Satyanarayana Charyulu Maringanti
కడలికి గలదు చెలియలికట్ట
కదలి వెడలి కడకు మొదలగు
అలల పగిది మరపు తెరపులు
నిదుర చెదిరి నిజము మిగులు
వెలుగు కొలిమి వయసు మదము
చివికి చిదుకు కడకు బతుకు
నిజము నిప్పు గతము విప్పు
తనను కొలుచు తనువు గుట్టు
అది నాది ఇదియునాదను నేదియొ నది
నా పిడికిట నిమడని గుప్పెడు మనసు
నాది నేను నావలన యనునది నిజమతిశయము
అవలనివల నేతెలియని కాలుని నాల్కన
జీరెడి జీమూతము మరణాంతక మస్తకము
మాయందురు నలుపందురు విరుపందురు
మతి యెరుగని గతిగాక విడివడని
చితి వ్రేల్చెడి సిఖయౌ విడివడి
అతను నితను యను ధ్వనులెల్ల
తనువుల మధ్యందిన తరతమములె
ఆమె ఈమయను మేనిచందమ్ముల మధ్య మేదిని
అవియివియను అవ్యయముల మధ్య నవ్యమగు
గరిమన ఘనము లఘువున లాఘవము
విశ్వమున అంతరాళ మరాళ విపంచక
ఘోషిత అనంతకాలచోదిత ప్రళయహేల
మదకువలయాపీడిత వున్మత్త క్రీడయౌ
యెంచినమంచి యెంచని అంచున
కడగగ రాని పంకిలమున కమలమౌ
పొంచిన చెడుగు కనుపాపల కనగరాక
కనక మను వ్యసనమున కనుకట్టౌను
పరికించి యెంచునొకడు పరమశివుడె ఇహమని
తలనొంచి తలంచునొకడు సహచరుడు హరియని
తలనొంచి కైమోడ్చి వుత్ఫుల్ల ఫలములెల్ల
నీవనీవవె యని ఎలుగెత్తి యేడ్చునెల్లరు
హటించి ఊపిరులనుగ్గళించి వున్మత్తుడౌనొకడు
నడయాడెడు తెరగువదలి నడిమి యడవిన
తిరుగాడుచు తపమొ యోగమొనెంచు
వాలకరవాల రహిత ఖిల్యులెవారు
No comments:
Post a Comment