Shared with Friends
అమ్మా ధరణీ ఎంతటి ప్రసవ వేదన నీది
విత్తు విత్తూ పెరుగుతూ నీ గర్భాన్ని తొలుస్తూనే వుంటుంది
ఆకు ఆకుకీ అన్న సారాన్నిస్తోనే ఉంటావు
పెరిగిన తరువుల ఫల భారాన్నీ మోస్తావు
ఒరిగిన తనువులని కుళ్ళని తలవక జీర్నించుకుంటావు
ఒక్క విత్తు సంతు కోటి మొలకలు
అలములు తినే జంతువులు పాలిస్తే
నేల తల్లివి వాటికి ప్రాణాన్నిస్తావు
వేటాడే వాటికీ చోటిస్తావు చీమకీ\
దోమకీ శివ కేశవులకీ నీడిస్తావు
ధన్య వే నీవు ధరణీ, ధన్య వి
మాతల్లి యశోదా కన్నయ్యనోటిని
శోధించితివిట గదమ్మ యశస్వినివైతివి
మృత్తికల జాడలేమొగాని ముజ్జగముల
కవల ఘీంకార హుంకార పదఘట్టన
ప్రేంఖణానంద వరాహ ద్యుతిని
ఉగ్రహిరణ్యగర్భఛేదక ప్రహ్లాద వరద
నారసిమ్హ విజృంభణమును
కమఠ గ్రాహక ధరణి శయ్యా విలాసమును
హాలాహలస్ఫోఠక దేవ దానవ సంక్షోభితక్షీరార్ణవమును
ఉళగళంద విశ్వరూప బలిహార ప్రకటనను
పురుషోత్తమ గురు రామ ప్రాభవమున్ను
నిజ నేత్రమ్ములజూజి చూడజాలక
మూర్చితవైతివి ఓయమ్మ యశోదా
మాఇండ్లను కడవల పాలుపెరుగుంచితిమి
పంపుమమ్మ కన్నని మా కష్టములు కడతేర్చగ!
satya lakshmistp@gmail.comblogspot
All is not well with the concept of GOD
And to presume HE to be what not of me is ODD
Whence we came to count nothingness AROUND
So be His mystic aura of birth and death SURROUND
The flowing waters, the imposing mountains
The impassable Oceans, the blinking of stars
the jungles and the habitat that sing and dance
All seemingly smile at us,the clumsy mongers of wars
knowing the music of life, they
stare at large for the dooms day
No comments:
Post a Comment