Satyanarayana Charyulu Maringanti
అమ్మలార కొలువైనవి బొమ్మలు
.
అమ్మలార కొలువైనవి బొమ్మలు
చిన్ని పాపలకు కొన్నవి కొన్ని,
కొండపల్లి ఛలాకి బులాకీలు కొన్ని
కనక మాలచ్చిమి కల్యాణమప్పటివి కొన్ని
రామ తీర్థములో పిన్నిగారిచ్చినవి కొన్ని
ఉప్మాక తీర్థమప్పుడు తుని
అమ్మమ్మ గారిచ్చినవి కొన్ని,
కోటప్ప కొండ తిరణాలవి కొన్ని,
లక్కపిడతలు రాతి బొమ్మలు,
చిలిపి క్రిష్నుడు,చిన్న రైలు,
టమటమాల బండి
,తరతరాల చెక్క సిపాయి,
పాల పిట్ట,పూసల పేరులు,
కాసుల రాణీ, ఇంటి పిల్లి
,బొమ్మ కుక్క,వంట పాత్రలు,
నెల్లూరి నెరజాణ,బతకమ్మబుట్ట
కొల్లేటి కొంగ,నవ్వేటి బుద్ధుడు
రాళ్ళ బొమ్మలు,రతనాల బొమ్మలు
పూలు,పళ్ళు,బళ్ళు వోడలు,ఎన్నెన్నో,
కదిరి తేరు,కర్నూలు చరఖా,
నంద్యాల నంది, లేపాక్షి బసవన్న
తాటాకు టపాకాయి అమ్మాయికి,
సిసింద్రీ అబ్బాయికిచ్చి మాఇంట పెళ్ళి
పిల్లపాపలతో రారండి
మా ఇంట వాయనము,
మీ కొంగు బంగారమండి
, రారండి రారండి . కొలువైన
కనక డుర్గమ్మ పేరంటమండి
No comments:
Post a Comment