Satyanarayana Charyulu Maringanti
జలమున మొలచిన గాలి తరగ
నిలవను తలమున నీటి బుడగ
గడచిన కాలమె చీకటి కూపము
నడచెడి నేలన బుడగలు జీవులు
చిటికె పాటున రేపున మునగమె
కనము నేటికి చీకటి పడిగెను
పగటి కలల బతుకు నీటిబుడగ
పొగరు బిగువు కరుగు పొగమంచు
చీకటి చాటున నేటికి చెల్లెడి చెడుగులు
కాలుడి కోరన రేపటి చావుకు అడుగులు
కాకలు తీరిన యోధులు కాలము చేసిరి
కాలపు నిడివిన వెలిగెడు వారలు తారలు
వారలు ధృవ తారలు సత్య వ్రతులు
అవతారములని వ్యవహారము కాని
ఘన జీవన ధన సంపన్నతన నిలచిరి
వారికి ఫణి రాజు నిలచి నీడ నిచ్చి మెచ్చె!
No comments:
Post a Comment