Satyanarayana Charyulu Maringanti
మనోగతంలో నేను తోకచుక్కని,ప్రతి రాత్రీ
ప్రసూతి గదిలోంచి వేగుచుక్కకేసి ప్రయాణమౌతా!
ఉషోదయంతో వూపిరిలో స్తబ్ద మై పొతా !
మేధస్సు కళేబరాన్నివిద్దెము చేయిస్తుంటే,
మనసు వనరుహ సోభితమౌతుంది!
కలవరింతల మధ్య తోక తెగిన చుక్కని.,
పగలన్నా పరిగెత్తి ధృవమవ్వాలనుకుంటా!
న డ క తో ముందుకీ వెనక్కీ ముడులేసు కుంటూ,
పగలు పడవ ఎక్కి సన్జకెన్జాయలొ మంద్రమైపోతా!
చుక్కల చీకట్లో గ్జ్నాపకాల నెరసులతొ చలి కాగుతా!
ఎన్ని సన్ధ్యలు వాటారి పోయాయో.,
స్నిగ్ధమయిన కలలు కొన్ని,
వీర బూసిన వూహలు కొన్ని,
దగ్ధమయ్యే వర్తమానం
ప్రసవించిన మృత్తికా పుష్పాలు.,
అవును అవి సౌగంధిక పారిజాతాలే,
సత్యశోధనలో నా ఆత్మ ఆవిష్కరించిన,
అమృత స్వర రాగ సుధలు!
No comments:
Post a Comment