Satyanarayana Charyulu Maringanti updated his status.
సుడితిరుగుచు వడిన సూర్యునిజుట్టు
చీకటి వెలుగగుచు ఋతువగుచు
నీటిని నిప్పును కడుపున నిడుకొని
తిర్యగ్జడముల ప్రసవించుచు, పెంచుచు
మరణించిన అక్కున జేర్చుకు రొక్కుచు
నాదు తల్లి పుడమీ, పాత్రత నీయక
పాదముల మట్టి చెట్టు చేమల త్రొక్కి
సకలముల వికలముజెందక తిని
నీదు గర్భమున నడయాడెడు మనుజుడ
నేడు తల్లినితలచు దినమట ఋజువుగ
నీవతల్లులకు తల్లివికావె వందనమమ్మ
No comments:
Post a Comment