Tuesday, December 12, 2017



PURSUIT OF HAPPINESS



pursuit of happiness may end up in
pursuit of excellence, sense may 
sprout, in seeking the meaning 
of life, while you are awake as well
asleep, though the presence of mind
never go bereft of sensory body thine.
Oh soul, the bearer of light unto body,
Go awake go awake seek not thee
Another body and another time
To marvel what it could be like
To bear more of body
That thwarts thee
with grime and glee


కారణమరయ నే వెదుకబోయినది పసరువేది
కవన కవితాఝురీపాతము సిగను జుట్టిన అపరశంభు డతడు
త్వమేవాహమన్న సరస్వతీ కంఠాభరుణుడు కాళిదాసు
చోరుడు శిఖాపాశమైన మయూరుడు చెవిపోగైన
భాస దాసుడు హాసపూర్ణమైన హర్షుడు హర్షమైన
ఈతడు కవికుల గురువట కాళిదాసని గురుతట
అమ్మ చూచిన తరి, రాలు పుంభావ సారస్వతమౌనట
అట్టి యాకుందేందు మాత మాయమ్మ సరస్వతి ఇచ్చు మహిత
నాదు పదములు బ్రష్ట ధ్రష్టములుగాక దివ్వెలైవెలుగు
తెలుగున కోరితి అమ్మ యశహ్ కీరితి తమ్ములరయ
కాలమెరుగ కమనీయ గాధల గారవము నిలిచి బట్టకట్టగ
కృపనిమ్ము తల్లి పోతరాజుల కైత అన్న నన్నయ దీమతి
ఎర్రన్న తిక్కన్నల వెన్న కలపిన తెలుగు తరకల మీగడ

అను క్షణికమే



యుగ సంధ్యలకావలనా మృగ తృష్ణల కావలనా
తెగ తెంపులు లేని కాల కల్పనల సత్యస్పందన
సగ జీవితం నిదురలో విగతమయి మిగులు
పగ లో తెగ వెంపర్లాడే నిజ నైజపు తెగులో
యుగాలుగా వెదజల్లబడిన ముళ్ళపొదల్లో
కీటకంగానో ఖగనగమృగంగానో పుట్టి
భ్రమలో భ్రమరాన్నై మనసును పెంచుకు
మనిషిగా పుట్టాను కానీ పూర్వ సువాసనలు
మస్తిష్కాన్ని పట్టి పల్లార్చుతూనే వున్నాయి
నాలోంచి తొంగి చూసే పశువు కసవు మేస్తూనేవుంది
క్రిమికీటకాంశలు జాగృదమౌ తోనేవున్నాయి
వెనక్కి పరిగెట్టి మది మొదలెక్కడో పట్టుకుందామంటే
నిద్రలోనూ స్పృహా విహ్వలతే, ఏ గర్భంలో
విత్తు మొలకెత్తిందో ఏ మర్మంలో బుధ్ధి వికసించిందో
యీ జన్మలో విపుల మయ్యింది కాని
వివరము మరుస్తూనే వుంది ఏమరచి
సత్యస్పృహలో విహరించినా అది అను క్షణికమే