Satyanarayana Charyulu Maringanti
మనసా పనిచేస్తోనే పనిలోపనిగా
సామ జ వర గమనాన్ని గమనించవూ
గతి మాలి స్తితిలోనో స్తితిమాని గతిలోనో
లోకమలోకంగా అల్లుకుపోతావేమీ.
ప్రశ్నిద్దామనుకుంటూండగానే
జవాబుల తోరణంతో గళాన్ని కట్టేస్తావు
ఒక లిప్తపాటు నేను నన్ను గమనిస్తాను
మరోలిప్తలో నీలో ఐక్యమై నివురైపోతాను
ఈలోగానే ఎంతోదూరమైపోతుంది లక్ష్యం
అక్షరాలా నువ్వూ నేనూ నీడానిజమూ
నీడలో ఆడే మనసా చీకటి చేరువే
జాగ్రత్త నీకా నాకా వెలుగులో వున్నప్పుడు
నాకు నీడలోవున్నప్పుడు నీకూ ప్రాప్తవరాన్నత
ఎమో నువ్వూ నేనూ వెరేమీ కాదేమో
ఆత్మోత్తిష్టతకి తధా గతి కావాలా
తధాగతుడనే కావాలా,
ఎదైనా సులువే అలోచనకి కానీ
ఆచరించేవి నా నయనాలూ కరచరణాలూ
మష్తిష్క సహిత నా జీవన ధనువు
వుత్తేజకరమే వాగ్రూప ప్రచోదనము
కానీ హోతాగ్ణులు హవిస్ఫర్యంతమూ రగలాలి
ఔనా ఎమో సందేహానికీ,దేహానికీ వారధి
మనసూ నువ్వేగా,నాతోదు నీడ వున్నంతదాకే
ఔనుకదూ,ఐతేనేమి మరపూ తెరుపూ
నా లక్షణమైతే,మాయా మోహం నీ స్వభావం
అందుకే సామ గానమూ వేణు నాదమూ
మనో విపంచికను తపోమగ్నము చేస్తాయి
అవి ధారణకీ విచారణకీ అమృతధారలు
ధారాపాత జీవనము అశనిపాతము కారాదు కదూ,
అందుకే పునరపి శ్వాసావాసాలకవల కలుద్దాము
No comments:
Post a Comment