . చప్టా ఉండేదికాదు. ఇంటి మధ్యలో మట్టిగోడ పార్టిషన్. కుడి ఎడమలుగా తలుపుల్లేని గుమ్మాలు. అవతల వంటిల్లు. ఇవతల పెద్ద గది .గచ్చు కాదు. అయినట్లో ఎక్కువరోజుల్లేమనుంటా. ఎక్కడా ఉయ్యాల వేసినట్టు. చిన్ని గురించేమో. అంత చిన్నప్పుడు చిన్ని ఎలా ఉండేదో తెలీదు.అక్కడ చిమ్నీ దీపాలు రాత్రయితే  బెక బెక చప్పుళ్ళు, కీచు రాళ్ళ రొద . నాకు భయమప్పటికే తెలుసు.అయినా అమ్మ దగ్గరే ఉండేవాడిని. అక్క సత్యం అప్పటికే బడికెళ్ళేవారేమో, తెలీదు. కానీ అమ్మ నోటీదగ్గర బట్టలుతికేదప్పుడు, అంట్లు తోమేటప్పుడు అక్కా సత్యాలు దగ్గరున్నగుర్తు లేదు.  అంతమందిని నేలమీద ఎలా నిద్రించామో ఏమో!ఆశ్చర్యమే . అమ్మ ఒరిజినల్గా చాలా రెస్సిలెంట్ అనుకుంటా. తరువాత ఒక డాబా లాంటి ఇల్లు. పెద్ద గది అందులో పెద్ద మంచం అటక. దానికెదురుగా వరండా దాటుకు ముందుకెళితే వంటిల్లు. ఇక్కడకొచ్పటికీ నేను పెద్దయ్యను. మంచం ఎక్కడం అటకండుకోవడమూ నేర్చాను. కొంచెం పేచీలు పెట్టేవాడిని. కోపం చూపించడం స్పృహలోకొచింది.ఇక్కడ కొత్తవాళ్ళు తెలిసారు తాతగారి పరిచయం.కుంజమ్మ గారి  కొడుకులేనేమో  హరి, శంకర్ . వాళ్ళు చెడ్డ అబ్బాయిలు అని కూడా తెలిసింది. ఈ ఇంటి ఎదురుగా ఒక మెడ మెట్లున్నది ఉండేది. ఇంటి ముందు చెప్తా ఉన్న నుయ్యి . అక్కడ అమ్మ గిన్నెలు తోముకునేది. నేను అమ్మకి సాయం చేసే వాడిని. ఎందుకంటే అక్క సత్యం స్కూళ్ళు వెళ్ళి పోయేవారు. అమ్మ అభిమానం సంపాదించుకునే మంచి అవకాశము . ఆవిడ కడగంటి చూపుకి ఆశ పడే వాడిని. అయితే ఇ క్కడ నుండే  బయటి  ప్రపంచం గ్రాహ్యత మొదలయ్యింది.ఇళ్ల సముదాయం చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. గేటవతల రోడ్డు గంటలు వాయించుకుంటూ ఐస్ ప్రూట్ బండి వాడు పోతూ వుండేవాడు. అప్పుడప్పుడు కొనే వారేమో. వాడిని నాన్నగారు టంగ్ టంగ్ అని సంబోధించేవారు. నేనూ వారిని వో టంగ్ టంగ్ ఆన్ పిలిచే వాడిని . వాడిచేవాడు కాదు. ఐస్ప్రూట్ మిస్ అయిపోయే వాడిని. ఈమోసం చాలా పెద్దైంతర్వాత తెలిసింది. అక్క వాళ్ళ ఫ్రెండ్ హైమావతి అంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు మెళ్ళో గొలుసేసుకోచింది. అప్పుడు నేను వాళ్ళే ముచ్చట్లమధ్యన గొలుసేన్ని వూపాయలని అడిగానని నన్ను ఆటపట్టించారు. అక్క చాలా కంట్రోల్ చేసేది. నాకు బయటకు షికా రెళ్ళడము  అప్పుడే తెలిసింది. తాతగారి కూడా బడటంతో వీధి వివరాలు తెలిసాయి.  తాతగారి వెనకబడి ఒకసారి దారి తప్పిపోయాను. కాసేపటికి ఒక పోలీసు వాడు ఎత్తైన బల్ల మీద కూచోబెట్టి బఠాణీలు పెట్టాడు. తాతగారు ఎవరెవరో వచ్చారు. అమాంతం ఎత్తుకు ఇంటికి తీసుకెళ్లారు. తరువాత నాకు సినిమా బొమ్మలు చాలా కుతూహలం కలిగించేవి. నిజంగా ఆ బొమ్మలు జేజలనుకునే వాడిని. లేడీస్ అయితే దేవతలుఅనే చాలా కాలం, అంటే నూజివీడు వచ్చేదాకా, నమ్మకం. అన్నట్లు ఈ ఇల్లు  మాం బళమ మనుకుంటాను.గుర్తు లేదు. నాకు నాన్న గారు క్షవరం చేయించేవారు. ఆడారిలో ఒక కాలవొచ్చేది. వంతెన దాటి కొంచం దూరం తడవాలి. కానీ నేను నానన్నగారి భుజాలమీదుండేవాడీని. అదొక సవారి. అయితే అమ్మ నాన్నగార్లతో అప్పుడప్పుడు బజారెల్లేవాడిని. రిక్షాలో మధ్యన నేను అటూ ఇటూ అమ్మ నాన్న గారు.ఒకసారి పాన్డెబజార్ వెళ్ళాము. అప్పుడు బిల్hani అద్దం కొన్నాము.నాకు అమ్మ ఎర్ర ఊలు తో స్వెట్టర్ అల్లింది పాలకొల్లు లో కూడా దాన్ని తొడుకున్నట్టు గుర్తు.మనింటి వాళ్ళూ వీళ్లూ వస్తువుండేవారు. సత్యాగ్రహి mama ఒకడు. ఆయన ఉద్యోగమేమీ ఉండేదికాదు డిటెక్టివ్ నవలలు రాశాడని అమ్మంటూ ఉండేది.ఒకసారి నాన్నగారు ఊరెళ్ళారు. తరువాత ఆ ఊరికి మేమూ వెళ్ళాము. పాలకొల్లు దగ్గర పూల పల్లిఅప్పుడు వచ్చాడు సత్యాగ్రహి మామ. అమ్మ గొలుసు డబ్బు కోసం కుదువ పెట్టింది. తరువాత అమ్మ మేము పాలకొల్లు వచ్చామనుకుంటా. సత్యం చెప్పాలి ఈ విషయం .
 కాగితపు పూలు కలల వెంటరాలు కనులవియే కనుగొనిన వెనువెంటనె కనులరమూతలగునిదురన చెదిరినగురుతులు ముదిమను తెరగప్పు తరతరములు గడిచి సడిలేక బతుకున పంతపు  చిదుకుల మంటన చలికాగి చింతన మరి జవచచ్చిన తరి తరువేదని ఎన్చెడి మదీ ఇది తరుణము ఋణ విమోచన జాగరణకు. నిశాదివస పర్యంతము తలి తండ్రుల  చింతజేసి కల్పనలేక అశ్రు తర్పణ మొనరించెదగాక...

పాలకొల్లు ప్రయాణము.  విజయవాడలో దిగినతరువాత పెద్ద పొట్లంతో అమ్మ మేన బావ ఇడ్లీలు తెచ్చినట్లు గుర్తు. నాన్నగారు ఇంజను దగ్గర వెన్నీళ్లు పట్టి తెచ్చారు. మేము రైలు మారాము. నన్ను  పగటి ప్రయాణం. రైలు ఖాళీగానే ఉంది. కాసేపు కిటికీ దగ్గర కూచున్నా. కంట్లో
 పాలకొల్లు ప్రయాణము.  విజయవాడలో దిగినతరువాత పెద్ద పొట్లంతో అమ్మ మేన బావ ఇడ్లీలు తెచ్చినట్లు గుర్తు. నాన్నగారు ఇంజను దగ్గర వెన్నీళ్లు పట్టి తెచ్చారు. మేము రైలు మారాము. నన్ను  పగటి ప్రయాణం. రైలు ఖాళీగానే ఉంది. కాసేపు కిటికీ దగ్గర కూచున్నా. కంట్లో బొగ్గునలక పడింది. అమ్మ  కళ్ళు పెద్దవి చేసి కొంచం తనచీరకొంగు కొసతో నలక తీసింది. కొంగు ఉందా చేసి కాపడం పెట్టింది. తర్వాత అమ్మ అక్క ' వీడిని ఓ కంట కనిపెట్టాలని అనుకున్నారు.ఒక పెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది. నాన్న గారు మంచి నీళ్లకోసం ప్లాట్ఫారం మీదికి దిగారనుకుంటాను నాకు కూడాబడడము అలవాటు కదా. కానీ పెద్దక్క కనిపెడుతూనే ఉంది. చెయ్యి పట్టుకు ప్లాట్ఫారం మీద బొమ్మల  బండీ,  బన్నులబండీ జనాలవైపు నా ద్యాస మరల్చింది. నాన్నగారిప్పుడు వచ్చారో ఎంతెచ్చారో గాని పెద్దక్క అమ్మ సత్యాల దృష్టి నామీంచి మళ్ళింది. అమ్మ చిన్ని, శిరీష్ లతో బిజీ అయ్యుంటుంది. వూరిపేరు నాకు తెలీదు కానీ గబుక్కున రైలు దిగేసాను.   దిగే వాళ్ల తోబాటు ప్లాట్ఫారము   మీదికి దిగజారాను.ముందుకు నాలుగడుగులేసాను. రైలెళ్లి పోతోంది. తరవాత నేను ఎత్తు బల్ల మీద కూచున్నాను.  కానీ బఠాణీలు తింటున్నాను.ఈలోపు ఒకాయనొచ్చాడు. ఉంగరాలజుట్టు కళ్ళజోడు నల్లగా ఉన్నారు , ఆయన వెనకాల నాన్నగారు. గుర్రం బండి మీద నేను నాన్నగారు, చిన్నన్న గారు సైకిల్ మీద. (చిన్నన్న గారిది ర్యాలీ సైకిలు. దీని గురించి మళ్లీ చెబుతాను. ) పాలకొల్లు చేరాను. నా మొదటి వంటరి రైలు ప్రయాణం ఆరేళ్లప్పుడు మొదలయ్యింది.ఎంత గమ్మత్తు, వెనకాల చిన్ని శిరీషు లు చిన్నవాళ్ళు.పెద్దక్క సత్యము పెద్ద వాళ్ళు. అమ్మ నాన్న జేజలు . ఇంతమందిని వదిలి వంటరి ప్రయాణము అప్పుడే మొదలయ్యింది. ( ఇప్పుడెంత విచారించేమి లాభం, అమ్మ లేదు, నాయనగారు లేరు, పెద్దక్క లేదు. సత్యమున్నా మల్లెతీవ లల్లుకొన్న కదంబ వృక్షమై వూర్ధోన్ముఖయై వర్ధిల్లుతోంది. చిన్ని తన జీవన సౌరభాన్ని బావగారి ఇలవేలుపుల పరిచర్యలో అంకితం చేసింది.తన ప్రాపుకోసమెళ్లినా తన వసంత కుంజ మంజన క్రియలో అనవరతయై శోభిల్లతూ  కుశలమడుగుతుందేమో. శిరీష
 శిరీష కుసుమ పేశల మీమె  సుకుమారము. పుట్టిన క్షణమున ఎగ్మోర్ ఆసుపత్రి నర్సమ్మలీమెను అరచేతుల నెత్తుకున్న ఒత్తుకునునేమో యని గుసగుస లాడి రట. ఈమాట ఈనోట ఆనోట విన్నది కాదు, పెద్దత్త, అంగల్లు గారు, అనపర్తిలో, సింహాద్రి బావ గారింట, ముచ్చట్ల మధ్య యన్నమాట.చిన్ని గురించి అచ్చమ్మాళ్ వదిన 'కళ గల పిల్ల రాముడు మామ మూడో కూతురు, అని బంధువర్గం లో ఉటంకించేది .) సరే , ఇక నా కథలోకొస్తే, పైన ఇరువురు, క్రింద నిరువురు. తరువాత నేనే పెద్ద నయ్యాను. పాలకొల్లు లో ముందు పాక ఇన్టి లోనున్నాము.
రాగద్వేషాలు పూర్తిగా వదిలేస్తేనే రసాస్వాదన సంపూర్ణం.
సంతోషాలు అనుమానాలు అవమానాలు అపార్ధాలు
అనుకోనిప్రయాణాలు
అనేకరకాలవ్యక్తులు
వారి ఆదరణ అనాదరణ
తిరస్కరణ వారి నిష్క్రమణ
వారి వలన
తామరతంపరగా వచ్చిపడిన సంఘటనలు
కొత్తవ్యక్తులు
అన్నిటిని గుర్తున్నమేర
గుర్తుచేసుకుని
హార్నీ అప్పుడెంతో ఖంగారు
దుఃఖాలకు 
లోనయ్యారు 
అని తేలికగా నవ్వుకోగలిగితే
కర్మబంధాలనుంచీ విముక్తి కలగవచ్చునేమో!
 వివరమది పూరకమే.....విషయ పునరుక్తము కాదు సంగతుల నరయ ..వేరెవరు మూర్కొన విధిగాక..కలసి పెరిగి అలసి తరిగి విరుగు  ఆనాటి కలల బాల్యము..ఒకనాటి విద్యానవము.కనమూ నేడ 'ని నే చిన్నపాట( తుని పట్టణ ప్రాపున మన మున్న తరి, )మనసును కలచివేయు నీనాటికి. పెద్దక్క కన్నీటి వరద విధికేదురీతకి సాక్షిని..
 ఔను  కేవలం
సాక్షీభూతులు నిత్యసంతుష్టులు
రాగద్వేషాలు వదులుకున్న మరుక్షణం
చేరుతారు ఆనందార్ణవం
కేవలం సత్యదర్శనం 
చేయగలదు సర్వబంధ హననం
సర్వదుఃఖ హరణం
చేర్చగలదు ఆవలితీరం
 గిరిన   తరువు  ఒరిగిన గిరికేమి వొనరు ఒకపరి చిరిగిన బ్రతుకు మరిమరి తవిరినయూపిరిలుడుగువారు తండ్రి,యామె తల్లి విధివ్రాసే కథ పలు విధముల    మలుపుల మాటు  చెలగాటమున.        పరికించి చూచిన తనయూహల మించి కథ యొకటి నడుచు, మదినెంచని మనుజులు కూడి విడివడుచు, వృద్ధియొ కృద్ధమొ  సిద్ధమగు క్రొంగొత్త చివురులు, వేనికి బంధములు జీవికి,?  తన హృద్భాషన   ఘోషిల్లును తనదో తన మనమున నిలచిన ఘనరూప భ్రాంతిదొ      నిద్రన సైతము నిలువరించు జ్ఞాపిక.
 . పాకవెనకాల నీళ్ల కాలువ ఉండేది. మొక్క మొటీకా కొట్టించి శుభ్రం చేయించి నట్టు న్నారు కాలవకి నా పచార్లు మొదలయ్యాయి. లోతు ఉండేది కాదు ఎవరి వెనకలో పోయే వాడినేమో సత్యాన్నడగాలి . ఒకసారి జలగలు పట్టుకున్నాయి నాకాలిని . పీకితే రావే. నొప్పిని లేదు కానీ కొంచం కొత్త చేత  భయం పడ్డాను. సత్యమే ననుకుంటా  అమ్మ దగ్గరకి తీసుకెళితే పసుపు రాసిందో ,ఇంగువ పూసిందో జలగనే లాగిందొ కానీ బతికి బయటపడ్డా.జలగలు ఇంట్లోక్కూడా వచ్చేసేవి.  ఒకసారి అమ్మ వంటిల్లు చూడమని ఏదో పని మీద పెరట్లోకెళ్లింది. చద్ది అన్నం గిన్నె పొయ్యి పక్కన వుంది  . ఒక గోధుమరంగు కుక్క చొరబడి గిన్నెని కరిచింది. నేను దాని తోక పట్టుకుని లాగినా అది అన్నం గిన్నెని వదల్లేదు. నా కేకలకి అమ్మ పరుగెత్తుకు వచ్చింది. కుక్క గిన్నెతో సహా పారిపోయింది.నేను చిన్నాన్న గారి పాపాయి ఆకుక్కని గుర్తుపెట్టుకు కనబడిందాక వెతికి రాళ్ళతో దాడి చేశాము.   పెరట్లో వరల నుయ్యుండేది. అమ్మ గిన్నెలక్కడే శుభ్రం చేసేది. అప్పుడప్పుడు కాకులు చెంచాలు నెయ్యి గిన్నె ఎగరేసుకు పోయేవి.  నేను  పక్కింటి పెరట్లో గట్రా వెతికేవాడిని. పాకింట్లో వుండగానే నాకు జబ్బు చేసింది. లివర్ కంప్లైంట్ అనుకున్నారు. చిన్నన్న గారు భుజంమీదేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించేవారు. నాకు పొడుగు లాగూ కట్టించారు.  నేను  జలగల భయమో,  బెక బెక కప్పల, కీచు రాయల భయానికి  నా కలవరింతల కారణమోగాని , ఇల్లు మారిపోయాము. ఈసారి పెంకుటిల్లు. ఎడమపక్క వాటాలో ఉండేవాళ్ళం.  . పాప్లీ పుట్టినరోజు భారీ గా జరిపించారు. అమ్మ అక్కలు అప్పచ్చులు చేశారు. తలంట్లు తప్పలేదు.  పాప్లి పుట్టినరోజు పండగ ఇక్కడే ఘనంగాజరిగింది.సంవత్సరం జరిగిపోయిందపుడే మద్రాస్ నుంచొచ్చి.
తాతగారగారు వచ్చారు. ఆయనకి కాకీ కాన్వాసు బూట్లుండేవి. నేను ట్రై చేసేవాడిని. ఆయనకి పెద్దక్క అంటే చాలా మక్కువ. ఓరోజు ఇంట్లోకొంచం హడావుడి. అక్కని వారగా కూర్చోబెట్టారు.అక్క కొంచం దుఃఖము గా ఉన్నది. తరువాత అక్కకి స్నానం చేయించారు.పిన్ని వాళ్ళు వచ్చారు. అక్క ఇంకా ఇంకా ఎవ్వరితోటీ మాట్లాడటం లేదు. తాతగారు మన్నన చేయబోతే పెరట్లో కొబ్బరిచెట్ల దగ్గరకు పారిపోయింది. తాత గారు పాపము కొంచం సేపు ఓదార్చే ప్రయత్నం చేశారు.            . సత్యానికి నాకు బడి హడావుడుండేది.  నాకు బళ్ళో ఎక్కాలు ఆ ఆ లు , పాటలు లీలావతి పంతులమ్మ గారు నేర్పించేవారు. మేము చాలా ముందే బడికి వెళ్ళి అరచేతులతో క్లాస్ రూమ్ శుభ్రం చేసేవాళ్ళము. గచ్చి మట్టి నేలో గుర్తు లేదు. అబ్బులు  నాల్గో క్లాసో మూడో క్లాసో. వాడికి చాలా విషయాలు తెలుసు. గోడింబిల్లా ఆట, బచ్చాలాట, కాలవలో ములుగీత వాడిని లీడర్ చేసేసాయి.చిన్నన్న గారి పాపాయి ఇవేమీ రావు.నేను అబ్బులు చేసేవన్నీ ట్రై చేసేవాడిని. వాడిదగ్గర అప్పుడపుడు డబ్బులుండేవి. పెద్దది బేడా. వాడు కొన్నుక్కు తినేవాడు. ఎప్పుడూ వాడేమీ కూడా తిరిగే వాళ్లకు పెట్టిన గుర్తులేదు.సత్యం నన్ను రెక్కలట్టుకు బడినించి కొన్నాళ్ళు ఇంటికి తీసుకెళ్లినా తరువాత తరువాత  ఒంటరిగా ఇంటికెళ్ళే వాడిని. గురింబిళ్లా ఆటలో డేక్కుంటూ బ్రహ్మాడి కొట్టుదాకా వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. మెయిన్ రోడ్డుమీద అంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో బ్రహ్మడి కొట్టు ఉన్నది. నేను అప్పుడప్పుడు సత్యంతో వెళ్ళి కొబ్బరికాయ పప్పు ఉప్పు కొనే వాడిని. అప్పుడు నా
 కానీ , అర్ధణా,బేడాలతో కొనుక్కోవచ్చు అని తెలిసింది. ఒకరోజు వర్షం వచ్చింది. ఆరోజు బదిలేదు.పాపాయి, అబ్బులు,మడుగులవాడు,నేనూ కాలవకెళ్ళాము .నీళ్ళు తూము నిండుకు  తోసుకుంటూ  అవతలకురుకున్నాయి.(ఇంటి వెనకాల కాల్వ బడికెళ్ళే దారిలోనే. పొలాలకి,    సిమెంట్ తూము పైనుంచి కాలవ దాటుకు వెళ్లాలి.) అబ్బులు నీళ్లలోకి దిగి తూము గుండా అవతల పక్కకి వచ్చాడు. నేనూ దిగి తెలీకుండానే నోరు మూసుకు కాళ్ళతో  తూము క్రింది అంచును తన్నుతూ చేతులతో నీళ్ళని వెనక్కి తోస్తూ బయటకొచ్చాను. పాపాయి నాచెయ్యట్టుకు ఇంటికి తీసుకొచ్చాడు. నేను తడికి చలికీ కొంచం వణుకుతున్నాను. అప్పుడు వెర్రి వెధవాయనీ అమ్మ నా తల తుడిచింది.  తరువాత కాలవలో  ఈతలు కొట్టే అవకాశం ఎప్పుడో వచ్చింది
పాప్లీకి నడకొచ్చింది.  పాలకొల్లులో  రైలు గేట్ దాటింతరువాత హైస్కూలు తరువాత మిషన్  హాస్పటల్  తరువాత లాకులు ,లీలా మహల్ సినిమా హాలు, బోస్,నెహ్రూ,గాంధీ ల బొమ్మలు, పెద్దగోపురం చిన్న గోపురము మారుతి టాకీస్ ఉండేవి.పెద్దగోపురం శివాలయంలో  సంక్రాంతి  ముందు నుంచి శివరాత్రి దాకా  ఉత్సవాలు జరిగేవి. పెద్ద గోపురము ఇరుకు మెట్లబచుట్టుతో ఉండేది.పెద్దక్క సత్యంలతో ఒకసారి గోపురమెక్కాను.చాకలి దాడు గారు  హరికథ చెబుతూ సినిమా పాట వరస లతో  భక్తి పాటలు పాడేవారు. చిరుతలు కొట్టేవాడు. అబ్బులు గాడు నాపరాయిలతో అలాగే కొట్టేవాడు.పాలకూర పాటవరస తోటి ఉపాటుండేది,ఓంహరాశంకరా పాట కూడా పాడేవాడు. డాన్సు చేసే వాడు. హరికథ కెళ్ళాలంటే  చాలా హడావుడివుండేది.చాప హరికెను   లాంతరు, కర్ర మంచినీళ్ళ చెంబు ఇన్ని దాలని తాతగారి రూల్. నేను చిన్నీ నిద్రపోయేవాళ్ళం.
 చిన్నన్న గారు చార్మినార్/ దక్కన్ సిగరెట్లు  కాల్చేవారు. ఖాళీ పెట్టెలతో పిన్ని బొమ్మలు చేసేది.గుర్రం రధము అలాంటివి.  నాకు అబ్బులు సిగరెట్బపెట్టే, బచ్చాల విలువ ఉపయోగం మారకం నేర్పించాడు. అవి ఎరడంకోసము లాకులకెళ్లే వాడిని. గుండె మార్కు గోల్డ్ ఫ్లెకూ, సీజర్స్ చాలా విలువైనవి.  నేను డబ్బులు గురించి కూడా గ్రహించాను. నాన్నగారు డబ్బులు తెచ్చి ఇంట్లో గడిపిన బొమ్మలు పెట్టుకునే అరవుండేది, దానిపైన చిల్లరగా పోసేవారు. అవి గుప్పిడితో తీరుకు ఒకసారి బడవతల బ్రహ్మాది కొట్టుముందు హోటల్లో అబ్బులకి, మడుగులాడికీ సూరిగాడికీ ఇద్దెన్లు బర్ఫీ పార్టీ ఇచ్చాను.పాపాయి గాడు తిన్నాడో లేదో గుర్తు లేదు గాని పిన్నికి ఆవిడ ద్వారా అమ్మకే కంప్లైంట్ చేసాడు.నేను పాడైపోతున్నానని నాన్నగారికి అమ్మకీ తెలిసిపోయింది. తరువాత నాన్న గారు నన్ను సత్యభామ అత్త వాళ్ళింట్లో హిందీ ప్రైవేట్ లో చేర్పించారు. ఆయనా తాతగారే. నాన్నగారి పిన్ని మొగుడు. ఐతే సత్యభామ అత్త దేవతలాగ ఉండేది.చిన్నప్పుడు ఆడవాళ్ళదరూ అక్క సత్యాలతో సహా దేవతలని ఘాడంగా నమ్మే వాడిని. సత్యభామ అత్త నిజంగా అందగత్తేను. ఆవిడ నన్ను దయగా చూసేది. .
తరువాత భాగానికి ఎదురు చూస్తున్నాం
ఈ విషయాలేమీ మాకుతెలీనేతెలియదు
 సరే,నాన్నగారికి ఉద్యోగం లేదు కదా, మరి ఎవరు పరిచయం చేసారో తెలీదుకానీ, దొడ్డిపట్ల జమీందారువగారి అమ్మాయిcకి   మెట్రిక్యులేషన్ పరీక్షకు తర్ఫీదు ఇవ్వాలని నాన్న గారికి పిలుపొచ్చింది.  రోజూ వెళ్ళేవారు. గమ్మత్తుగా పిల్లతో పాటు తల్లి కూడా చదువుకు సిద్ధమయ్యింది. నాన్నగారితో బాటు నేను సత్యం ఓరోజు వెళ్ళిన గుర్తు. గోదావరి ఒడ్డును ప్రసుకు దొడ్డిపట్ల గ్రామముంటుంది. జమీందారు గారిది పెద్ద ఇల్లు . హాలు మధ్యలో స్తంభాలతో విశేషంగా ఉండేది.

H. Page 1

 నాన్నగారండీ, ఎంత తియ్యని పిలుపు

రాముడు మామా ఆత్మీయ సంబోధనే
ఆచార్లుగారు చెప్పుల్లెకుండానే తిరిగేవారు
ప్రవాసమెక్కడ మొదలయ్యిందో తెలీదు కానీ
నలభయ్యేళ్ళు కలిసీ విడి విడిగా ప్రయాణించాము
పదహారేళ్ళుగా కలలలోనే సావాసమండీ
మెలకువ సంగతి తెలీదుకానీ శుషుప్త్యావస్థలో 
కల లాంటి మెలకువలో కనిపిస్తూనే వుంటారు
ఎవరి తండ్రి యెవరికి మంచి కాదు
రాముడుగా, మామగా,రామాచార్లుగా,తాతగారుగా
తల్పూ తియ్యండీ మాష్టారూగారూగా
గున్నయ్యగారబ్బాయిగా హిందీమాష్టారితమ్ముడుగా
ఆయన అందరినోట్లో నానే వారు,అవునూ
అంగల్లుగారూ,మంగత్తగారూ గారాబం చేసేవారట
సత్యభామ వదినా అచ్చమ్మాళ్ళూ రంగయ్యబావా
సింహాద్రి బావ  మరీ చనువే ఏరా మామాఅని
గుండెలకి హత్తుకునేవారు కానీ దాసూ కిష్టీ 
ఒరే మామా అంటే ఓర్చుకోలేకపోయే వాడిని
అయినా వాళ్ళ అనుబంధం వాళ్ళది
అయ్యంగార్లిద్దరూ పాలకొల్లు పరిచయం
కనకంవదినె సంగతి తెలీదు కాని పిల్లమ్మంటే
చెల్లంమ్మంతా పాపంతా మాఅమ్మకి ఇష్టం
మొన్నెప్పుడో పిల్లమ్మ వదినింటికెళ్శినప్పుడు
అంటే నలభయ్యైదేళ్ళతర్వాతన్నమాట
మా రాముడు మామ కొడుకొచ్చాడని సంబర పడింది
ఒక కలలాంటి నిజమైనఅనుభూతి లో మునిగానండీ
రాత్రి మా నాన్నకలలో కని పించి పలకరించె సరికి
జాషువా గారి సత్య హరిశ్చంద్రుడి 'లేచిరారే అయ్యో'
బలిజె పల్లి వారి గళ ప్రవాహం రాత్రి మరిన్నిసార్లు విన్నా
నాన్నగారూ నేనూ యీ సీను పిఠాపురంలో చూశాము
కాని నిజమైనకలలో కాసేపు ప్రసన్న దర్శనాన్నిచ్చారు