సంఖ్యా+అణ్, సంఖ్యాయతే అత్ర సంఖ్యా సమ్యక్ జ్ఞానం సా అత్ర అస్తి] సమ్యక్ జ్ఞానం కల్గించునది. సాంఖ్య దర్శనము.
సాంఖ్య[2] : సంస్కృత-ఆంధ్ర నిఘంటువు
సాంఖ్యమున యోగమె వివర మరయ
యోగమున సాంఖ్యమె దార్శనిక గీత
ఎవ'రెవర''నితననితా ప్రశ్నించిన
తిమిరపు తెర తొలగి
తొలుత అనుమానము నెనెవరని
వయసు వెనుకకు తిరుగు మనసు
బుధ్ధి దారి చూపిన దనుకజారు
గురుతుల దొరక బుచుకు
తను నేనెవరను దీపసెమ్మన
చీకటి కలుగు విడచి వివసత వదలి
శైశవ దశ జేరి అమ్మను జూచు
కళవళ చెందు మనము సేదతీరు
మరి మస్తిష్కము ఆత్మ పధము
భ్రమన మరువకున్న దారి సుగమమౌ
లెక్కకు రెండు చింతనలు
తను తన మనము
మనమునకు సైతము
మరి రెండు స్పృహలు
సశరీర భావన
సదైక ఆత్మ స్పర్శ
ఆత్మకు సైతము ద్వయీ భావము
చిద్దత్మ సదాత్మ
సచిదానంద స్పృహ
ఎకీకృత మగుటకు తరుణోపాయము
సైతము రెంటి సమన్వయము
సధక చిత్తము సంకల్పము
దాస ప్రవ్రుత్తినమిళితము సకలములు
ఇదియె ఉథానమునకు పరమ మార్గము
No comments:
Post a Comment