Shared with Friends
ఓయమ్మా లాలి వద్దే జోల వద్దే
చెప్పవె కధా నిదురా రాకున్నదే
చెప్పెదా మాయన్న నీకు రామన్నకధ
తప్పకా వూకొట్టి నీవు ఆలింప వలె
జేజె లెల్ల చెవులప్ప గించి వినగ,
తప్పులేక రామకధ చెప్ప దొడగె మాత
మొదటన నూకొట్టె హుమ్మనుచు,
వినుచుండేనో, కనుచుండేనో గాని
కన్నయ్య కన్నులర మూత వడె!
అన్నాన్నా, 'కపట వేషి రావణుడ న్న'
స్వరము తల నిమురు యశోద
కర స్పర్శ న పొడమెనొ ఏమో,
హుమ్మనచు కన్నడు హుంకరించి,
'ఏది నా బాణము, తెమ్ము లక్ష్మణ,
నే రావణు శమించి సీతనుగాతు'
ననుచు, చెయ్యనలేచె నిదుర!!
నిజమో, కలయో, మాయయో
నెఱుగనేర్వక నివ్వెర జెన్దిన యశోద
హా రామచంద్ర యని కయిలు మొడ్చె!!
ఆర్త త్రాణ, కృష్ణ! తల్లివి, తండ్రివి, గురుడవు
చేతానాచేతనములందు స్ప్రుహానిశ్ప్రుహ లందు
జనన మరణములందు సకలజీవులన్దు
యెన్నుదుముగ నీ రక్ష , దానవోద్రేక స్తమ్భక,
కలి భంజక. జ్ఞాాన మొసవవె సకల జీవులకు!!
No comments:
Post a Comment