Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

7 July 2018 
Shared with Friends
మందలించగ రాదల్పజీవులనైన
మనదికాని చోటను,తూలెడునోటిని
లేని ప్రేమను తెలియని గురుతును
వలయనేర్వగరాదు ఆపదలందైన
పెదవుల మడతన మది వెలుగొందు
పదముల మాటున మది దాగియుండు
చెద తగిలిన కాగితపు బతుకు పొద
రేగిన మంటలు దగ్ధ విన్యాసములె
సమమౌ మనిషి మనసున చెలిమి,
బతుకౌ మిసిమివసుధైక స్పూర్తిన
కలసి మెలసి కావ్యకళా రీతియయ్యె
గమన శీలత తొల్లిటి బాట మనది

No comments:

Post a Comment