Shared with Friends
కధ కల కవిత వివశత
అప్పటి పాట గాలివాటు
నిన్నమొన్నటి పదము
జంతన పొంతన అంతట
నన్నయ కనుగొన్న తిక్కన
చెక్కిన పద నట పాటవము
వూహల పలకరింపుల దండ
వెండి బంగారుపూలందందు
పొదవి భావనల కస్తూరినద్ది,
భాగవత స్పృహను మెదిపి,
విశ్వ భావన విషయ మెంచి
పదుగురి మన్ననన,
ఇలన వెలయించిరి.,
బృహత్కధలవి
తెనుగుజినుగాయె,కంటిరే ?
బాస యాస! ఊసు వూపిరి!
సింధువె బిందువు
భాషందమున గంగయె
No comments:
Post a Comment